Bigg Boss 5 : పింకీ నడుమును అలా చూసిన లోబో, షాకిచ్చిన పింకీ.. అసలు నా గురించి నీకెందుకురా అంటూ రవి కూడా!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది ఇప్పటికే మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో నాలుగో వారం చివరికి కూడా చేరింది. ఇప్పటికే ముగ్గురు హౌస్ సభ్యులు ఇంటి నుంచి ఎలిమినేట్ కాగా ఈ వారం కూడా ఎనిమిది మంది హౌస్ సభ్యులు ఎలిమినేట్ కావడం కోసం సిద్ధమయ్యారు. వీరిలో ఓటింగ్ శాతం తక్కువగా వచ్చిన ఒక్కరిని ఈ వారాంతంలో ఎలిమినేట్ చేయబోతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ రోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో కుషి కుషీగా సాగిపోతోంది అనుకుంటున్న హౌస్ లో వరస్ట్ పర్ఫార్మర్ అంశం ఇప్పుడు హీట్ తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

సరదా సరదాగా

సరదా సరదాగా

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాలుగో వారం చివరి కి చేరుతోంది.. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ కెప్టెన్సీ కంటెండర్ టాక్స్ కోసం శ్వేతా వర్మ, శ్రీ రామచంద్ర అలాగే వీజే సన్నీ పోటీ పడగా భారీ మెజారిటీతో శ్రీరామచంద్ర గెలుపొందాడు. అయితే అందరూ తనకు అండగా నిలబడతారని కలలు కన్న సన్నీ కలలన్నీ కల్లలే అయ్యాయి. శ్రీ రామచంద్ర గెలవడంతో ముందు మాట ఇచ్చిన ప్రకారం హమీదాని రేషన్ మేనేజర్గా చేసుకున్నాడు. హౌస్ మొత్తాన్ని ఒక ఆర్డర్ లోకి తీసుకు వస్తాను అని చెబుతున్నాడు. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ అందరూ సరదా సరదాగా కనిపిస్తున్నారు.

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా

ప్రియాంక సింగ్ నల్లటి చీరలో అందాలు ఆరబోస్తూ వెళుతుండగా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా అనే సాంగ్ తో బిగ్ బాస్ అలరించాడు. ఇక ఆ తర్వాత లోబో అలాగే ప్రియాంక సింగ్ మధ్య ఖుషి సీన్ మళ్లీ రీ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగిన నడుము సీన్ లో లోబో ప్రియాంక సింగ్ కాసేపు అలరించారు. మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు గా ప్రిపేర్ అవుతున్న లోబో ప్రియాంక సింగ్ నడుము చూసి మైమరచిపోయి అలా చూస్తూ ఉంటాడు.

లోబో షాక్

లోబో షాక్

లోబో అని ప్రియాంక పిలిస్తే అప్పుడు మళ్ళీ సోయలోకి వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు నడుస్తూ ఉంటాడు. లోబో నీ చూపు సరిగా లేదు అని ప్రియాంక సింగ్ అనగా దానికి లోబో మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా దాని కోసం ప్రిపేర్ అవుతున్నాను అంటాడు. దానికి ప్రియాంక సింగ్ మనకి నిన్ననే మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది అంటుంది. దీనికి లోబో షాక్ అవుతాడు.

అసలు నీకెందుకురా నా గురించి

ఇక ఆ తర్వాత ఒక రింగ్ తో నడుము చుట్టూ తిప్పుతూ ఎక్కువ సేపు ఎవరు తిప్పారు అనే దానిని బేస్ చేసుకుని మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. విశ్వ, ప్రియా, హమీద ఈ టాస్క్ కోసం కష్టాలు పడుతూ ఉండగా రవి మాత్రం సునాయాసంగా చేసి చూపించాడు. ఇక రవి చేస్తున్నంతసేపు నత్త ఉంటుంది కదా రెండు కొమ్ములు వేసుకుని అలా ఉన్నాడు అంటూ నటరాజ్ మాస్టర్ ఎవరితోనో చెబుతూ ఉండగా, రవి కూడా కాజల్ దగ్గర నటరాజ్ మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడని అసలు నీకెందుకురా నా గురించి అంటూ అవుతున్నాడు.

హీట్ పెంచిన వరస్ట్ పెర్ఫర్మార్ టాస్క్

హీట్ పెంచిన వరస్ట్ పెర్ఫర్మార్ టాస్క్

ఇక వరస్ట్ ఫార్మర్ టాస్క్ రాగానే శ్వేతా వర్మ కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేసింది. నిన్న శ్రీ రామ్ కి ఓటు వేస్తాను అనే విషయం చెప్పకుండా తనను పొడిచింది అనే ఉద్దేశంతో ఆమెను వరస్ట్ పర్ఫార్మర్ గా డిక్లేర్ చేసింది శ్వేత. అయితే మానస్ జస్వంత్ ని వరస్ట్ పర్ఫార్మర్ గా డిక్లేర్ చేశాడు. ఎందుకో నువ్వు వేరే వాళ్ళ ఉద్దేశాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అనిపించింది అంటాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ ఏమేరకు ఆకట్టుకోనుంది అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X