Bigg Boss 5: మాటల్లేవ్ అంటూనే హగ్గులతో షాక్ ఇచ్చిన ప్రియాంక.. తల పట్టుకున్న కాజల్!

బిగ్ బాస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా కొందరు మాత్రం ఇంకా అర్థం కానీ రొమాన్స్ తో షాక్ ఇస్తున్నారు. సీజన్ 5 ఫైనల్ కు ఇంకా కొన్ని రోజుమా సమయం మాత్రమే ఉంది. ఇక హౌస్ లో ఉన్నవారిలో టాప్ 5లోకి వచ్చేదేవరు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా టికెట్ టూ ఫినాలేకు చేరుకునేది ఎవరు అనే విషయం కూడా మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఆటలో డోస్ పెంచేందుకు బిగ్ బాస్ ఛాలెంజ్ లను కూడా మరింత నాటుగానే ప్రవేశపెడుతున్నాడు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో వద్దంటూనే దగ్గరవుతూ ప్రియాంక, మానస్ షాక్ ఇచ్చారు. ఇక ఎందుకు నామినేట్ చేస్తున్నారో అర్థం కాక కాజల్ అయితే తల పట్టుకుంది.

టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు?

టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు?

బిగ్ బాస్ ఐదవ సీజన్ మొత్తానికి ఫైనల్స్ కు చేరుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న టాప్ 7 కంటెస్టెంట్స్ లలో ఫైనల్స్ కి చేరుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్టుపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఈసారి అందరూ కంటెస్టెంట్స్ కూడా చాలా పవర్ఫుల్ గా పోరాడుతున్నారు. ఎవరు ఎలా ఉన్నా కూడా కొందరు మాత్రం ఎప్పటిలానే ఎమోషనల్ గా ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు.

మానస్ కు నచ్చని పని చేసిన ప్రియాంక

మానస్ కు నచ్చని పని చేసిన ప్రియాంక

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న వారిలో ప్రియాంక హైలెట్ గా నిలుస్తోంది. ఆమె మానస్ తో మొదటి నుంచి ఒక డిఫరెంట్ రొమాంటిక్ ట్రాక్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మానస్ కూడా ఆమెకు మద్దతుగా చాలా సార్లు నిలిచాడు. బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకొని ఎంతగానో ఓదార్చాడు. ఇక ఈ వారం పింకి, కాజల్ ను నామినేట్ చేయడంతో మానస్ ఓర్చుకోలేకపోయాడు. అతని పింకి నిర్ణయం ఏ మాత్రం నచ్చలేదు.

కాజల్ ప్లాన్ రివర్స్

కాజల్ ప్లాన్ రివర్స్


మానస్, కాజల్ ఇద్దరు కూడా మొదటి నుంచి క్లోజ్ గానే ఉంటున్నారు. కాజల్ దాదాపు అందరితో గొడవ పడింది. కానీ మానస్ తో మాత్రం ఎలాంటి గొడవలు లేకుండా గేమ్ స్ట్రాటజీ అన్నట్లుగా వారం వారం చర్చలు జరిపింది. ఇక మానస్ ప్రియాంక మంచి స్నేహితులు కాబట్టి తప్పకుండా ప్రియాంక తనను నామినేట్ చేయదని కాజల్ అనుకుంది. కానీ ప్రియాంక మాత్రం చాలా రివర్స్ అయ్యింది.

షటప్ కాజల్

షటప్ కాజల్


ఇక ప్రియాంక మానస్ తో మాట్లాడాలని అనుకున్నప్పటికి కూడా అతను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు నాకు ఏ మాత్రం నచ్చలేదు అంటూ గట్టిగాబే కౌంటర్ ఇచ్చాడు. ఇక మానస్ గుచ్చినట్లు మాట్లాడడంతో ప్రియాంక మరింత ఎమోషనల్ అయ్యింది. నువ్వు ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను అని సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు అని అడగడంతో ఒళ్ళు కొవ్వెక్కి అని కంటతడి పెట్టుకుంది. ఇక మధ్యలో కాజల్ రాగా ఆమెను షటప్ అంటూ పింకి నోరు మూయించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
 మానస్, ప్రియాంక హగ్గులు

మానస్, ప్రియాంక హగ్గులు


ఇక జీవితంలో మళ్ళీ నీతో మాట్లడను అంటూ ప్రియాంక ఏమి తినకుండా నిద్రపోకుండా కనిపించింది. ఇక ఆ సమయంలో మానస్ ఆమెను ఓదార్చేందుకు వెళ్లి భోజనం చేయాలని ఎంతగానో బ్రతిమాలాడు. ఇక చివరగా ప్రియాంక బాధ తట్టుకోలేక మానస్ ను ఎమోషనల్ గా హగ్ సీబీసుకుంది. ఇక పింకి బాధలో ఉందని మానస్ కూడా ఓర్పుతో కాసేపు ఆమెను ఓదార్చాడు. అయితే మిగతా వారిలో మాత్రం వీరి ట్రాక్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నామినేట్ అవ్వకూడదు అని ప్లాన్ చేసుకున్న కాజల్ స్ట్రాటజీ ఈసారి వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు షన్ను కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X