Bigg Boss Telugu 5లో కెప్టెన్‌గా రెండోసారి టాప్ కంటెస్టెంట్.. బ్రహ్మ వ్యూహం ఫలించి అలా..!

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. మరో నాలుగు వారాలపాటు షో కొనసాగే అవకాశం ఉండటంతో ఎవరు టాప్ 5లో చేరుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ మరింత ఆసక్తిని రేపింది. అయితే కెప్టెన్సీ టాస్క్ ఆరంభంలో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ గట్టి ఝలక్ ఇచ్చాడు. ఇంటిలో ఇదే ఆఖరి కెప్టెన్సీ టాస్క్ అంటూ ప్రకటన చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే రానున్న వారంలో నామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. తప్పనిసరిగా కెప్టెన్సీ కావాల్సిందే అనే కోరికతో గేమ్‌లో ఇంటి సభ్యులు పార్టిసిపేట్ చేశారు. అయితే ఇప్పటి వరకు కెప్టెన్‌గా చేయని ఆర్జే కాజల్ ఈ పోటీలో ప్రయత్నించి నిరాశను సొంతం చేసుకొన్నది.

అయితే కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ సమయంలో టాప్ కంటెండర్ షణ్ముఖ్ జస్మంత్ తాను కెప్టెన్ కావాలని అనుకొంటున్నాను. కానీ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి కాదు. కెప్టెన్ అనే బాధ్యత నాకు మంచి జోష్ ఇచ్చింది. ఆ బాధ్యతను మరోసారి నిర్వహించాలని అనుకొంటున్నాను. కాబట్టి నేను ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి కెప్టెన్ కావడం లేదు అని చెప్పారు. నేను ప్రేక్షకుల ఓట్ల ద్వారానే ఇంటిలో ఉంటాను..లేదా బయటకు వెళ్తాను అంటూ షన్ను క్లారిటీ ఇచ్చాడు.

Bigg Boss Telugu 5 new captian Shanmukh Jaswanth for 13th week

అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా షణ్ముఖ్ ఎంపికైనట్టు సమాచారం. బ్రహ్మగా పేరున్న షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి కెప్టెన్‌గా మారోసారి ఎంపికైనట్టు తెలిసింది. ఇలా రెండుసార్లు కెప్టెన్సీ పదవి చేపట్టిన కంటెస్టెంట్స్‌లో షన్ను రెండో వ్యక్తి. ఈ సీజన్‌లో విశ్వ కూడా రెండుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతో షణ్ముఖ్ టాప్ 5లో నిలువడానికి అవకాశం చిక్కినట్లయింది.

ఇదిలా ఉండగా, 12వ వారం ఎలిమినేషన్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. షణ్ముఖ్ జస్వంత్‌తోపాటు సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ప్రియాంక, యాంకర్ రవి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X