సిరి, షణ్ముఖ్ అందుకే వచ్చారు.. గొడవలు అంతా నాటకమే.. అందరికంటే పెద్ద దొంగ.. మానస్ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని 10వ వారం లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారానికి గాను నామినేషన్ ప్రక్రియ మంచి ఆసక్తికరంగా సాగింది. సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఐదుగురు నామినేషన్స్ లో నిలిచారు. ఇక నామినేషన్ ప్రక్రియ కంటే ముందే జరిగిన ఒక వ్యవహారంలో సిరి షణ్ముఖ్, గురించి మానస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే

10వ వారం నామినేషన్స్
శని ఆదివారాలలో నాగార్జున వచ్చి కుటుంబ సభ్యులందరినీ అలరింప చేసి వెళ్లిన తర్వాత వెంటనే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ ప్రక్రియలో ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న బిగ్ బాస్ త్రీ 10వ వారం నామినేషన్స్ కూడా కాస్త ఆసక్తికరంగా సాగేలా చేశాడు.

ఏదో జరుగుతోంది
అయితే ఆదివారం నాడు విశ్వ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. విశ్వ ఎలిమినేట్ అవ్వడం మీద ఆటో అభిమానులతో పాటు హౌస్ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నా. ఇంటి సభ్యులు కూడా దీని మీద హౌస్ లో రకరకాల కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండి గేమ్స్ ఆడి టాస్క్ లో పాల్గొనడం మాత్రమే కాదు ఇంకా మన ఊహకు అందనిది ఏదో జరుగుతోంది అనే అనుమానాన్ని హౌస్ సభ్యులు అంచనా వేశారు.

మానస్ షాకింగ్ కామెంట్స్
ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అర్ధం కావడం లేదు అంటూ హౌస్ సభ్యులు ఒకరికి ఒకరు కామెంట్లు చేసుకున్నారు. ఇదే సందర్భంలో షణ్ముఖ్ అలాగే సిరి ఇద్దరి మీద మానస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సన్నీతో రాత్రి మాట్లాడే సమయంలో షణ్ముఖ్, సిరి ఇద్దరూ కూడా కంటెంట్ ఇవ్వడానికి వచ్చారు అని అన్నాడు.

అందరికంటే పెద్ద దొంగ
దీనికి 'నేను పది వారాలు ఉంటే చాలు.. ఇంక ఉన్నా పీకేది ఏం లేదని షణ్ముఖ్ నాతో అన్నాడు' అని మానస్‌తో చెప్పాడు సన్నీ. సిరి, షణ్ముఖ్ లోపల ఇన్‌టెన్షన్ ఒకటి ఉంటుంది.. బయటకు మాట్లాడేది వేరు.. అని చెప్పగా.. 'వాళ్లిద్దరూ కంటెంట్ ఇవ్వడానికి వచ్చారు.. కంటెంట్ ఇస్తున్నారని అన్నాడు.. షోకి రాకముందు ప్రిపేర్ అయ్యే వచ్చారు.. వీళ్లది ఒకటే స్కూల్‌రా' అని మానస్, సన్నీ మాట్లాడుకున్నారు. ఇక జెస్సీ గురించి మాట్లాడుతూ.. ఆ మనిషి అందరికంటే పెద్ద దొంగ..
మనిషి మంచోడే కానీ పక్కాగా గేమ్ ఆడుతున్నాడు.. వాడు చాలా స్మార్ట్' అని మానస్ సన్నీతో చెప్పడం ఆసక్తికరంగా మారింది .
Recommended Video

వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా
ఇక ఆ తర్వాత రవి గురించి మాట్లాడుకుంటూ ఇదివరకు రవిని టచ్ చేయాలి అంటే విశ్వని దాటుకుని వెళ్లాలి రవికి ఒక బాడీగార్డ్ లాగా విశ్వ పని చేశాడని కూడా మాట్లాడుకున్నారు. ఇదంతా సన్నీ మానస్ మధ్య జరుగుతున్న మాటలు అయితే షణ్ముఖ్, రవి మధ్య కూడా దాదాపు ఇలాంటి డిస్కషనే జరిగింది. ఒకవేళ ప్రియాంక వెళ్ళిపోతే మానస్ పరిస్థితి ఏంటి అని షణ్ముఖ్ అడిగితే సన్నీ ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు లే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా అంటూ
కామెంట్ చేశాడు రవి. మొత్తం మీద ఎలిమినేషన్ ప్రాసెస్ కంటే ముందే ఒకరి మీద ఒకరు ఇలా కామెంట్స్ చేసుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











