For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss : బిగ్ బాస్ ఎలిమినేషన్ షాక్... ఈ వారం ఇద్దరా?.. లేక రొటీన్ ప్లానేనా?

  |

  బిగ్ బాస్ ఈసారి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. సీజ‌న్ 5 లో ఎవరూ ఊహించ‌ని ట్వీస్టులు, చిత్ర విచిత్ర‌మైన‌ టాస్కులు ఇస్తూ ర‌క‌రకాల స‌ర్ ప్రైజ్ ల‌తో ఎప్పుడూ లేని విధంగా షో ను ఆస‌క్తి కరంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్ష‌కుల మ‌న‌స్సును దోచుకునే ప్రయత్నం చేస్తోంది బిగ్ బాస్ టీం. ఇక నాగార్జున శని ఆదివారాలలో కనిపించి వారం రోజుల పాటు జరిగిందంతా రీవైండ్ చేసి ఒక్కొక్కరినీ ప‌లుక‌రించుకుంటూ క్లాస్ తీసుకుంటారు. ప్ర‌సంశిస్తారు. అవ‌స‌ర‌మైతే.. చీవాట్లు కూడా పెడతారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ మీద కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

   ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం

  ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం

  ఈ వారం నామినేషన్ లో భాగంగా కాజల్, రవి, సిరి, అనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్ నామినేట్ కాగా కాగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో నేరుగా నామినేట్ అయిన సంగతి గుర్తు చేసిన బిగ్ బాస్ లోబో కూడా నామినేషన్ లో ఉన్నాడని చెప్పారు. అలా ఈ వారం మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, ఆర్జే కాజ‌ల్ లను నిన్న సేఫ్ చేశారు.

  ఇద్దరు ఎలిమినేట్?:

  ఇద్దరు ఎలిమినేట్?:

  ఇక‌ ఈరోజు లోబో, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఉన్నారు. అయితే సాధారణంగా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం ప్రతి శనివారం బయటకు లీక్ అయిపోతుంది.. అందుకే చివరి వరకు సస్పెన్స్ కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు అని అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు.

  కన్ఫ్యూజన్ లో పడేసేందుకు

  కన్ఫ్యూజన్ లో పడేసేందుకు

  శనివారం నాడు అనీ మాస్టర్ కానీ ప్రియా కానీ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా ముందు ప్రచారం జరిగింది.. అందుకు తగ్గట్లుగానే అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు అని కొంతమంది ప్రియా ఎలిమినేట్ అయిందని కొంతమంది కూడా నమ్మారు. అయితే ఇప్పుడు వాళ్లందరినీ మరింత కన్ఫ్యూజన్ లో పడేసేందుకు బిగ్ బాస్ కొత్త ప్లాన్ అమలు చేసినట్లు కనిపిస్తోంది.

   అనీ మాస్టర్, ప్రియా

  అనీ మాస్టర్, ప్రియా

  ఈ రోజు విడుదల చేసిన ప్రోమో ప్రకారం మిగతా అందరి కంటెస్టెంట్ లు సేఫ్ అయిపోగా చివరికి అనీ మాస్టర్, ప్రియా ఇద్దరు ఎలిమినేషన్ లో మిగిలారు. ఇద్దరినీ హౌస్ సభ్యులందరికీ గుడ్ బై చెప్పమని కోరారు నాగార్జున. ఇద్దర్నీ చెరో చెక్క బాక్స్ లోకి వెళ్ళి ఉండమని చెప్పారు. ఎవరికి వాళ్లు ధైర్యం చెప్పుకొని ఇంట్లో హౌస్ సభ్యులందరి దగ్గర సెలవు తీసుకుని రెండు బాక్స్ లలో చెరొకరు వెళ్లారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒక లైట్ వెలగడం కాసేపటికి లైట్ ఆగిపోయింది.

   అనీ మాస్టర్ సీక్రెట్ రూమ్ కి?

  అనీ మాస్టర్ సీక్రెట్ రూమ్ కి?

  ఆ లైట్ ఆగిపోయిన వెంటనే ఎవరు మిగిలి ఉన్నారో చూసుకోమని మిగతా హౌస్ సభ్యులకు నాగార్జున సూచించారు. మిగతా హౌస్ సభ్యులందరూ హుటాహుటిన అక్కడికి వెళ్లి రెండు తలుపులు ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ మాయమవుతారు. దీంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ గత వారం కూడా బయటకు పంపినట్టే పంపి లోబోను సీక్రెట్ రూమ్ కి పంపినట్లుగా ఈ వారం ఎలిమినేషన్ అయిపోగానే అనీ మాస్టర్ ను కూడా సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్ పూర్తి అయితే గాని చెప్పలేం.

  Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu

  English summary
  In Bigg Boss Telugu 5 latest promo Nagarjuna hints anee master and priya eliminati together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X