Bigg Boss 5: 8 వారాలకు లోబో టోటల్ రెమ్యునరేషన్ ఎంతంటే.. మొదటిసారి అత్యధిక సంపాదన!
బిగ్ బాస్ లో పాల్గొంటే సెలబ్రిటీలకు మంచి కెరీర్ ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయాన్ని కూడా గట్టిగానే అందుకునే అవకాశం ఉంటుంది. కాంట్రవర్సీ షో అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది ధైర్యం చేసి కంటెస్టెంట్స్ గా వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొందరు మాత్రం రెమ్యునరేషన్ ఎంత ఆఫర్ చేసినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అందులో పరువుపోయేలా చేదు సందర్భాలు చాలానే ఎదురవుతాయి. కాబట్టి అలాంటి గొడవలతో బయట ప్రపంచానికి చెడుగా కనిపించకూడదు అని అభిప్రాయానికి లోనవుతూ ఉంటారు. బిగ్ బాస్ ద్వారా కెరీర్ ఎలా సెట్ అవుతుందో చెప్పడం కాస్త కష్టమే కాని సంపాదన మాత్రం గట్టిగానే ఉంటుందని చాలా సార్లు రుజువైంది. ఇక ఇటీవల ఎలిమినేట్ అయిన రోబో ఎంత తీసుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

కమెడియన్ గా లోబో ఎంటర్టైన్మెంట్
బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా కామెడీ చేయడానికి లోబో అడుగు పెట్టాడు అని మొదటి రోజే చాలా క్లారిటీగా అర్థం అయింది. అతను విభిన్న వేషధారణతో ఎంట్రీలోనే అదరగొట్టేశాడు అని నాగార్జున కూడా చాలా పాజిటివ్ గా స్పందించాడు. లోబో ఏం మాట్లాడినా కూడా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అతను కొన్ని సందర్భాల్లో చేసిన కామెడీ అయితే బిగ్ బాస్ షో కు చాలా బాగా హెల్ప్ అయింది. హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాగా నవ్విస్తారు అని.. అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా తెలియజేశారు.

ఎప్పుడో వెళ్లిపోవాల్సింది..
అయితే బిగ్ బాస్ అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాస్క్ లో కూడా అందరితో పోటీపడుతూ ముందుకు సాగుతూ ఉండాలి. కానీ లోబో మాత్రం కేవలం ఎక్కువగా కామెడీ పైనే ఫోకస్ పెట్టాడు. ఇతరులతో ఆటపట్టిస్తూ సరదాగా తనదైన శైలిలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కానీ టాస్క్ లలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అసలైతే అతను మూడో వారంలోనే హౌస్ లో నుంచి బయటకు వెళ్ళి పోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం లోబోకి మంచి సపోర్ట్ ఇచ్చారు.

సింపతీ క్రియేట్ చేసే ప్రయత్నం
ప్రేక్షకులు అయినా సరే ఎన్ని రోజులు అని సపోర్ట్ చేస్తారు. లోబో ఎనిమిది వారాల పాటు వచ్చిన అవకాశాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఒక్కసారి కూడా అతను కెప్టెన్ అవ్వడానికి తెగించి పోరాడలేకపోయాడు. అలాగే పలు ఆరోగ్య సమస్యలు కూడా అతనిని ఇబ్బంది పెట్టాయి. అంతేకాకుండా లోబో కొన్నిసార్లు బస్తీలో నుంచి వచ్చాను అంటూ సింపతీ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు అని నాగార్జున కామెంట్స్ చేశారు.
Recommended Video

రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇక బిగ్ బాస్ వరల్డ్ లో లోబోకు రెమ్యునరేషన్ ఎంత అందింది అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎనిమిది వారాల పాటు కొనసాగిన లోబో వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకు పాతిక వేలకు పైగా అతనికి ముట్ట చెప్పినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఎనిమిది వారాలకు పైగా ఉండాలి అంటే లోబో 15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా అతని జీవితం లోనే ఇది అత్యధిక పేమెంట్ అని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను లోబో బాహ్య ప్రపంచంలో ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











