Bigg Boss Telugu 5: వైల్డ్ కార్డు ఎంట్రీ.. చివరి నిముషంలో షాకింగ్ ట్విస్ట్.. ఈసారి ఎవరంటే?
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి కాగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక లేడీ కంటెస్టెంట్ ను పంపే అవకాశం ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరు అనే దానిమీద ఇప్పటి దాకా సరైన క్లారిటీ లేక పోగా ఒక పేరు మాత్రం ఎప్పటి నుంచి వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా కామన్. మొదటి మూడు సీజన్ల సంగతి పక్కన పెడితే నాలుగు సీజన్ లో అయితే ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్ లు హౌస్ లోకి వెళ్లారు. అయితే ఆ కంటెస్టెంట్లు ఎవరూ చివరి వరకు పోటీ ఇవ్వకపోయినా వారి ఎంట్రీ మాత్రం ఆసక్తికరంగా సాగడమే కాక హౌస్ లో అలరించారు.

గత ఏడాది కూడా ముగ్గురు
ముందుగా కుమార్ సాయి అనే హీరో కం కమెడియన్ ని లోపలికి పంపగా ఆయన కొన్నాళ్లు ఉండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ముక్కు అవినాష్ తర్వాత, స్వాతి దీక్షిత్ లాంటి వాళ్ళు వెళ్లి బయటకు వచ్చారు అయితే ఈ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో ఒక యాంకర్ ని లోపలికి పంపే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ యాంకర్ ఎవరో కాదు వర్షిణి సౌందరరాజన్.

వర్షిణి అనుకున్నారు కానీ
ఈటీవీలో ఢీ లాంటి ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా పనిచేస్తూ అడపా దడపా జబర్దస్త్ లో అనసూయ, రష్మీ అందుబాటులో లేనప్పుడు ఆయా ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది ఈ యాంకర్. సినిమాల్లో కూడా ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని తేలింది. ఆ తరువాత మరో అమ్మాయి పేరు తెర మీదకు వచ్చినా అది నిజం కాదని తేలింది.

అనేక పుకార్లు
ఇక బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీపై ఇప్పుడు కూడా అనేక పుకార్లు వస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక టాప్ జబర్దష్ నటుడు లేదా తెలుగు టాప్ యాంకర్‌ని తీసుకురానున్నట్లు కొన్ని వార్తా వెబ్‌సైట్‌లు అంచనా వేసాయి. చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి దీంతో వీక్షకులు కూడా ఎవరో ఒకరు వస్తారని అంచనా వేశారు. అయితే, ఇప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు. మునుపటి సీజన్‌లో, ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది.

ఇక లేనట్టే
అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ తెలుగు మేకర్స్ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయకపోవచ్చని తెలుస్తుంది. వైల్డ్ కార్డ్‌లో ప్రవేశించిన అన్ని కోవిడ్ పరీక్షలు చేయించుకున్న తరువాత వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. బిగ్ బాస్ షో 106 రోజులకు గాను 60 రోజులు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే, అందుకే ఇంకా 44 రోజులు మిగిలి ఉన్నాయి. పరిస్థితులలో, ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్‌లో ప్రవేశించేవారు ఎవరూ ఉండకపోవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











