For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss 5: రవి గడ్డి తినమంటే తింటావా.. యాక్టర్స్ అంటే చిన్న చూపా?: నాగార్జున సీరియస్

  |

  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో అసలు సక్సెస్ అవుతుందా లేదా అని మొదట్లో చాలా అనుమానాలు వచ్చాయి. కానీ మెల్లగా మన స్టార్ హీరోలు రియాలిటీ షో కు భారీ స్థాయిలో క్రేజ్ అందించారు. ముఖ్యంగా నాగార్జున వరుసగా మూడుసార్లు తన హోస్టింగ్ తో ది బెస్ట్ అనిపించారు. ఐదో సీజన్లో తనదైన శైలిలో ఆకట్టుకునేందుకు నాగార్జున ప్రయత్నం బాగానే చేస్తున్నారు. అయితే మధ్యమధ్యలో మాత్రం ఈసారి కంటెస్టెంట్స్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

  ఒక వారం మొత్తం ఎలా ఉన్నా కూడా చివర్లో నాగార్జున వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక శనివారం రోజు కూడా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిన నాగ్ అలాగే అందరిని తన మాటలతో కడిగిపారేశారు.

  వీలైనంతవరకు కూల్ గానే..

  వీలైనంతవరకు కూల్ గానే..

  బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పటి నుంచి కూడా నాగార్జున ఇంతవరకు కంటెస్టెంట్స్ పై పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. అందరికీ సున్నితంగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కువగా కాంట్రవర్సీకి తావివ్వకుండా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే తప్పులు చేసిన వారిని మాత్రం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వారిని మళ్లీ సెట్ చేసి మార్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి నాగార్జున వీలైనంతవరకు కూల్ గానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

  నాగార్జున అసంతృప్తి

  నాగార్జున అసంతృప్తి

  ఇక ఫైనల్ గా శనివారం రోజు మాత్రం నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ కూడా అనేక రకాల విషయాలపై ప్రశ్నించారు. అంతేకాకుండా గత వారం మొత్తంలో వారు చేసిన పొరపాట్లను కూడా గుర్తు చేస్తూ మళ్లీ ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కాస్త గట్టిగానే హెచ్చరించారు. అయితే కంటెస్టెంట్స్ కొన్నిసార్లు మితి మీరి మాట్లాడే విధానం అందరిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అదే విషయంలో నాగార్జున కొందరి పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా లోబో యాంకర్ రవి శ్రీ రామచంద్రపై కూడా కాస్త కోపానికి గురయ్యారు.

  ఆ హక్కు ఎవరికి లేదు

  ఆ హక్కు ఎవరికి లేదు

  లోబో బిగ్ బాస్ హౌస్ లో ప్రాపర్టీని డ్యామేజ్ చేసే విషయంపై నాగార్జున గట్టిగానే ఆరా తీశారు. అయితే మరోసారి లోబో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి నాగార్జున ఏ మాత్రం తగ్గకుండా కడిగిపారేశారు. గేమ్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థులను బోల్తా కొట్టించడానికి ఎలాంటి ఆలోచన విధానం అయినా సరే ఆటలో భాగమే కానీ బిగ్ బాస్ హౌస్ లోనే ప్రాపర్టీని డ్యామేజ్ చేసే హక్కు ఎవరికీ లేదు మీ టెడ్డి బేర్ లో దూది పెట్టడానికి అనువుగా ఉంటే ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం చాలా తప్పు అని హెచ్చరించే ప్రయత్నం చేశారు.

  గడ్డి తినమంటే.. తింటావా?

  గడ్డి తినమంటే.. తింటావా?

  ఇక చివరికి లోబో రవి చెబితేనే నేను బొమ్మ కోసం దూది తీసుకొని వచ్చాను అని చెప్పడంతో నాగార్జున ఎవరూ ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చారు. రవి ఏం చెబితే అది చేస్తావా? అయితే ఇప్పుడు నిన్ను రవి గడ్డి తినమంటాడు అలాగే తింటావా? అని ప్రశ్నించారు. గతంలో కూడా నువ్వు కొన్ని సార్లు ఇలాంటి పొరపాటు చేశావు లోబో అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చారు. ఇక మళ్లీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని కూడా చెప్పడంతో అందుకు సరైన సమాధానం ఇచ్చాడు.

  యాక్టర్స్ అంటే చిన్నచూపా?

  యాక్టర్స్ అంటే చిన్నచూపా?

  ఇక శ్రీ రామచంద్ర గత నామినేషన్లు ప్రవర్తించిన తీరుపై కూడా నాగార్జున ఒక్కసారిగా సీరియస్ అయ్యారు నేను జస్ట్ సింగర్ బ్రో నాకు మాటలు రాసుకుని స్క్రిప్ట్ రాసుకుని నటించడం రాదు అనే కామెంట్ చేయడం వలన నాగార్జున కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టారు. యాక్టర్స్ అంటే చిన్న చూపా ఇంకోసారి ఇలాంటి పదాలు వాడవద్దు అంటూ కౌంటర్ ఇచ్చేశారు.

  తన మనసులో అలాంటిది ఏమీ లేదు అని శ్రీ రామచంద్ర చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ నాగార్జున మాత్రం ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అనే సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా నీ ఆట నువ్వు మాత్రమే ఆడు నీలా నువ్వు మాత్రమే ఉండు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు అని నాగార్జున వివరణ ఇచ్చారు.

  సీక్రెట్ రూమ్..

  సీక్రెట్ రూమ్..

  ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున సరికొత్త ట్విస్టు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎవరైనా ఒకరు ఈరోజు హౌస్ లో నుంచి వెళ్ళిపోతారు అంటూ కంటెస్టెంట్స్ అందరిని కూడా కాస్త భయపెట్టారు. ఇక నేటి నుంచి ఆట సరికొత్త మలుపు తిరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. హౌస్ లో ఎవరిని బయటకు పంపించాలని అనుకుంటున్నారు అని అందరిని అడిగినప్పుడు లోబో ప్రియా ఇద్దరు కూడా సమానమైన ఓట్లతో డేంజర్ జోన్ లోకి వచ్చేసారు.

  ఆ క్రమంలో మళ్లీ చివర్లో నాగార్జున అందరి నిర్ణయం తీసుకోవడంతో లోబో ఎలిమినేట్ అంటూ షాక్ ఇచ్చారు. అయితే స్టేజ్ మీదకు వచ్చిన లోబోకు నాగార్జున మరొక సర్ ప్రైజ్ ఇచ్చారు. సీక్రెట్ రూమ్ లో కి వెళుతున్నాడు అని అందరికీ అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మరి లోబో ఇక నుంచి అయినా మంచి ఆటను కనబరుస్తాడో లేదో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 nagarjuna serious on lobo and singer srirama chandra..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X