Bigg boss telugu 5: మెల్లగా సిరి గాలి తీసేసిన నాగార్జున.. అందరి ముందు తల దించుకునేల కామెంట్

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆరో వారంలో కూడా చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. గత వారం షో చాలా బోరింగ్ గా నడిచింది అనే కామెంట్స్ అయితే ఎక్కువగానే వచ్చాయి. కానీ ఈ సారి మాత్రం బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో కొన్ని కొత్త తరహా ఐడియాలు ఫాలో అవ్వడంతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే అనిపించింది. కంటెస్టెంట్స్ కూడా టాస్క్ లో పోటాపోటీగా తలపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సైలెంట్ గా ఉన్నవారు కూడా మళ్లీ ఫిజికల్ టాస్క్ లో కూడా బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. శనివారం నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ కూడా అనేక రకాల విషయాలపై ప్రశ్నించారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ గ్యాంగ్ లోని ప్రధాన పాత్ర పోషించే సిరిపై నాగార్జున ఎవరూ ఊహించని ప్రశ్నలు విసిరారు. ఒక విధంగా సైలెంట్ గా ఆమె గాలి తీసేసినట్టు గా మాట్లాడి సందర్భంలో తలదించుకునేలా చేశారు. తను చేసిన పొరపాట్లను ఓపెన్ గా బయటపెట్టాడు.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

లోబో ఇంకా ట్రాక్ లోకి రాలేదు

లోబో ఇంకా ట్రాక్ లోకి రాలేదు

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా వారి ఆటను చాలా తెలివిగా ఆడుతున్నట్లు అనుకుంటున్నారు. కానీ అందులో కొందరు సేఫ్ గేమ్ కూడా ఆడుతున్న వారు చాలా ఎక్కువమంది ఉన్నారు అని నాగార్జున కామెంట్స్ అయితే చేశారు. ఇంకా కొందరు అసలు ట్రాక్లోకి రాలేదని కూడా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా లోబో అయితే ఫిజికల్ టాస్క్ లో ఇంతవరకు తన బలాన్ని చూపించలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఇస్తున్నాడు కానీ టాస్క్ ల విషయంలో మాత్రం అతను ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని నాగార్జున అందరు ముందు చాలా ఓపెన్ గానే చెప్పేశారు

 సేఫ్ గేమ్ ఆడుతున్నారు

సేఫ్ గేమ్ ఆడుతున్నారు

చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని బిగ్ బాస్ ప్రైవేట్ గా పిలిచి నామినేట్ చేయమని చెప్పడం వల్లనే ఈ విధంగా చేసినట్లు ఆరోపణలు చేశాడు. ఎదురుగా ఉంటే మాత్రం బహుశా అలా జరిగి ఉండేది కాదేమో అని కూడా తెలియజేశాడు. మొత్తానికి నాగార్జున వేసిన ప్రశ్నలు షన్ను గ్యాంగ్ ను కొంత ఇబ్బందులు పడేసినట్లు అనిపించింది. హౌస్ లో ఉన్న వాళ్ళు స్నేహితులు కదా మీరు ముగ్గురు మాత్రమే స్నేహితులా అని ప్రత్యేకంగా అడిగే ప్రయత్నం చేశారు.

సిరి గాలి తీసేసిన నాగార్జున

సిరి గాలి తీసేసిన నాగార్జున

ముఖ్యంగా సిరిని నాగార్జున అడిగిన ప్రశ్నలు కాస్త కౌంటర్ గానే అనిపించాయి. హౌస్ లో ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడకూడదు అని నువ్వు చాలా సార్లు గొడవ పడుతూ అందరికీ చెబుతున్నావు. అందరికీ నువ్వు అలా చెప్తావు కానీ నువ్వు మాత్రం ప్రత్యేకంగా నీ గ్యాంగ్ తో కూర్చున్నప్పుడు అందరి గురించి మాట్లాడతావు. మరి అది ఏమిటని నాగార్జున గాలి తీసేసినట్లుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సిరి సిగ్గుపడుతూ ఒక్కసారిగా తల దించుకుంది. మళ్లీ ఏదో మాట్లాడే కవర్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ నాగార్జున మాత్రం అది కరెక్ట్ కాదు అదే విధంగా కౌంటర్ ఇచ్చాడు..

 శ్రీరామ్ చేసింది తప్పు..

శ్రీరామ్ చేసింది తప్పు..

ఇక శ్రీరామ్ విషయంలో కూడా నాగార్జున ఒక విధంగా హెచ్చరిక జారీ చేశారు. జెస్సితో గొడవ జరిగినప్పుడు నువ్వు మాట్లాడిన విధానం కరెక్ట్ గానే ఉంది. కానీ ఎవరి వంట వాళ్లే వండుకోవడం అసలు సరైన ఇది కాదని ఆ విషయంలో కాస్త తొందరపడి పడినట్టు అనిపించింది అని కూడా నాగార్జున వివరణ ఇచ్చారు. కానీ కెప్టెన్ గా మాత్రం అద్భుతంగా చేశావు. నాకు చాలా బాగా నచ్చింది. కామండింగ్ గా రూల్స్ ను కరెక్ట్ గా ఫాలో చెయ్యాలి. ఆ విషయంలో నువ్వు బాగా వర్క్ చేశావు అని శ్రీ రామచంద్రపై నాగార్జున ప్రశంసలు కురిపించారు.

హామీదా ఇష్టమా?

హామీదా ఇష్టమా?

ఇక చివరలో హామీదా ముఖ్యమా? బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా? అని నాగర్జున అడిగినప్పుడు శ్రీరామ్ కొంతసేపు ఏమి అనకుండా ఆలోచించాడు. అయితే ఫైనల్ గా తను ఇక్కడికి బిగ్ బాస్ టైటిల్ ని గెలవడానికి వచ్చాను అంటూ అందుకే బిగ్ బాస్ టైటిల్ అంటే ఇష్టమని ఆ తరువాతనే హామీదా ఇష్టమని చెప్పాడు. అయితే నాగార్జున మాత్రం తను ఆ విషయం తనను అడిగి ఉంటే మాత్రం హామీదా ఇష్టమని చెప్పేవాడిని అని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X