Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన లోబో.. ఆమె బాత్రూంలోకి వెళ్లగానే.. నువ్వు కూడా వెళ్లు అంటూ!

తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. అయితే, అందులో చాలా తక్కువ షోలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో భాషల్లో ఇది ప్రసారం అవుతోన్నా.. మన షోకు మాత్రమే జాతీయ స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా ఇది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో భారీ అంచనాలతో గత నెలలో ఐదో సీజన్ ప్రారంభం అయింది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. అయితే, ఇందులో కొన్ని సంఘటనలపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా లోబో ఓ చెండాలమైన పని చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 ఐదో సీజన్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు

ఐదో సీజన్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి గతంలో కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడం కోసం నిర్వహకులు అదిరిపోయే ప్లాన్లు వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కంటెంట్‌ను చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు.

అంతమందిలో స్పెషల్.. ఎంటర్‌టైనర్

అంతమందిలో స్పెషల్.. ఎంటర్‌టైనర్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో లోబో ఎంటర్‌టైనర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపిస్తున్నాడు. ఇక, అతడు.. రెండు వారాల పాటు ఉమాదేవితో జంటగా ఉన్నట్లు చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకూ మజాను పంచుతున్నాడు.

గొడవల్లో భాగం... చెడ్డ పేరు తెచ్చుకుని

గొడవల్లో భాగం... చెడ్డ పేరు తెచ్చుకుని

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నా.. లోబో వ్యవహార శైలి అప్పుడప్పుడూ విచిత్రంగా ఉంటోంది. ఇప్పటికే అతడు పలువురితో గొడవలకు దిగాడు కూడా. ప్రియతో అయితే ఓ రేంజ్‌లో ఫైట్ చేశాడు. ఏకంగా ఆమె మీదకు దూసుకెళ్లి ఫైర్ అయ్యాడు. దీంతో నాగార్జున అతడిని మందలించాడు. ఈ వ్యవహార శైలి వల్ల లోబోకు చెడ్డపేరు వచ్చిందని చెప్పొచ్చు.

 సీక్రెట్ రూమ్‌లోకి లోబో.. అక్కడి నుంచే

సీక్రెట్ రూమ్‌లోకి లోబో.. అక్కడి నుంచే

హౌస్‌లో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు వివాదాస్పద తీరుతో పలు గొడవల్లో భాగం అవుతున్నాడు లోబో. దీంతో పలుమార్లు నామినేషన్స్‌లోకి కూడా వచ్చాడతను. ఈ క్రమంలోనే గత వారంలో హోస్ట్ నాగార్జున అతడు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి సీక్రెట్ రూమ్‌కు పంపాడు. అక్కడి నుంచే అన్నీ చూసి మిగిలిన వాళ్లపై అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు.

రీఎంట్రీలో దూకుడు.. రవితోనే దూరం

రీఎంట్రీలో దూకుడు.. రవితోనే దూరం

సీక్రెట్ రూమ్ నుంచి హౌస్‌లోకి వచ్చిన తర్వాత లోబో వ్యవహార శైలి మరింత విచిత్రంగా మారిపోయింది. రెండు రోజుల క్రితం అతడు క్లోజ్ ఫ్రెండ్ అయిన యాంకర్ రవితోనే గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత కలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక, ఈ వారం జరిగిన ప్రక్రియలో నామినేషన్స్‌లోకి కూడా వచ్చాడతను.

 షోలో చెండాలమైన పని చేసేసిన లోబో

షోలో చెండాలమైన పని చేసేసిన లోబో

బిగ్ బాస్ హౌస్‌లో చిత్ర విచిత్రంగా డ్రెస్‌లు వేసుకోవడం.. కామెంట్లు చేయడం.. కామెడీని పండించడం వంటి వాటితో లోబో హైలైట్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు బాంబ్‌లు వేసి హాట్ టాపిక్ అయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ జరుగుతోన్న సమయంలో లోబో అందరి వైపు తిరిగి పిత్తులు పిత్తాడు. ఆ సమయంలో వెకిలి చేష్టలు చేస్తూ కేకలు కూడా వేశాడు.

Recommended Video

Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
ఆమె బాత్రూంలోకి.. నువ్వు కూడా వెళ్లు

ఆమె బాత్రూంలోకి.. నువ్వు కూడా వెళ్లు

లోబో బాంబ్‌లు వేయగానే తట్టుకోలేక ఆర్జే కాజల్ బాత్రూం వైపు పరుగులు పెట్టింది. ఆ వెంటనే షణ్ముఖ్ జస్వంత్ రూమ్ స్ప్రే తీసుకొచ్చి అతడి వెనుక కొట్టాడు. అనంతరం కెప్టెన్ సన్నీ 'బాత్రూంకు పోవయ్యా' అని సీరియస్ అయ్యాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ నిర్వహకులపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కూడా హైలైట్ చేయాలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X