Bigg Boss: లోబోకు స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్.. అతడు ఎలిమినేట్.. ఆమెకు మాత్రం బంపర్ ఆఫర్

తెలుగులో చాలా రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అందులో ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనేరికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్‌ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీక్రెట్ రూంలో ఉన్న లోబోకు బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. దీని వల్ల ఒకరు బలయ్యారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

వాటిని మరిపించేలా చేస్తున్నారు

వాటిని మరిపించేలా చేస్తున్నారు

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సాగుతోంది. దీంతో భారీ రేటింగ్‌ను కూడా అందుకుంటోందీ షో.

ప్రత్యేకంగా... ఎంటర్‌టైనర్‌ పేరు

ప్రత్యేకంగా... ఎంటర్‌టైనర్‌ పేరు


బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ ఎంటర్‌టైనర్‌గా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇక, ఈ సీజన్‌లో మాత్రం లోబో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపిస్తున్నాడు. ఇక, అతడు.. రెండు వారాల పాటు ఉమాదేవితో జంటగా ఉన్నట్లు చేసిన యాక్టింగ్ ఆకట్టుకుంది. అతడికి అనుగుణంగానే ఆమె కూడా రెచ్చిపోయి నటించింది. దీంతో వీళ్లిద్దరూ హౌస్‌లో జంటగా కనిపించారు. తద్వారా లోపల ఉన్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకూ మజాను పంచుతున్నాడు.

సీక్రెట్ రూంలోకి పంపించిన నాగ్

సీక్రెట్ రూంలోకి పంపించిన నాగ్

హౌస్‌లో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు వివాదాస్పద తీరుతో పలు గొడవల్లో భాగం అవుతున్నాడు లోబో. ఇలా హౌస్‌లో ఉన్న కొందరితో శృతి మంచి మరీ వాదానలకు దిగాడు. ఒకానొక సందర్భంలో ప్రియపైకి దూసుకుని వెళ్లాడు. దీంతో నాగార్జున నుంచి చీవాట్లు కూడా తిన్నాడు. ఇలా పలుమార్లు నామినేషన్స్‌లోకి కూడా వచ్చాడతను. ఈ క్రమంలోనే గత శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున అతడు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆ వెంటనే బయటకు కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపించి అతడికే షాకిచ్చాడు.

అందులో నుంచే అన్నీ చూపిస్తూ

అందులో నుంచే అన్నీ చూపిస్తూ

సీక్రెట్ రూంలో ఉన్న సమయంలో లోబోకు స్పెషల్ సెటప్ చేశారు. అన్నీ సమయానికి వచ్చేలా ప్లాన్ చేశారు. అలాగే, ఓ స్క్రీన్‌ను ఉంచి హౌస్‌లో జరుగుతోన్న వ్యవహారాలను మొత్తం కూడా చూపించారు. దీంతో సీక్రెట్ రూంలో నుంచే అతడు బిగ్ బాస్ టాస్కులను ఫీల్ అయ్యాడు. అదే సమయంలో కొందరిపై కోప్పడుతూ.. మరికొందరిపై జాలి పడుతూ కామెంట్లు కూడా చేశాడు. దీంతో అతడు వచ్చిన వెంటనే గొడవలు జరుగుతాయని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కొన్ని టాస్కులు కూడా ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

లోబో రీఎంట్రీ.. వాళ్లంతా ఏడుస్తూ

లోబో రీఎంట్రీ.. వాళ్లంతా ఏడుస్తూ

శనివారం రాత్రి నుంచి సీక్రెట్ రూమ్‌లో ఉంటోన్న లోబో తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెయిన్ గెట్ తెరుచుకోవడంతో లోపలికి ఎంట్రీ ఇచ్చిన అతడు.. బిగ్ బాస్ హౌస్‌ను ముద్దాడాడు. ఆ తర్వాత బంగారు కోడిపెట్ట సెటప్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. అతడు మాత్రమే కాదు.. విశ్వ, కాజల్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఇలా అందరూ కంటెస్టెంట్లు అతడికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేశారు.

లోబోకు బిగ్ బాస్ స్పెషల్ పవర్

లోబోకు బిగ్ బాస్ స్పెషల్ పవర్


దాదాపు నాలుగు రోజుల పాటు సీక్రెట్‌ రూంలో ఉన్న లోబోకు గురువారం జరిగిన ఎపిసోడ్‌లో 'లోబో.. మీరు హౌస్‌లోకి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. ఇక, మీకిచ్చిన డ్రెస్ తీసేసి ఇంట్లోకి ప్రవేశించడానికి రెడీ అవ్వండి. వెళ్లేటప్పుడు మీ ముందు ఉన్న గుడ్లను తీసుకోండి. అందులో బ్లాక్ ఎగ్ మీరు ఎవరికి ఇస్తారో వాళ్లను కెప్టెన్సీ టాస్కు నుంచి తప్పించవచ్చు. అలాగే, గోల్డెన్ ఎగ్ మీరు ఎవరికి ఇస్తారో వాళ్లు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడవచ్చు' అంటూ స్పెషల్ పవర్ ఇచ్చాడు. దీంతో లోబో ఆ రెండు గుడ్లను పట్టుకునే బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేశాడు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
ఒకరు ఎలిమినేట్.. ఒకరికి ఆఫర్

ఒకరు ఎలిమినేట్.. ఒకరికి ఆఫర్

ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగిన 'బంగారు కోడిపెట్ట' టాస్కులో ఎక్కువ గుడ్లను సేకరించిన విశ్వ, యాంకర్ రవి, సన్నీ, శ్రీరామ చంద్ర, మానస్‌ల దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉండడంతో వీళ్లే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక, ఇంతలో రీఎంట్రీ ఇచ్చిన లోబో తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్స్‌ను ఉపయోగించాడు. ఇందులో భాగంగానే నలుపు రంగు గుడ్డును శ్రీరామ చంద్రకు ఇచ్చి అతడిని కెప్టెన్సీ టాస్కు నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశాడు. అదే సమయంలో బంగారు రంగు గుడ్డును ఆర్జే కాజల్‌కు ఇచ్చి.. కెప్టెన్సీ కోసం పోటీ పడే అవకాశం కల్పించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X