Bigg Boss Telugu 5 భారీ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఇంటి నుంచి లోబో ఎలిమినేట్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. అక్టోబర్ 16వ తేదీన ప్రసారమైన 42వ రోజు ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు షాకిచ్చారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు తెర లేపారు. కానీ ఓ రకమైన ట్విస్టు ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏమిటి? ఇంటిలో ఇంకా ఏం జరిగిందంటే..

శ్వేతకు జైలు నుంచి విముక్తి

శ్వేతకు జైలు నుంచి విముక్తి

వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా జైలులోకి వెళ్లిన శ్వేతా వర్మకు విముక్తి కలిగింది. ఒక రోజు తర్వాత శ్వేతా వర్మను జైలు నుంచి విడుదల చేశారు. విడుదలకు ముందు జైలో శ్వేతా వర్మ మాట్లాడుతూ.. నాకు రెండు రోజుల నుంచి ఓ రకంగా ఉన్నాను. జైలులో పెట్టిన తర్వాత ఆ ఫీలింగ్ కొంత తగ్గింది అంటూ శ్వేతా వర్మ పేర్కొన్నారు.

 ఇంటిలో ఫ్యాషన్ షో

ఇంటిలో ఫ్యాషన్ షో

ఇక ఇంటిలో ఫ్యాషన్ బట్టలు వేసుకొని.. ఇంటి సభ్యులు ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాలని ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యులు అందంగా తయారై ఇంటిలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. తమ అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్్నే ప్రయత్నం చేశారు.

కన్ఫెషన్ రూమ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ

కన్ఫెషన్ రూమ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ

ఆ తర్వాత ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌లో హోస్ట్ నాగార్జున పిలిచి.. ఇంటిలో ఉండడానికి అర్హత లేని ఒక్కరి పేరు చెప్పండి అంటూ టాస్క్ మొదలుపెట్టారు. దాంతో ఇంటి సభ్యులందరూ కంగారు పడ్డారు. అయితే ఇది మన మధ్య మాత్రమే ఉంటుంది. ఎవరికి లీక్ చేయబోము అంటూ నాగార్జున భరోసా ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అభిప్రాయాలను చెప్పిన తర్వాత నేరుగా బెడ్ రూమ్‌లోకి వెళ్లమని చెప్పారు. ఈ ప్రాసెస్‌లో తన దృష్టిలో ఇద్దరు ఉన్నారు అంటూ ఆర్జే కాజల్ అంటే.. ఒక్కరిపేరే చెప్పు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు.

ప్రియకు, లోబోకు 4 ఓట్లు

ప్రియకు, లోబోకు 4 ఓట్లు


బిగ్‌బాస్ ఈజ్ టఫ్ ఇంటి నుంచి ఎవరిని పంపించాలనేది చాలా టఫ్ టాస్క్ అని ఆనీ మాస్టార్ అంటే.. ఎస్ బిగ్‌బాస్ ఈజ్ టఫ్ అంటూ కామెంట్ చేస్తూ వేదిక మీద కనిపించారు. అయితే ఇంటి సభ్యులు తమకు నచ్చని కంటెస్టెంట్ పేరు చెప్పారు. అయితే ఇంటి సభ్యులు ఓటింగ్ ముగిసిన తర్వాత 4 ఓట్లు ప్రియకు, 4 ఓట్లు లోబోకు వచ్చాయి.

అని మాస్టర్ నిర్ణయంతో లోబో అవుట్

అని మాస్టర్ నిర్ణయంతో లోబో అవుట్

ప్రియ, లోబోకు సేమ్ ఓట్లు కాబట్టి ఎలిమినేషన్‌లో టై ఏర్పడింది కాబట్టి.. ఇద్దరిలో ఎవరిని బయటకు పంపించాలనేది ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని నాగార్జున ఆదేశించారు. అలా చివరకు అనీ మాస్టర్ తీసుకొన్న నిర్ణయంతో లోబో ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. లోబో ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. అలా ఇంటి నుంచి వేదిక మీదకు వచ్చిన నాగార్జునతో కలిశారు.

సీక్రెట్ రూమ్‌లోకి లోబో

సీక్రెట్ రూమ్‌లోకి లోబో

అయితే లోబోతో ఇంటి సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత థమ్స్ అప్, థమ్స్ డౌన్ గేమ్ ఆడించి ఇక మీరు వెళ్లండి.. అంటూ నాగార్జున చెప్పాడు. ఇంక ఇంటి నుంచి కాలు బయటపెట్టే సమయంలో లోబోను నాగార్జున వెనుకకు పిలిచాడు.

లోబోను నాగ్ వెనుకకు పిలిచి.

లోబోను నాగ్ వెనుకకు పిలిచి.

లోబోను నాగ్ వెనుకకు పిలిచి... నీవు ఎలిమినేట్ కాలేదు. కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే అధికారం తోటి సభ్యులకు, బిగ్‌బాస్‌కు నాకు కూడా లేదు అంటూ చెప్పి.. నీవు ఎలిమినేట్ కాలేదు. నిన్ను సీక్రెట్ రూమ్‌కు పంపిస్తున్నాం. బిగ్‌బాస్ ఆదేశాల వరకు సీక్రెట్ రూమ్‌లో ఉండండి అంటూ నాగార్జున చెప్పారు. అలా సీక్రెట్ రూమ్‌లో లోబో వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X