Bigg Boss: లహరిపై లోబో సంచలన వ్యాఖ్యలు.. ఆ బట్టలతో మొత్తం చూపిస్తుంది.. ఆగలేకపోతున్నా అంటూ పచ్చిగా!

తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును విశేషంగా అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్‌ చేసుకుంది.

ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ కూడా ఇటీవలే మొదలైంది. గతంలో కంటే ఈ సారి ఆరంభంలోనే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో లహరి షారి డ్రెస్‌లపై లోబో సంచలన ఆరోపణలు చేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

వాటిని మించేలా మజాను పంచుతోంది

వాటిని మించేలా మజాను పంచుతోంది

బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సాగుతోంది. దీంతో భారీ రేటింగ్ సాధిస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్.. ఎంటర్‌టైనర్‌ పేరు

స్పెషల్ అట్రాక్షన్.. ఎంటర్‌టైనర్‌ పేరు

ప్రతి సీజన్‌లోనూ ఎంటర్‌టైనర్‌గా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇక, ఈ సీజన్‌లో మాత్రం లోబో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపిస్తున్నాడు. ఇక, అతడు.. రెండు వారాల పాటు ఉమాదేవితో జంటగా ఉన్నట్లు చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంది. అతడికి అనుగుణంగానే ఆమె కూడా రెచ్చిపోయి నటించింది. దీంతో వీళ్లిద్దరూ హౌస్‌లో జంటగా కనిపించారు. తద్వారా లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకూ మజాను పంచి విపరీతంగా హాట్ టాపిక్ అయ్యారు.

 గ్లామర్ ట్రీట్.. బోల్డుగా.. లహరి షారి ఇలా

గ్లామర్ ట్రీట్.. బోల్డుగా.. లహరి షారి ఇలా

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో చాలా మంది సినిమాలు, సీరియళ్లు నటించడం ద్వారానో.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలుగా ఉండడం ద్వారానే ఈ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా వచ్చిన వారిలో ఎక్కువ శాతం గతంలో పరిచయం ఉన్న వాళ్లే ఉన్నారు. అయితే, పెద్దగా సుపరిచితురాలు కాకపోయినా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన భామ లహరి షారి. తెలుగు సినీ నటిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. బోల్డుగా ఉంటూ.. గొడవలు పెట్టుకుంటూ విపరీతంగా హైలైట్ అయింది.

ముఖం మీదే తలుపు వేయించిన హోస్ట్

ముఖం మీదే తలుపు వేయించిన హోస్ట్

గత వారం మొత్తం కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరుతో కోపంగా ఉన్న నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్‌ను ఎంతో ఆసక్తికరంగా నడిపించాడు. ముందుగా కొన్ని తప్పులు చేసిన కంటెస్టెంట్లు అందరికీ తనదైన శైలిలో క్లాస్ పీకిన ఆయన ఆ తర్వాత కొందరికి మంచి మంచి సలహాలు కూడా ఇచ్చి ఆకట్టకున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లతో ఒక గేమ్ కూడా ఆడించాడు. ఈ ఇంట్లో ఉండడానికి ఎవరు అర్హులు కాదో వివరిస్తూ.. వాళ్ల ముఖం మీదే తలుపు వేయాలని ఓ సెటప్‌ను సెట్ చేశాడు. అందుకు అనుగుణంగానే ప్రతి కంటెస్టెంట్ వెళ్లి తనకు నచ్చని ఇంటి సభ్యుడి పేరును చెప్పారు.

 లోబో షాకింగ్ ప్రవర్తన.. లహరిపై కామెంట్స్

లోబో షాకింగ్ ప్రవర్తన.. లహరిపై కామెంట్స్

నాగార్జున చెప్పిన గేమ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమకు నచ్చని కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి.. తమ తమ కారణాలను చెబుతూ.. వాళ్ల ముఖం మీదే డోర్ వేసేశారు. ఈ క్రమంలోనే పలువురు చిత్ర విచిత్రమైన కారణాలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగానే లోబో తన వంతు వచ్చిన సమయంలో హాట్ బ్యూటీ లహరి షారిని బిగ్ బాస్ ఇంట్లో ఉండడానికి అనర్హురాలిగా పేర్కొన్నాడు. ఇందుకు గానూ అతడు చెప్పిన కారణం ఏమిటంటే.. ఆమె పొట్టి పొట్టి బట్టలు వేసుకుని గ్లామర్ ట్రీట్ ఇస్తుందట. ఈ కారణంతో నాగ్‌తో పాటు అందరూ ఆశ్యర్యంతో ఉండిపోయారు.

లహరి డ్రెస్‌లపై లోబో డబుల్ మీనింగ్‌గా

లహరి డ్రెస్‌లపై లోబో డబుల్ మీనింగ్‌గా

లహరి గురించి లోబో మాట్లాడుతూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులను వదిలాడు. 'సార్.. ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటుంది. దీంతో మా లాంటి యంగ్ బాయ్స్‌ దిమాక్ కరాబ్ చేస్తుంది సార్. అసలే చికెన్ మటన్ లేకుండా ఇక్కడ ఉంటున్నా. అలాంటిది అట్ల బట్టలు వేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్. మరీ దారుణంగా కనిపిస్తుంది సార్. అస్సలు తట్టుకోలేకపోతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా ఆమె పట్ల అతడు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో పరోక్షంగా వెల్లడించాడు. దీంతో లోబో వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

నాగార్జునకు అర్థం కాలేదా? ఎందుకలా?

నాగార్జునకు అర్థం కాలేదా? ఎందుకలా?

లహరిని ఉద్దేశించి యాంకర్ రవి, ప్రియ చేసిన వ్యవహారంపై ఫైర్ అయ్యాడు నాగార్జున. ఇందుకోసం వీడియోలు చూపించి మరీ పెద్ద పంచాయతీ పెట్టాడు. అలాంటిది ఇప్పుడు లోబో అతడి ముందే నేరుగా ఆ అమ్మాయి డ్రెస్సింగ్ గురించి మాట్లాడినా నాగార్జున కామ్‌గా ఉండిపోయాడు. దీంతో అసలు లోబో మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆయనకు అర్థం కాలేదా? అయినా అలాగే ఉండిపోయాడా? అన్నది మాత్రం పెద్ద చర్చ అవుతోంది. మొత్తానికి లహరి షారి డ్రెస్‌ల గురించి మాట్లాడిన లోబో పెద్ద సాహసమే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X