ప్రియాంక, మానస్‌పెళ్లిపై స్పందించిన తల్లి.. అలా చేసేస్తానంటూ మానస్ తల్లి కామెంట్స్
బిగ్ బాస్ హౌస్ లో కొంత మంది కంటెస్టెంట్ ల మధ్య బిగ్ బాస్ ప్రేమకథలు పుట్టిస్తూ వుంటే కొంత మంది కంటెస్టెంట్ ల మధ్య ప్రేమ కథలు వాటంతట అవే పుడుతూ ఉంటాయి.. అలా పుట్టుకొచ్చిన ప్రేమ కథ ప్రియాంక సింగ్ మానస్ ల ప్రేమ కథ. ప్రియాంక సింగ్, మానస్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్న మానస్ మాత్రం తన పరిధిలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే మానస్ తల్లి తనకు తెలుసని ఆమె ప్రియాంకతో పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు అని గతంలో రవి చెప్పిన మాటలు నిజమయ్యాయి.. తాజాగా ఈ వ్యవహారం మీద మానస్ తల్లి స్పందించారు. వివరాల్లోకి వెళితే

దృష్టి పెట్టలేకపోతుంది
బిగ్ బాస్ హౌస్ లో మానస్ ప్రియాంక సింగ్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా మానస్ విషయంలో ప్రియాంక మాత్రం వెనకడుగు వేయడంలేదు పోతోంది. మొన్న అయితే ఏకంగా దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది అప్పుడు నీతో హ్యాపీ గా ఉండేదాన్ని అంటూ అర్ధరాత్రి సమయంలో మానస్ కి చెబుతుండడంతో ప్రియాంక సింగ్ అభిమానులైతే బాధపడుతున్నారు. రోజురోజుకు మానస్ మీద ప్రేమ పెంచుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ కాలం గడిపేస్తున్న ప్రియాంక గేమ్ విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతుందని వారు బాధపడుతున్నారు.

ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానస్ తల్లి పద్మిని, ప్రియాంక సింగ్ - మానస్ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక సింగ్ చాలా మంచి అమ్మాయి తనకు ఎంతో ఇష్టమని పద్మిని చెప్పుకొచ్చారు. హౌస్ లో ఒకానొక సందర్భంలో మానస్ హస్బెండ్ మెటీరియల్ అని ప్రియాంక పేర్కొంది. కానీ మానస్ తనకు ఆమె మరదలు లాంటిది అని చెప్పాడని పద్మిని గుర్తుచేశారు.

వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగే అవకాశమే లేదు
వాళ్ళిద్దరికీ పెళ్లి అనేది జరిగే అవకాశమే లేదని పేర్కొన్న ఆమె బిగ్ బాస్ అనేది ఒక నూట పది రోజుల ఆట ఈ ఆట లో ఎంతమంది జంటగా బయటకు వచ్చారు? వాళ్ళు ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ఈ నూట పది రోజుల ఆట అక్కడి వరకే అని లోపల ఉన్న అందరికీ తెలుసని కాకపోతే హౌస్ లో ఏమీ తోచక ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారని దానిని ఎంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు ఆమె మాట్లాడారు.

మానస్ కు సెట్ కారు
అయితే హౌస్ లో ఉన్న ఎవరూ కూడా మానస్ కు సెట్ కారు అని పేర్కొన్న ఆమె తాను ఎవరినీ వేలుపెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు అని కామెంట్ చేశారు. అయితే ప్రియాంక సింగ్ నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం నేను ఒప్పుకోను అని పేర్కొన్న పద్మిని ఆమెకు తగిన అబ్బాయిని చూపించి నేనే పెళ్లి చేస్తానని అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చారు.
Recommended Video

మానస్ కు గతంలో ఒక లవ్ స్టోరీ
అయితే మానస్ కు గతంలో ఒక లవ్ స్టోరీ కూడా ఉందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మానస్ చదువుకుంటున్న సమయంలో మానస్ ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లడానికి సిద్ధమైందని దీంతో ఏం చేయాలి అని నన్ను అడిగితే నీకు ఇంకా చిన్న వయసు ఇంకా సెటిల్ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్ కాదేమోనని నేను అంటే నా మాట విని ఆగిపోయాడు అని, ఆగి పోయిన అతడు కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు బిగ్ బాస్ లో నిలబడ్డాడు అని ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











