Bigg Boss Telugu 5: RJ కాజల్ ను దెబ్బ కొట్టినట్లే కొట్టి బోల్తా పడుతున్న కంటెస్టెంట్స్.. క్లిక్కయితే లక్కే?

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మొదటి వారం విభిన్నమైన స్వభావంతో కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో వారి స్వభావాన్ని బయట పెట్టలేదు అనే చెప్పాలి. మొదటి వారం కాబట్టి అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుని ఎలిమినేషన్ లో సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. అయితే అందరిలో కూడా కాజల్ వేస్తున్న అడుగులు డిఫరెంట్ గా ఉన్నాయని అనిపిస్తోంది. అందరూ ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కూడా హైలెట్ అవుతుంది. ఒక విధంగా RJ కాజల్ చేసే పనులు కూడా అలానే ఉన్నాయి అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే కంటెస్టెంట్స్ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు అని మరో అనుమానం కూడా వస్తోంది. ఇది స్క్రిప్ట్ కూడా అయి ఉండవచ్చు అని మరికొంతమంది వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. బిగ్ బాస్ షోలో అయితే ఆర్జే కాజల్ ఒక విషయం లో హైలెట్ గా అవుతుంది.

ఎక్కువగా ఫోకస్ అవ్వాలని..

ఎక్కువగా ఫోకస్ అవ్వాలని..

ఇలాంటి రియాల్టీ షో లో మంచి జరిగినా చెడు జరిగినా కూడా హైలెట్ అవ్వాల్సిందే. అయితే ఎక్కువగా సందడి చేసే వారి వైపు కెమెరాలు తిరిగితే అభిమానుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తప్పు మాట్లాడిన ఒప్పు మాట్లాడిన కూడా ఒక మాట మీద నిలబడటం తెలిసినవారే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు నిలదొక్కుకుంటారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా కాజల్ వైపే ఉంది. చూస్తుంటే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని ఎక్కువగా ఆరాటపడుతోంది దాదాపు కెప్టెన్ అయ్యాను అనే రేంజ్ లో కూడా ఫీల్ అవుతోందని ఇంటి సభ్యులు ఇది వరకే కామెంట్స్ చేశారు.

 కాజల్ ఫొటోలు చింపేసి

కాజల్ ఫొటోలు చింపేసి

ఇది వరకే కాజల్ తీరుపై ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ ను అయితే బలంగా వినిపిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఏ విషయం జరిగినా కూడా ఎలాంటి చర్చలు జరిగినా కూడా కాజల్ కి సంబంధం లేకపోయినా కూడా అందులోకి వచ్చేస్తోందని లోబో రెండు సార్లు చెప్పాడు. ఇక శనివారం రోజు నాగార్జున ఎవరు బెస్ట్ ఎవరు కట్ ఎవరు అనే విషయం లో ఎక్కువమంది కాజల్ తో కట్ అనడంతో మరోసారి క్లారిటీ గా అర్థమైంది. ముఖ్యంగా లోబో అయితే ఆమె ఫోటోను చించేసి చెత్తకుప్పలో పడేయడంతో బాగా కోపాలు పెరిగినట్లు అర్థం అయ్యింది. ఎక్కువగా ఆమె ఫోటోలు ఇక్కడ పెట్టండి అని కూడా నాగార్జునకు వివరణ ఇవ్వడం విశేషం.

కాజల్ కు హెచ్చరిక

కాజల్ కు హెచ్చరిక

విశ్వ కూడా కాజల్ ని ఎక్కువగా ఫోకస్ చేశాడు. ఆమె తీరు ఏమాత్రం నచ్చడం లేదని ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ మెంట్ తీసుకుంటుందని అన్నారు. అలాగే కాజల్ ఇటీవల కిచెన్ లో పని చేయమని చెప్పినా కూడా చేయడం లేదని విశ్వ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విషయాన్ని నాగార్జున కూడా తెలియజేశాడు. ఆ పద్ధతి పూర్తిగా మార్చుకోవాలని ఇంట్లోకి వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ అందరూ సమానమే అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఏ పని చెప్పినా కూడా చేయాలని ముఖ్యంగా కిచెన్ సమయం వచ్చినప్పుడు చేయాల్సి వస్తుందని దానికి కూడా ఎదురు సమాధానం చెబితే ఎవరు అడ్జస్ట్ కాలేరు అని కూడా హెచ్చరిక చేశాడు.

నాగార్జునకు దొరికిపోయిన కాజల్

నాగార్జునకు దొరికిపోయిన కాజల్

ఇక కాజల్ కూడా ఒక విషయంలో నాగార్జునకు ఈజీగా దొరికేసింది. తనకు కిచెన్ లో ఉండడం అంతగా ఇష్టం ఉండదని, పెద్దగా వంటలు రావని కూడా చెప్పడంతో నాగార్జున కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నీ సోషల్ మీడియా ఖాతాలను మొత్తం ఒకసారి తిరగేసి చూసాను. అందులో ఎక్కువగా వంటల వీడియోలు ఉండడం విశేషం అని కూడా అనడం తో కాజల్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
కాజల్ విషయంలో కూడా అదే జరుగుతోంది.

కాజల్ విషయంలో కూడా అదే జరుగుతోంది.

అయితే అంతా బాగానే ఉంది కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని ఎవరిపైన అయినా సరే ఫోకస్ చేయడం మొదలు పెడితే చివరికి హైలెట్ గా నిలవడం ఖాయం. గతంలో రాహుల్ సిప్లిగంజ్ కౌశల్ మండా వంటివారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రవర్తనతో ముందుకు వెళ్లారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా కౌషల్ అయితే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకుండానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అతనిపై చాలామంది ఫోకస్ చేసిన విధానం అతనికే చాలా ప్లస్ అయింది. బయట జనాల్లో మంచి క్రేజ్ కూడా వచ్చింది ఇక చివరికి ఫైనల్లో కూడా నిలవడం విశేషం. అయితే ఇప్పుడు కాజల్ విషయంలో కూడా అదే జరుగుతోంది. దాదాపు అందులో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కాజల్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. లయితే దాన్ని కాజల్ ఎంత వరకు ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కావాలి అని చెబుతున్నప్పటికీ ఎక్కువగా హైలెట్ అవ్వడం లేదు. అదే కనుక కాజల్ ఉపయోగించుకోగలిగితే ఆమెకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X