Bigg boss 5: బిగ్ బాస్ ఇంట్లో దోంగలు.. ఆ అమ్మాయితో జెస్సి రొమాంటిక్ ట్రాక్!
బిగ్ బాస్ హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ మొత్తానికి మూడు వారాల్లో కి విజయవంతం అడుగుపెట్టారు. గత వారం రవి ప్రియ గొడవలలో లహరి బలిపశువుగా మారి ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బలమైన కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో పెద్దగా రూమర్స్ అయితే రావడం లేదు. పోటీ గట్టిగానే కొనసాగుతుందని అర్థమవుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సరికొత్త టాస్క్ లతో పాటు ఒక న్యూ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారి మధ్యలో ఒక లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నట్లు అర్థమవుతోంది.

జెస్సి మాటలకు సిగ్గుపడిన శ్వేత
బిగ్ బాస్ హౌస్ లో ప్రతిసారి కొన్ని ప్రత్యేకమైన జంటలు రొమాంటిక్ సన్నివేశాలతో సరికొత్త ఆకట్టుకుంటు ఉంటారు. ఇక హౌస్ లో అందరూ చిన్నపిల్లాడిగా ట్రీట్ చేయబడుతున్న కెప్టెన్ జెస్సి కూడా తనలోని రొమాంటిక్ యాంగిల్ ను మొదటిసారి బయటపెట్టాడు. ఎక్కువగా శ్వేతతో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ తో కూడా ఒకమాట చెప్పేశాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ మా ఇద్దరినీ కలిపి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఒక రోల్ పెట్టండి. అలాగే మనోహర అనే రొమాంటిక్ సాంగ్ ను కూడా సెట్ చేయాలని కోరడంతో శ్వేతా కాస్త సిగ్గు పడింది.

శ్రీరామచంద్ర మరొక హగ్
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా రెండు జంటలుగా విడిపోవాలని చెప్పడంతో హౌస్ లో ఈసారి రొమాంటిక్ యాంగిల్ కాస్త ఎక్కువగానే కనిపించేటట్లు అర్థమవుతోంది. శ్రీ రామచంద్ర మధ్యలో కూడా లవ్ ట్రాక్ కొనసాగుతోంది. ఇద్దరు కూడా హగ్ చేసుకునే సన్నివేశం ప్రోమో లో హైలెట్ గా నిలుస్తోంది.

సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని..
ఇక ఎవరు ఎలా ఉన్నా కూడా షణ్ముఖ్ జస్వంత్ ఈసారి కాస్త విభిన్నంగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుంచే సిరి మాంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లో గత వారం ఇద్దరి మధ్య గొడవలు చాలానే వచ్చాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ లో జోడిగా కనిపించాలని చెప్పడంతో జశ్వంత్ సిరిని దూరంగా వెళ్లాలని చెప్పాడు. ఎందుకంటే గతంలో చాలాసార్లు జశ్వంత్ సిర ఇద్దరు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ చాలానే వచ్చాయి.

హౌజ్ లో దొంగలు
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఊహించని టాస్క్ లను కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరో దొంగల్లాగా హౌస్ లోకి అడుగు పెట్టి కిచెన్ రూమ్ లో ఉండే సామాన్లను అన్నిటిని కూడా తీసుకు వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ ఏడుస్తూ కనిపించారు కూడా గట్టిగా అరిచి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడు. హౌస్ మేట్స్ కు చాలా వరకు ఈ వారం ఇష్టమైన వంటకాలు ఉండవు అని అర్థమవుతుంది.

న్యూ టాస్క్
ఇక అంతే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బరువు తగ్గే టాస్క్ కూడా ఇచ్చాడు. జంటలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలని టాస్క్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా యోగా వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. లోబో కూడా తనదైన కామెడీతో తరహాలో యోగా చేస్తూ కనిపించాడు. ప్రియా కాజల్ వంటి వారు కూడా గట్టిగానే వర్కౌట్స్ చేస్తూ కనిపించారు.
Recommended Video
శ్రీరామ్ తో జెస్సి గొడవ..
అంతేకాకుండా బిగ్బాస్ మధ్యలో మరొక టాస్క్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో వస్తువులను తీసుకోవాలని ఆర్డర్ వేయడంతో అందరు కూడా కష్ట పడినట్లు తెలుస్తోంది. ఇక ఆ టాస్క్ లో మధ్యలో కెప్టెన్ కు అలాగే శ్రీరామ్ కు కాస్త గొడవ జరిగినట్లు అర్థమవుతుంది. చూస్తుంటే ఈ టాస్క్ ఈ వారంలో వాతావరణాన్ని మార్చేసే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











