Bigg Boss : పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సన్నీ చెంప పగులుద్దన్ననాగ్..ఇంద మాదిరి రాడ్ అంటూ షాకిచ్చిన సిరి!

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజయవంతంగా ఏడో వారం చివరికి చేరింది.. ఈ రోజు ఆదివారం కావడంతో ఏడో వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు అనే విషయం మీద క్లారిటీ రానుంది. తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమో సంబంధించిన వివరాల్లోకి వెళితే

చిట్టి సాంగ్ తో

చిట్టి సాంగ్ తో

ఎప్పటిలాగే నాగార్జున చాలా ఉత్సాహంగా హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన జాతి రత్నాలు సినిమాలోని చిట్టి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ లోని సభ్యులను రెండు టీంలుగా విభజించారు. రెండు టీంలలో విన్నర్ గా నిలిచిన వారికి ఒక మెమెంటో ఇస్తామని ప్రకటించి దాన్ని స్టేజ్ మీద నుంచి అందరికీ చూపించారు. మీరు అడగవచ్చు, బతిమిలాడవచ్చు, అడుక్కోవచ్చు, దొంగిలించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ టాస్క్ విన్నర్ గా గెలవాలని నాగార్జున చెబుతున్నారు.

సన్నీ బిత్తర మొహం

సన్నీ బిత్తర మొహం

ప్రోమోలో చూపిస్తున్న దాని ప్రకారం ఒక గుండ్రటి వలయం గీసి లోపల కొన్ని పిల్లోస్ పెట్టారు. వాటిని దక్కించుకున్న హౌస్ సభ్యులు వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. అలా ఒకరితో ఒకరు గొడవ పడుతూ పిల్లోలను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ సమయంలో సన్నీ గనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగిలిపోతుంది అని చెప్పాలి అని నాగార్జున శ్రీరామ్ తో చెప్పడం ఆసక్తికరంగా మారింది. దానికి సార్ అంటూ సన్నీ బిత్తర మొహం వేయగా ప్రియా ఓర కంట కనిపెడుతూ ఉండటం గమనార్హం.

బంగారు కోడి పెట్ట

ఇక రంగులను బట్టి హౌస్ లోపల నుంచి ఏదో ఒక వస్తువులు తీసుకుని వచ్చి బయట పెట్టాల్సిందిగా మరో టాస్క్ ఇవ్వగా లోపల ఉన్న స్టూల్స్ తో సహా అన్నింటినీ బయటకు తీసుకురావడానికి హౌస్ సభ్యులు ఆసక్తి చూపించారు. ఇక ప్రభావతి అంటూ ఒక పెద్ద కోడి బొమ్మను హౌస్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాని ద్వారానే బంగారు కోడిపెట్ట టాస్క్ ఆడారు. ఇప్పుడు అదే బంగారు కోడి పెట్టను బట్టి మాట్లాడాలని టాస్క్ ఇవ్వగా జెస్సీ వెళ్లి ప్లీజ్ బేబీ అని బతిమిలాడుతున్నట్లు చూపించారు. అలా జెస్సీ మాట్లాడుతున్న సమయంలో గుర్రం సకిలించినట్టు సౌండ్ రావడం తో అందరూ ఫక్కున నవ్వారు

రవి ఎంట్రీ ఇవ్వడంతో

రవి ఎంట్రీ ఇవ్వడంతో

ఇక రవి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఏ జంతువు అరిచిన సౌండ్ వస్తుందో అని నాగార్జున అనడంతో అందరూ మళ్లీ నవ్వడం మొదలు పెట్టారు. మిస్సెస్ ప్రభావతి అనే కోడి బొమ్మను ఇన్ఫ్లూయెన్స్ చేయమని అడిగితే ప్రభావతి ఇన్ఫ్లూయెన్స్ అవ్వడం లేదని కంప్లైంట్ చేస్తాడు రవి. దీంతో కుక్క అరిచిన సౌండ్ వినపడుతుంది. ఇక ఈసారి సిరి వచ్చి నీకు కూడా అన్నం తినిపిస్తా అనడంతో నీకు కూడా అంటే ఎవరు ఎవరికి అన్నం తినిపిస్తున్నావని నాగార్జున అడుగుతాడు.

Recommended Video

#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
ఇంద మాదిరి ఒరు రాడ్

ఇంద మాదిరి ఒరు రాడ్

ఆ తర్వాత వచ్చిన ప్రియ ప్లీజ్ ప్రభావతి నేను నీ చెంప పగల కొట్టను అంటుంది. దానికి వెరైటీ సౌండ్ రావడంతో ఏంటి నటరాజ్ మాస్టర్ సౌండ్ వచ్చింది అని షణ్ముఖ్ అనడం కనిపిస్తోంది. ఆ తర్వాత మ్యూజికల్ చైర్స్ గేమ్ లో శ్రీరామ్, విశ్వా, సనీ, సిరి, అనీ మాస్టర్ ఆడగా సిరి ఓడిపోతుంది. వెళ్లి కూర్చున్న తర్వాత షణ్ముఖ్ కి అన్నం తినిపించుకో అన్నట్లు నాగార్జున అనడంతో. ఇంద మాదిరి ఒరు రాడ్ అంటూ తనను నాగార్జున ట్రోల్ చేసిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సిరి. నాగార్జునకు అర్థం కాక మరో సారి అడగడంతో ఇంద మాదిరి ఒరు రాడ్ అని మరోసారి ప్రస్తావించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X