twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 5: శ్రీరామ్‌ను నడవలేని దుస్థితికి తీసుకొచ్చావు.. నాగ్ మాటలకు బిక్క మొహంతో పింకి కంటతడి!

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి తుది దశకు చేరుకుంటోంది. అసలు ఈ సారి షో ఏమాత్రం సక్సెస్ కాదని వచ్చిన ఆరోపణలకు నిర్వాహకులు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు. టాస్క్ ల విషయంలో మాత్రం బిగ్ బాస్ ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. ఈసారి నాగార్జున హోస్టింగ్ పై మధ్యలో కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత వెంటనే మళ్లీ సెట్ అయ్యారు. ఇక ఇప్పుడు టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకోవడం కోసం కంటెస్టెంట్స్ చాలా బలంగా పోరాడుతున్నారు అయితే నాగార్జున ఎప్పటిలానే తప్పులు చేసిన వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

     నాగార్జున కౌంటర్స్

    నాగార్జున కౌంటర్స్

    శనివారం ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ కూడా అనేక రకాల సందేహాలపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాకుండా వారు చేసిన తప్పిదాలపై కూడా సీరియస్ అయ్యారు. ముందుగా విభేదాలు ఉన్నవారికి నాగార్జున డౌట్ క్లియర్ చేశాడు. ఎవరి మీద ఎవరికి కంప్లైంట్స్ ఉన్నాయో చెప్పాలి అని ఒక వివరణ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారికి నచ్చిన పాయింట్స్ ను చెబుతూ వారి బాధను కూడా చెప్పుకున్నారు.

    మనసు ముక్కలు చేశాడు

    మనసు ముక్కలు చేశాడు

    ఫిర్యాదులుంటే చెప్పాలని నాగ్ ఆదేశించడంతో సన్నీ అందరూ ఊహించినట్లే సిరి మీద కంప్లైంట్‌ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే లో వీరిద్దరికి ఏ రేంజ్ లో గొడవ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సిరి మాత్రం మానస్‌, షణ్ను మీద పిర్యాదు చేయడం విశేషం. ఇక పింకీ, సన్నీ మీద ఫిర్యాదు చేశారు. ఇక కాజల్ కూడా ఊహించినట్లే సన్నీ తన మనసు ముక్కలు చేశాడని పిర్యాదు చేసింది. ఎంత మాట్లాడాలని ఉన్నా కూడా సన్నీ దూరం పెడుతున్నాడని రెండు రోజులుగా తాను చాలా బాధపడుతున్నానని కాజల్ ఎమోషనల్ అవ్వడంతో సన్నీ అందరి ముందే ఆమెకు సారీ చెప్పాడు.

    పింకి విషయంలో సీరియస్

    పింకి విషయంలో సీరియస్

    ఇక అందరి గురించి ఆలోచించన హోస్ట్ నాగార్జున ముందుగా పింకీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ వారం ఐస్ బకెట్ ఛాలెంజ్ లో ఆమె వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని నాగార్జున తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హెచ్చరిక చేసినప్పటికీ కూడా ప్రియాంక కంటెస్టెంట్స్ కు తన తెలివితేటలు ఉపయోగించి సొంతంగా వైద్యం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు.

    కంటతడి పెట్టిన పింకి

    కంటతడి పెట్టిన పింకి

    సొంత వైద్యం చేయవద్దని మరీమరీ చెప్పినప్పటికీ శ్రీరామ్ కాళ్లకు బామ్‌ రాసి వేడినీళ్లు పోశావు. దీంతో శ్రీరామ్‌ను నడవలేని దుస్థితికి తీసుకొచ్చావు. నువ్వు డాక్టర్‌వి కాదు. కాబట్టి ఇలా సొంత వైద్యం చేయడం కరెక్ట్ కాదు అంటూ నాగార్జున మొహం మీదే చెప్పడంతో ప్రియాంక దెబ్బకు బిక్క మొహం వేసింది. ఇక నాగ్ సీరియస్ అవ్వడంతో ఆమె వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది.

    ప్రియాంక ఎలిమినేట్?

    ప్రియాంక ఎలిమినేట్?

    సిరి విషయంలో కూడా ప్రియాంక కొంత అదుపుతప్పి సొంత తెలివి తేటలతో వైద్యం చేయడానికి ట్రై చేసింది. ఆమెకు మోషన్స్ అయినప్పుడు కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయగా ఆమెకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక మొత్తానికి పింకి ఈ వారం ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఎలాగైనా బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని అనుకున్న పింకి ఇప్పుడు ఎలిమినేషన్ లో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

    English summary
    Bigg boss telugu 5 nagarjuna counter to priyanka behavior
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X