Bigg Boss 5లో కత్తి పోట్ల కలకలం.. సన్నీ మీద పగబట్టి మరీ పాడిచిన కంటెస్టెంట్లు!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాలుగో వారానికి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వారాలకు గాను ముగ్గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా నాలుగు వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్ లు నామినేషన్లలో కూడా ఉన్నారు. అయితే ఈ వారానికి గాను హౌస్ లో ఎవరు కెప్టెన్ కానున్నారు అనే విషయం మీద కొత్తగా ఒక ఫుడ్ టాస్క్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అయితే ఇప్పుడు ఆ టాస్క్ లో భాగంగా విడుదలైన తాజా ప్రోమో హౌస్ లో కత్తుల కలకలం రేపినట్లు అయింది. తాజా ప్రోమోలో హౌస్ సభ్యులందరూ కలిసి సన్నీ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

కత్తులతో సహవాసం

కత్తులతో సహవాసం

ఇప్పటికే ఇద్దరు ఇద్దరు చొప్పున బిగ్ బాస్ టీంలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కత్తులతో సహవాసం అంటూ ఒక కొత్త టాస్క్ అప్పగించాడు బిగ్ బాస్. అందులో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్ లు హౌస్ కెప్టెన్సీ కోసం పోటీ పడుతూ ఉండగా ఆ ముగ్గురిలో శ్రీరామ్ శ్వేతా వర్మ అలాగే సన్నీ నిలబడ్డారు.

ఈ టాస్క్ లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్ లో ప్రతి కంటెస్టెంట్ పొట్ట భాగానికి ఒక మందపాటి బెల్ట్ లాంటిది తగిలించారు. ఆ బెల్ట్ మీద ఎవరికి ఇష్టం లేదో వారిని కత్తులతో పొడవాలని సూచించారు మిగతా హౌస్ సభ్యులకు సూచించారు బిగ్ బాస్. అందులో భాగంగా సన్నీ ఎక్కువ మంది పొడిచినట్టు అర్థం అవుతోంది.

ఇది ఏ మాత్రం కరెక్ట్ గా లేదు

ఇది ఏ మాత్రం కరెక్ట్ గా లేదు

అయితే సన్నీ కాజల్ మధ్య కొంత డిస్టబెన్స్ ఉండడంతో నాకైతే నిన్నే పొడవాలని అనిపిస్తుంది కానీ అన్ని కత్తులతో నిన్ను చూస్తూ ఉంటే పైన్ అవుతుంది అని కాజల్ వెల్లడించింది. ఇక సన్నీకి ప్రియా, నటరాజ్ మాస్టర్, సిరి, షణ్ముక్ కత్తులతో పొడిచి నట్లు చూపించారు. అయితే ఇది ఏ మాత్రం కరెక్ట్ గా లేదని మానస్ సన్నీతో అనడం కూడా చూపించారు.

హౌస్ సభ్యులు అందరూ షాక్

యాంకర్ రవి కూడా కెప్టెన్ హౌస్ మీద కమాండర్ లాగా ఉండాలి అని అడగగా అవును కమాండర్ కావాలి కదా సరే అని సీరియస్ గా సన్నీ అన్నట్టు కూడా చూపించారు. ఇక నువ్వు త్వరగా ఆవేశ పడతావు అంటూ ప్రియాంక సన్నీతో అనగా నా ఆవేశం పూర్తిగా నువ్వు చూడలేదమ్మా అని అన్నాడు. నువ్వు చూపించినా నాకేం ఫరక్ పడదు అని ప్రియాంక అనడంతో మిగతా హౌస్ సభ్యులు అందరూ షాక్ తిన్నారు.

సన్నీ సీరియస్

సన్నీ సీరియస్

ఇక సిరి పొడిచిన తర్వాత ఏదో మాట్లాడపోతే ఇంకేం మాట్లాడవద్దని సన్నీ అంటాడు, ఇక ఆ అమ్మాయి పొడుస్తోందని ఎక్స్పెక్ట్ చేసాను కానీ లోబో పొడుస్తాడు అని అస్సలు ఊహించలేదు అని చెప్పుకొచ్చాడు. అయితే స్విచ్ ఒక దగ్గర ఉంది బల్బ్ ఒక దగ్గర ఉందని మానస్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకళ్ళు పొడిస్తే మిగతావాళ్లు అందరూ బకరాలు అవుతూ ఉంటారు అని కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. అయితే శ్వేతా వర్మ, శ్రీరామ్ తో నిన్ను కంపేర్ చేస్తే వర్క్ లో కూడా చాలా తక్కువ గా ఉన్నావు అని విశ్వా చెప్పగా నువ్వు పొడవడం అయిపోయింది కదా వెళ్ళిపో అని సన్నీ సీరియస్ అవుతాడు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
100% ఫేక్ అని ప్రూవ్ చేస్తా

100% ఫేక్ అని ప్రూవ్ చేస్తా

అయితే విశ్వ కూడా సీరియస్ అవుతూ నేను చెప్పింది వినాలి కదా వింటేనే కదా నీకు తెలుస్తుంది అంటాడు. అయితే ఒక సింపతీ గేమ్ ఆడుతున్నావు కదా ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాయి చూడు అని సన్నీ అనడంతో విశ్వ సీరియస్ అవుతాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న డ్రామా అంత 100% ఫేక్ అని ప్రూవ్ చేస్తాను అని సన్నీ అంటాడు. ఇక హౌస్ సభ్యులందరూ తన టార్గెట్ చేయడంతో సన్నీ కాస్త బాధ పడినట్లు గానే కనిపిస్తున్నాడు. లోబో దగ్గరకు వచ్చి మాట్లాడపోగా ఆ కత్తిని తీసుకుని మరింత బలంగా గుచ్చుకోవడం కూడా చూపించారు. చూడబోతే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X