twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 Week 6th nominations.. 10 మంది నామినేషన్లలతో.. ఎవరెవరు ఉన్నారంటే?

    |

    బిగ్ బాస్ తెలుగు 5 ఎట్టకేలకు ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీద ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా నడించింది. ఇక ఈ విషయం మీద తాజాగా విడుదలైన ప్రోమోలో క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    మంటల్లో

    మంటల్లో

    బిగ్ బాస్ అప్పుడే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా తాజాగా ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా గరంగరంగా సాగినట్లు ప్రోమోలో క్లారిటీ వచ్చింది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుకి కొనసాగాలంటే అగ్ని పరీక్ష ఎదుర్కోవాలన్న బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో వారి ఫొటోలను బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన మంటల్లో వేయాల్సి ఉంటుంది.

    విశ్వను వెక్కిరించిన ఆనీ

    విశ్వను వెక్కిరించిన ఆనీ

    ఇక ఈ ప్రక్రియలో జెస్సీని సన్నీ నామినేట్ చేసినట్టు కనిపిస్తూ సన్నీని ఉద్దేశించి నీకు సపోర్ట్ చేసినందుకు బుద్దొచ్చిందన్నాడు. అలాగే సన్నీని నామినేట్ చేస్తున్న సమయంలో నేను గేమ్ ఆడితే తట్టుకోలేవన్న సన్నీతో బెదిరిస్తున్నావేంటి? అని కూడా జెస్సీ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. దొంగ ఆట వద్దు అని విశ్వను ఆనీ మాస్టర్ అంటుండగా అక్కా అని ఏదో అనబోయేంతలో అక్కా అక్కా అని విశ్వ అంటున్న విధంగా వెక్కిరించి చూపించిన ఆమె ఇవన్నీ నడవనవని అంటూ అతని ని నామినేట్ చేసింది.

    సభ్యుల మధ్య వాగ్వాదం

    సభ్యుల మధ్య వాగ్వాదం

    ఇక తనను నామినేట్ చేసిన శ్వేతా వర్మతో నన్ను నామినేట్ చేసి వెళ్ళిపో అంటే శ్వేత కూడా నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది. ఇక సిరి-శ్రీరామ్ మధ్య కూడా గట్టిగానే వాదన జరిగినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఇక రేషన్ మేనేజర్ గా విశ్వ సరిగా విధులు నిర్వర్తించడం లేదని ఇంటి సభ్యులంతా తిన్నారా లేదా అని చూసే బాధ్యత అతనిదే కానీ అందరికంటే ముందు తినేస్తున్నాడని కెప్టెన్ ప్రియా పేర్కొంది.

    హాట్ హాట్ గా

    హాట్ హాట్ గా

    దానికి ప్రియాపై విశ్వ నా కడుపు నా ఇష్టం నే తింటా అని కోపం ప్రదర్శించాడు. రవి మానస్ ని నామినేట్ చేశాడు. లోబో ఫొటో చించేసి మంటల్లో పడేసిన ప్రియాంక సింగ్ సిగ్గుండాలి మళ్లీ అట్నుంచి ఇటు మాట్లాడేందుకు అంటూ ఫైర్ అవడం చూపించారు.

    మళ్ళీ పది మంది

    ఇక బిగ్ బాస్ హౌస్‌ 19 మందితో మొదలు కాగా ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 14 మంది సభ్యులు హౌస్ లో ఉన్నారు. ప్రియ కెప్టెన్ కావడంతో ఆమె నామినేషన్లలో లేదు. ఇక మిగిలిన 14 మందిలో ఆనీ మాస్టర్, ఆర్జే కాజల్, షణ్ముఖ్, విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత మరియు శ్రీరామ చంద్రలో ఈసారి ఏకంగా పది మంది నామినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఈ వారంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏకంగా పది మంది నామినేషన్స్ లోకి రావడంతో వీరిలో ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    here is the list of Bigg Boss Telugu 5 Nominated Contestants List For Sixth Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X