Don't Miss!
- News పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Bigg boss 5: నీకు ఏం తెలుసురా? జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్ కు వచ్చాను: షన్ను మాటలకు లోబో కంటతడి
బిగ్ బాస్ సీజన్ 5 కాస్త హడావిడిగా మొదలైనప్పటికీ కూడా మూడో వారంలో కి వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే సీజన్ 5 లో మాత్రం కంటెస్టెంట్స్ అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.
స్వచ్ఛమైన కారణాలు లేకుండా పరిస్థితులకు సంబంధం లేకుండా నామినేట్ చేస్తున్నారని అలాగే సేఫ్ గేమ్ ఆడే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక మరికొందరు మాత్రం అప్పుడప్పుడు గట్టిగానే ఎమోషనల్ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకూ పెద్దగా ఎమోషనల్ అవ్వని లోబో కూడా కంటతడి పెట్టుకున్నాడు.
ఈసారి కూడా నిరాశే ఎదురైంది
అసలు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదని మొదటి రెండు వారాలకు జనాలు వారి స్టైల్ లో రివ్యూలు చేస్తున్నారు. గత సీజన్లోనే సెలబ్రిటీల ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. చాలా నిరాశపరిచారు అని ప్రేక్షకుల నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉండే సెలబ్రిటీలను తీసుకు వస్తారని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి కూడా నిరాశే ఎదురైంది. సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న సర్వేలలో కూడా జనాలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ కోసం కదిలిన చిరంజీవి: అతడు ఆస్పత్రిలో ఉండగా వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఇలా!
బోరింగ్ గా సాగుతున్న డ్రామా
ఏదేమైనా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం సెలబ్రిటీల విషయంలో కాస్త తక్కువగానే ఆలోచించినప్పటికి కూడా ఫైనల్ గా టాస్క్ లతోనే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే మొదటి రెండు వారాల్లో వచ్చినంత ఎంటర్టైన్మెంట్ అయితే మూడో వారంలో రావడంలేదని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి టాస్క్ లో భాగంగా అయితే కొందరు మరి తేలిపోతున్నారని పర్ఫార్మెన్స్ విషయంలో కొందరు వెనుకబడే ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మధ్యమధ్యలో ట్విస్టులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు గాని అవి ఏవి కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ కొత్త బోరింగ్ గా అనిపిస్తుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 5 Promo: ఆమె విషయంలో పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. హౌస్‌లో షాకింగ్ విజువల్స్
ఎంత ఎమోషనల్ అయినా?
ఇక టాస్క్ లో భాగంగా బిజీగా ఉన్న లోబో ఇటీవల ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. మధ్యలో షణ్ముఖ్ కాస్త సలహాలు ఇచ్చినప్పటికీ కూడా అతని మాటలకు ఏడుస్తూనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంట్లో కంటెస్టెంట్స్ ఎదుటివాళ్ళని ఓదార్చినప్పటికి కూడా మనసులో మాత్రం పొగరు తోనే ఉంటున్నారు. ఇప్పటికే విశ్వ, ప్రియ విషయంలో యాంకర్ రవి ప్రవర్తించిన తీరుతో క్లారిటీగా అర్థమైంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా కంటెస్టెంట్ ఎవరు అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు.
శ్వేత సీరియస్
రీసెంట్ గా లోబో తన ఫ్యామిలీ ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. లోబో శ్వేత షణ్ముఖ్ మధ్యలో ఒక మంచి కామెడీ ట్రాక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే షణ్ముఖ్ చేసిన కామెంట్స్ కు శ్వేత ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. షణ్ముఖ్ జస్వంత్ అలిగి వెళ్ళిపోతు.. మళ్లీ ఏమైనా అంటే పెయింట్ తీసుకుని మొహానికి కొడుతుందని ఆమె వీక్నెస్ పాయింట్ మీద కొట్టాడు. దాంతో కొంత అప్సెట్ అయిన శ్వేత క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసింది.ఇక ఆ తర్వాత ట్రాక్ మొత్తం ఫ్లాప్ అయిందని లోబో కూడా సైలెంట్ అయిపోయాడు.
కామెడీ రాకపోయినా..
ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో కూర్చుని ప్రత్యేకంగా తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇలా కామెడీగా చేస్తే ఎవరైనా ఒక దర్శకుడు చూసి మనకు కూడా మంచి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కొంత మందికి కామెడీ రాకపోయినా కూడా ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. మన జీవితం కూడా బాగుంటుంది అనే నమ్మకంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అదే నమ్మకంతో నేను వచ్చాను అని అర్థం వచ్చేలా లోబో తన బాధను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకుంటున్నాడు.
నీకు ఏం తెలుసు రా..?
ఈ క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ కలుగజేసుకొని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతా బాగానే ఉంటుందని కాస్త పాజిటీవ్ గా స్పందించడం. అయితే బాధ మాత్రం తనలో ఉంటుంది అని ఆ విషయం నీకు ఏం తెలుసు అని లోబో సమాధానమిచ్చాడు. అంతేకాకుండా నీకు ఏం తెలుసు రా అని మరోసారి అంటూ.. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ఆ బాధ ఎవరికీ అర్థం కాదు అని వివరణ ఇచ్చాడు. అందుకు షణ్ముఖ్ సైలెంట్ అయిపోయాడు.
ఇక అంతలో అక్కడికి వచ్చిన రవి ఏం జరిగింది అని అడిగే ప్రయత్నం చేశాడు. ఇక తన పాప గుర్తుకు వస్తుందని లోబో కన్నీళ్లు పెట్టుకుని వివరించాడు. పక్కనే ఉన్న ప్రియాంక కూడా ఓదార్చే ప్రయత్నం చేసింది. ఎమోషన్ ని ఎంత అని హైడ్ చేయాలో అర్థం కావడం లేదని లోబో తన కూతురిని అందరినీ తలచుకొని ఏడ్చాడు. వాళ్ళను చూడాలని అనిపిస్తుంది అని చాలా గుర్తుకొస్తున్నారు అని లోబో వివరణ ఇచ్చాడు.