For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: నాగార్జునను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. మాకు 'నమ్మకం' లేదంటూ!

  |

  నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు మూడో వారం చివరి కి చేరింది. ఈరోజు నాగార్జున షో లో కనిపించబోతున్నారు. ప్రతి శని, ఆదివారం నాగార్జున షో లో కనిపించి ఇంటి సభ్యులందరినీ హుషారు పరుస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఆయన షో లో కనిపించబోతున్నారు. అయితే ఈ సంగతి అలా పెడితే నాగార్జున మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ సోషల్ మీడియా వేదికగా వచ్చి పడుతున్నాయి. ఒక నాగార్జున మీద కాకుండా బిగ్ బాస్ నిర్వాహకుల మీద కంటెస్టెంట్ ల మీద కూడా పెద్ద ట్రోల్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  నాగ్ ను టార్గెట్ చేసి

  నాగ్ ను టార్గెట్ చేసి

  సాధారణంగా తెలుగు బిగ్ బాస్ విషయంలో చాలా కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందే ఈ నియమ నిబంధనల గురించి కంటెస్టెంట్స్ కి పూర్తిగా వెల్లడిస్తూ ఉంటారు నిర్వాహకులు. ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి సారి కూడా తెలుగులోనే మాట్లాడాలి అనేది బిగ్ బాస్ నిర్వాహకుల ప్రథమ సూచన. గతంలో కొన్ని సీజన్లలో తెలుగులో మాట్లాడకుండా హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడిన కొంత మంది సభ్యులు మీద చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కానీ ఈ సారి మాత్రం హౌస్ సభ్యుల మీద పెద్దగా ఈ విషయంలో కనీసం హెచ్చరించిన దాఖలాలు కూడా లేవు.

  ఎందుకో అలా

  ఎందుకో అలా


  ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కంటెస్టెంట్ లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే నాగార్జున గత సీజన్లో కంటెస్టెంట్ లతో వ్యవహరించిన అంత కఠినంగా ఈ సీజన్లో కంటెస్టెంట్ లతో వ్యవహరించడం లేదని వాపోతున్నారు. నాగార్జునకు వీళ్లందరి లో ఎక్కువ మంది పరిచయస్తులు ఉన్నారో మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలీదు కానీ ఆయన హౌస్ మీద పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.

  బూతులు అలా

  బూతులు అలా

  అలాగే ఆయన హౌస్ లో ఒక్కొక్క సభ్యులతో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. మొదటి వారంలో సరయు హౌస్ నుంచి బయటకు రాక ముందు నీ సహజమైన బూతులు ఎందుకు మాట్లాడటం లేదు అని ఆయన ప్రశ్నించారు. నీకు నువ్వు లా ఉండు బూతులు మాట్లాడు అని ఆమెను ఎంకరేజ్ చేసిన నాగార్జున, మొన్నటి వారం లో బయటకు వచ్చిన ఉమా దేవి విషయంలో మాత్రం బూతులు మాట్లాడటం తప్పు అన్నట్లుగా మాట్లాడారు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.

  ఎందుకు లైట్ తీసుకుంటున్నారు

  ఎందుకు లైట్ తీసుకుంటున్నారు

  అలాగే గత సీజన్లో నాగార్జున వస్తున్నారంటే హౌస్ సభ్యులందరూ వణికిపోయే వారని తాము చేసిన తప్పులు బయట పెట్టి ఎక్కడ పరువు తీస్తారు అనే భయంతో ఉండేవారని కానీ ఇప్పటి హౌస్ సభ్యులు మాత్రం చాలా లైట్గా తీసుకుంటున్నారు అని వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే అందర్నీ సెట్ చేస్తాను అని నాగార్జున అంటున్నా మాకు నమ్మకం లేదు అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఈ మధ్య ప్రతి సారి ప్రోమోలో కెప్టెన్ ని రివిల్ చేసేస్తున్నారు.

  బిగ్ బాస్ ని కూడా

  బిగ్ బాస్ ని కూడా

  సాధారణంగా కెప్టెన్ అయిన వారి చేతికి రెడ్ కలర్ బ్యాండ్ ఒకటి ఉంటుంది. ఆ రెడ్ కలర్ బ్యాండ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి విశ్వ హౌస్ కెప్టెన్ అయిన రోజు అలాగే జెస్సి హౌస్ కి కెప్టెన్ అయిన రోజు కూడా ప్రోమో లోనే చూపించి ఉన్న ఆసక్తిని తగ్గించేస్తున్నారు. అందుకే నెటిజనులు బిగ్ బాస్ యాజమాన్యాన్ని కూడా టార్గెట్ చేస్తూ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నాగార్జునను గతంలో కూడా కొన్ని సార్లు నెటిజన్లు గట్టిగ్గాయా ట్రోల్ చేసిన సందర్భాలున్నాయి.

  అప్పట్లో కూడా

  అప్పట్లో కూడా

  ఆయన గతంలో యాపిల్ ఫోన్ వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు విషయంలో కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అంతేకాక గత ఏడాది కూడా నాగార్జున మంచి కరోనా టైంలో బిగ్ బాస్ చేయడంతో ఎక్కువగా సామాజిక దూరం అనే వ్యవహారాన్ని పాటిస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో కూడా ఒక మగ కంటెస్టెంట్ హగ్ ఇవ్వబోగా సామాజిక దూరం పాటించాల్సి ఉందని చెబుతూ దూరం పెట్టి ఆ తర్వాత దివితో దగ్గరగా ఉన్న ఒక ఫోటో బయటకు రావడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. మళ్ళీ ఈ సీజన్లో చేస్తున్న కొన్ని విషయాలకు ఇలా టార్గెట్ అవుతున్నారు.

  ఎవరు ఎలిమినేట్ అవుతారు?

  ఎవరు ఎలిమినేట్ అవుతారు?

  ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యుల లో కొందరిని నాగార్జున సేవ్ చేయబోతున్నారు అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ముందు గానే బయటకు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న లహరి లేదా ప్రియలలో ఒకరే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూడాలి ఎం జరగబోతోంది అనేది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది.

  English summary
  Bigg Boss Telugu 5 entered into third week, but netizens trolling targeting nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X