హద్దులు దాటుతున్న ఆనీ మాస్టర్ కు నాగ్ చురకలు.. ఎలిమినేషన్ పై ముందే హింట్ ఇచ్చారుగా!

బిగ్ బాస్ సీజన్ 5 మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. గత రెండు వారాలు అయితే కొన్ని టాస్క్ లు చాలా నీరసంగా కొనసాగాయి అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ముఖ్యంగా నాగార్జున హోస్టింగ్ పై కూడా అనేక రకాల మీమ్స్ వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ రేటింగ్స్ అందుకోవడంతో కూడా మళ్ళీ ట్రాక్ తప్పుతోందని అనిపించింది. అసలు గేమ్ ఇంట్రెస్టింగ్ లేదని కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇక ఈ వారం కొన్ని పరిస్థితులు మళ్ళీ ఆటను ట్రాక్ లోకి తీసుకు వచ్చాయి. కానీ కొందరి ఓవరాక్షన్ మాత్రం అస్సలు తగ్గలేదని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆనీ మాస్టర్ ప్రవర్తిస్తున్న తీరుపై నాగార్జున కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఒంటరిగానే పోరాడాలి

ఒంటరిగానే పోరాడాలి

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన అనంతరం పరిస్థితి ఎలా మారుతున్నా కూడా సోలోగానే ఫైట్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు ఎత్తులు మోసాలు చాలానే ఉంటాయి. ఇక వాతావరణం ఎలా ఉన్నా కూడా ఒంటరిగానే పోరాడాలి అని గతంలో చాలామంది కంటెస్టెంట్స్ నిరూపించారు. ఆ విషయంలో కౌషల్ మండా అప్పట్లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. అయితే మొదట్లో ఆనీ మాస్టర్ కూడా అదే తరహాలో కొనసాగుతుందని అందరూ అనుకున్నారు.

మంచితనం పనికి రాదు

మంచితనం పనికి రాదు

ఆనీ మాస్టర్ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఆమె ప్రవర్తిస్తున్న విధానం చాలా విబిన్నంగా ఉంటోంది. కొన్నిసార్లు మానవత్వంతోనే ఆలోచించింది. అయితే అన్నిసార్లు కూడా బిగ్ బాస్ లో మంచితనం పనికి రాదు. వీలైనంత వరకు తెలివిగా మోసాలు చేస్తేనే సక్సెస్ అవుతారు. అదే బిగ్ బాస్ లోని అసలు ఆట. అయితే విలన్ గా అయినా ఉండాలి.. లేదంటే హీరోగా అయినా ఉండాలి. రెండిట్లో ఎదో ఒక దారిని సెలెక్ట్ చేసుకుంటేనే బిగ్ బాస్ లో నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది.

రెండు వైపులా కాకుండా

రెండు వైపులా కాకుండా

అయితే ఆనీ మాస్టర్ మాత్రం రెండు వైపులా కాకుండా కాస్త పిచ్చిగా ప్రవర్తించడం ఎవరికి నచ్చడం లేదు. అసలు ఎవరిని ఎందుకు వెక్కిరిస్తుందనే విషయం అమేకైనా తెలుసా లేదా అనే కామెంట్స్ వస్తున్నాయి. గతంలో సన్నీని కావాలని రెచ్చగొట్టింది. ఇక కాజల్ ను కూడా మరోసారి దొంగాట అంటూ వెక్కిరిచింది. బిగ్ బాస్ లో ఎవరికి నచ్చింది వారు చేస్తారు. అయితే ఎవరు ఎన్ని చేసినా కూడా ఫైనల్ గా ప్రేక్షకులు ఒప్పుకుంటేనే కంటెస్టెంట్స్ నిలదొక్కుకుంటారు.

ఆనీ మాస్టర్ ఓవరాక్షన్

ఆనీ మాస్టర్ ఓవరాక్షన్

అయితే ఆనీ మాస్టర్ మాత్రం ఈసారి కాస్త హద్దులు దాటినట్లు అనిలించింది. నాగార్జున కూడా ఆమెకు కాజల్ విషయంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాగోలేదని చురకలు అంటించిన నాగ్‌.. వెక్కిరించడం కొంతవరకు ఓకే..కానీ అది హద్దులు దాటుతున్నట్లు హెచ్చరించాడు. ఇక అందుకు ఆనీ మాస్టర్ మాత్రం నాది చైల్డిష్‌ బిహేవియర్‌ అంటూ.. ఏదున్నా ఎదురుగా మొహం మీదే చెప్తానని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా లాస్ట్ వరకు వెక్కిరించడం మానుకుంటానని కూడా సమాధానం ఇచ్చింది.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
ఎలిమినేట్ అయ్యేది ఆమెనే..

ఎలిమినేట్ అయ్యేది ఆమెనే..

అయితే ఈవారం ఆనీ మాస్టర్ వెళ్లిపోవడం పక్కా అని తెలుస్తోంది. ఆమె చేసిన ఓవరాక్షన్ పై నాగార్జున కూడా ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఇక నాగ్ హద్దులు దాటుతోంది చెప్పగానే ఈసారి ఆనీ మాస్టర్ వెళ్లిపోవడం కాయమని అర్ధమయ్యింది. ఎలాగైనా టైటిల్ గెలవాలి అనుకున్న ఆనీ మాస్టర్ ఎలిమినేషన్ లో ఎలా ఫైట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X