Bigg Boss 5 : సన్నీ అండ్ కోకి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన నాగ్... సన్నీ ఫోటోని చింపి మరీ!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఏడుగురు హౌస్ మేట్స్ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రతీ శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ లో నాగార్జున కనిపించి అందరినీ అలరిస్తారు. ఇక ఈ వారం కూడా నాగర్జున ఎంట్రీ ఇచ్చిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో నాగార్జున సన్నీకి మాస్ వార్నింగ్ ఇవ్వడం కనిపిస్తోంది.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం వచ్చేసింది
శనివారం వచ్చేయడంతో బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున వచ్చేసాడు. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ ప్రోమో విడుదల కావడం అది సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా జరిగిపోయింది. శనివారం అంటేనే నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకే రోజు.. ఎవరు తప్పు చేసినా నాగ్ వాళ్ళకి క్లాస్ పీకుతూ, వార్నింగ్ ఇస్తాడు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగుంటే ప్రసంశలు కురిపిస్తాడు.

వాళ్లందరినీ ఆడుకున్న నాగ్
ఇక తాజాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోయిన మానస్, సన్నీ, కాజల్, అనీ మాస్టర్ లకి నాగ్ చేతిలో తిట్లు పడ్డాయి. నాగార్జున ఫోటో కార్డ్స్ ని మిషన్ లో వేస్తూ ఒక్కొక్కరికి క్లాస్ పీకేసాడు. ముందుగా అనీ మాస్టర్ తో మాట్లాడుతూ హౌస్ మొత్తం డోంట్ గివ్ అప్ అంటూనే ఉన్నారు.. అయినా గేమ్ ఆడ లేదు అన్నట్టు అనీ మాస్టర్ ని నాగార్జున కోప్పడ్డారు.

తోండాట ఏంటి కాజల్?
ఇక కాజల్ ని ఆ తొండాటలేమిటమ్మా అని నాగార్జున ప్రశ్నించాడు. ఎలాగైనా గెలుద్దామని అలా చేశాను అంటూ కాజల్ నవ్వే ప్రయత్నం చేయగా గెలుపు కూడా పద్దతిగా ఉంటేనే.. గెలుపులో ఎంజోయ్మెంట్ తెలుస్తుంది అని కాజల్ కు క్లాస్ పీకారు నాగార్జున. ఇక మానస్ ఫోటో కార్డు తీసిన నాగ్ నీకు ఈ హౌస్ లో ఏమన్నా అన్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా అని అడిగాడు. అన్యాయం అని కాదు సంచాలక్ డెసిషన్ నాకు నచ్చలేదు అన్నాడు మానస్.

సంచాలక్ నిర్ణయమే ఫైనల్
అయితే బిగ్ బాస్ హౌస్ లో సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అన్నాడు నాగ్. ఇక సన్నీ కి మాత్రం నాగ్ బాగా క్లాస్ పీకారనే చెప్పాలి. సన్నీ చాలామంది ప్రోవోక్ చేసారు సర్ అనగానే.. ప్రోవోక్ చేస్తే ప్రోవోక్ అయ్యిపోతావా.. అని నాగ్ అనగానే.. దానికి సన్నీ నన్ను రా అంటేనే తట్టుకోలేను అన్నాడు. సరే రా అన్నారు అనుకో, అంటే మీదమీదకి వెళ్ళిపోతావా అని నాగ్ అనగానే.. సర్ నేను కొట్టను సర్ అని సన్నీ సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

సన్నీ ఫోటో చించేసిన నాగ్
అయితే కొట్టవు సరే అలా మీదమీదకి వెళ్ళిపోతావా అంటూ నాగ్ ఫైర్ అయ్యాడు. ఎంతమంది నిన్ను ఆపారో తెలుసా.. ఒక మనిషి ఒకటి పట్టుకుని ఉంటే.. అతని చేతిలో నుండి తన్నడం అసలు రైట్ అనుకున్నావా నువ్వు అంటూ సన్నీకి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున అదే కోపంతో సన్నీ ఫోటో ని చించిపారేసాడు. మొత్తం మీద ఈ రోజు ప్రోమో చూస్తుంటే నేటి ఎపిసోడ్ మీద అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











