For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: అతడిని బాయ్‌ఫ్రెండ్ అనేసిన మానస్ తల్లి.. కూతురి రొమాన్స్‌పై సిరి తల్లి సంచలన వ్యాఖ్యలు

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసి.. ఆశించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. హిందీ సహా పలు భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. దేనికీ మన కంటే ఎక్కువ రేటింగ్ రావడం లేదు. అంతలా ఈ షో హవాను చూపిస్తోంది. అందుకే నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

  ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఐదోది కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌లో మానస్, సిరి తల్లులు రాబోతున్నారు. వీళ్లిద్దరూ కంటెస్టెంట్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చారు. ఆ సంగతులు మీకోసం!

  ఈ వారం స్పెషల్‌గా లగ్జరీ బడ్జెట్ టాస్క్

  ఈ వారం స్పెషల్‌గా లగ్జరీ బడ్జెట్ టాస్క్

  హౌస్‌లోని కంటెస్టెంట్లకు ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ టాస్కులు ఇస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు 'బీబీ ఎక్స్‌ప్రెస్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాలి. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాలని సూచించాడు.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  కంటెస్టెంట్ల ఫ్యామిలీల కోసం ప్రత్యేకం

  కంటెస్టెంట్ల ఫ్యామిలీల కోసం ప్రత్యేకం

  ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారు.

  కాజల్ ఫ్యామిలీ ఎంట్రీ.. ముద్దుల రచ్చ

  కాజల్ ఫ్యామిలీ ఎంట్రీ.. ముద్దుల రచ్చ

  బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో 'బీబీ ఎక్స్‌ప్రెస్' టాస్క్ జరుగుతోన్న సమయంలోనే ఆర్జే కాజల్‌ కూతురు, భర్త హౌస్‌లోకి ప్రవేశించారు. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ ఎంతో సంతోషించారు. మరీ ముఖ్యంగా కాజల్ తన భర్తపై ముద్దుల వర్షం కురిపించింది. అలాగే, ఆమె కుమార్తె అందరితోనూ సరదాగా ఆడుతూ.. తల్లికి విలువైన జాగ్రత్తలను సైతం చెప్పుకొచ్చింది.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  ఈరోజు ఎవరెవరు వస్తారో చూపించారు

  ఈరోజు ఎవరెవరు వస్తారో చూపించారు

  గురువారం జరగబోతున్న ఎపిసోడ్‌లో ఎవరు వస్తారన్న దానిపై సరైన సమాచారం లేదు. కానీ, తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం మానస్ తల్లి, సిరి హన్మంత్ మదర్ రాబోతున్నట్లు చూపించారు. ఈ ప్రోమో ఆద్యంతం ఎంతో సందడిగా సాగి.. చివర్లో షాకిచ్చేలా ఉంది. అలాగే, శ్రీరామ చంద్ర సోదరి కూడా ఈరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  స్పెషల్ అట్రాక్షన్ అయిన మానస్ తల్లి

  స్పెషల్ అట్రాక్షన్ అయిన మానస్ తల్లి

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఈరోజు మానస్ తల్లి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇక, ఈమె రావడం రావడమే కొడుకును హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత షణ్నూతో 'అరే ఏంట్రా ఇది' అనే డైలాగ్ కొట్టారు. అనంతరం కాజల్‌ టీ పెట్టిస్తానని అంటే నీకు వంట రాదుగా అంటూ పంచ్ వేశారు. మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారామె.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  అతడిని బాయ్‌ఫ్రెండ్ అనడంతో షాక్

  బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో చిల్ అయినట్లు కనిపించిన మానస్ తల్లి.. శ్రీరామ చంద్రపై రొమాంటిక్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆమె బయటకు వెళ్లిపోతుండగా.. 'ఇక్కడే ఉండిపోండి ఆంటీ' అన్నాడతను. దీంతో ఆమె 'ఆంటీ అని పిలవకు.. బాయ్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ అను' అన్నారు. అంతేకాదు, చివర్లో 'నీ ఎల్లో షర్ట్.. నా రెడ్ డ్రెస్ మ్యాచింగ్ కదా' అంటూ అందరికీ షాకిచ్చారు.

  Drushyam 2 Movie Review | Venkatesh | Meena || Filmibeat Telugu
  షన్నూతో రొమాన్స్‌పై సిరి తల్లి కోపంగా

  షన్నూతో రొమాన్స్‌పై సిరి తల్లి కోపంగా

  ఈరోజు ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ తల్లి కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చూపించారు. ఎంతో ఎమోషన్‌ మూమెంట్స్ మధ్య లోపలికి వచ్చిన ఆమెను సిరి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంది. అలా ఉన్నప్పుడే 'ఆట చక్కగా ఆడుతున్నావ్.. కానీ, షణ్ముఖ్‌ను హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు. అతడు హెల్ప్ చేస్తున్నాడు కానీ ఇలా చేయడం నచ్చలేదు' అని చెప్పారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Maanas, Sreerama Chandra and Siri Hanmanth Family Members Entry into House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X