Bigg Boss Telugu 5 contestant Loboపై దారుణంగా ట్రోలింగ్.. నాగార్జునను వదలని నెటిజన్లు.. వీడియోలు వైరల్

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత రేటింగ్, ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటి షో బిగ్‌బాస్. తెలుగులో ఈ షో ఐదో సీజన్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించింది. ఈ షోలో అతి సామాన్యులైన కంటెస్టెంట్లు అసాధారణ స్థాయికి చేరుకోవాలన్న కాంక్షతో ముందుకు వచ్చారు. అందులో ఒకరు మహ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో. టీవీ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్‌గా అందరికి సుపరిచితులు. అయితే వివాదాలకు దూరంగా ఉండే లోబోపై ఇప్పుడు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన లోబోను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే..

 లోబో అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

లోబో అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫుల్ ఎమోషనల్ అయ్యారు. వేదిక మీదకు వచ్చే క్రమంలో లోబోకు సంబంధించిన ప్రోమోను ప్రదర్శించారు. ఈ సందర్బంగా తాను 9వ తరగతి వరకే చదువుకొన్నాను. చిన్న దొంగతనం చేస్తే స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపేశారు. నేను టాటూ షాపులో పనిచేశాను. కిజికిస్థాన్ అమ్మాయికి నేను కాలి మీద టాటూ వేస్తే.. నాకు లోబో అని పేరు పెట్టారు అని చెప్పారు.

బిగ్‌బాస్ నాకు గొప్ప ఫ్లాట్‌ఫామ్

బిగ్‌బాస్ నాకు గొప్ప ఫ్లాట్‌ఫామ్

బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ.. చాలా గొప్ప ఫ్లాట్‌ఫామ్. ప్రస్తుతం నేను 5 స్టేజ్‌లో ఉన్నాననుకో. ఆ తర్వాత ఏదైనా చేస్తే 6, 7 స్టేజ్‌లోకి వెళ్తాను. కానీ బిగ్‌బాస్‌లోకి వెళితే.. డైరెక్టుగా 25వ స్టేజ్‌కు వెళ్తాం అని పొగడ్తలతో ముంచెత్తారు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి వేదిక మీద అందర్నీ మరింత ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు.

బిగ్‌బాస్ నాకు మంచి లైఫ్ ఇచ్చిందంటూ..

బిగ్‌బాస్ నాకు మంచి లైఫ్ ఇచ్చిందంటూ..

అయితే నాగార్జున స్టేజ్ మీద లోబోను చూడగానే ఏడు రంగులు ఉంటే రోయిన్ బో అంటారు. నెత్తి మీద ఒక రంగు ఉంటే లోబో అంటారు అని నాగ్ సెటైర్ వేశారు. దాంతో నైస్ కాంప్లిమెంట్ అని అన్నారు. ఫ్యాషన్ అంటే ఇష్టం. నేను డిఫరెంట్‌గా ఉండాలని కోరుకొంటాను అందుకే ఇలా కనిపిస్తాను అని అన్నాడు. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టడం ఎలా ఉందని నాగ్ అడిగితే.. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా మ్యూజిక్ నాకు మంచి లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నాకు బిగ్‌బాస్ నాకు మరో లైఫ్ ఇవ్వడానికి సిద్ధమైంది అని లోబో అన్నాడు.

బిగ్‌బాస్‌కు ఓ దండంరా నాయనా అంటూ లోబో

అయితే ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో లోబో మాట్లాడాడు. అయితే బిగ్‌బాస్ తెలుగు షో చూస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ... బిగ్‌బాస్‌కు నిజంగా ఓ దండం రా భయ్యా.. నిజంగా.. అది నా టేస్ట్ కాదు అని లోబో సమాధానం చెప్పారు. బిగ్‌బాస్‌లో ఛాన్స్ రాకపోవడం మంచిదేనా అని యాంకర్ మరో ప్రశ్న అడిగితే.. నాకు షోలో అవకాశం రాలేదు. మంచిదే అయింది. ఆ షో నాకు నచ్చదు అంటూ లోబో చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.

బిగ్‌బాస్‌పై నాగార్జున కామెంట్స్

లోబో విషయం పక్కన పెడితే.. బిగ్‌బాస్ షోను తక్కువ చేస్తూ నాగార్జున వీడియో కూడా వైరల్ అయింది. హోస్ట్‌గా వ్యవహరించకముందు.. బిగ్‌బాస్ గురించి నా వద్ద మాట్లాడవద్దు. ఆ షో గురించి మాట్లాడితే... నాకు బూతులు వస్తాయి. నాకు బిగ్‌బాస్ కాన్సెప్ట్ అంటే ఇష్టం లేదు. ఒకరి జీవితంలో తొంగి చూడటమంటే నాకు నచ్చదు. అందుకే నాకు నచ్చదు అంటూ నాగార్జున చెప్పారు.

Recommended Video

Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer
నెటిజన్ల సెటైర్లు వేస్తూ...

నెటిజన్ల సెటైర్లు వేస్తూ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో లోబో, నాగార్జునకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా గతంలో బిగ్‌బాస్ షో గురించి మాట్లాడిన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బిగ్‌బాస్ షో నాకు నచ్చదు అని చెప్పిన హోస్ట్ మూడు సీజన్లుగా చేస్తున్నాడు. ఇక కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X