ఆనీ మాస్టర్ కోసం బిగ్ బాస్ లో గొడవ.. ఉసురు పోసుకున్నారంటూ దారుణమైన కొట్లాట!
బిగ్ బాస్ సీజన్ 5, 12వ వారం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో మరింత వేడిగా కామెంట్స్ చేసుకుంటూ షాక్ ఇస్తున్నారు. టాప్ ఫైవ్ లో ప్రస్తుతం ఎవరు గెలుస్తారు అనేది కూడా ఎంతో ఆసక్తిగా మారింది. గతవారం వరకు నామినేషన్స్ లో అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయం ప్రేక్షకులకు కూడా 11వ వారం వరకు కొంత ఊహిస్తూ వచ్చారు. కానీ ఈ సారి మాత్రం అందరూ టాప్ కంటెస్టెంట్స్ కావడంతో ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. పన్నెండవ వారం నామినేషన్స్ లో రవి తప్పితే మిగతా ఆరుగురు కూడా నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్ లో ఆనీ మాస్టర్ ప్రస్తావన అనేక రకాల గొడవలకు దారి తీస్తుంది.

అమ్మాయి గెలవాలని..
గత వారం ఆనీ మాస్టారు హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అసలైతే ఆమె మొదట్లో హౌస్ లో నుంచి వెళ్లి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 11 వారాలు పైగా గట్టి పోటీ ఇచ్చింది. తప్పకుండా ఈసారి ఒక అమ్మాయి టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను గెలవకపోయినా పరవాలేదు మిగతా ఎవరైనా సరే అమ్మాయిలు గెలవాలనే విధంగా మాస్టర్ తన ఆలోచనలను ఓపెన్ గా తెలియజేసింది.

ఆ ప్రభావం వలన
అయితే ఆనీ బాస్టర్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె ప్రతి సారి కూడా నామినేషన్స్ లో ఇబ్బంది పడుతూ వచ్చింది. జెస్సి ఆరోగ్య కారణాల వలన హౌస్ లో నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఒకవేళ అతను వెళ్ళిపోకపోయి ఉంటే అప్పుడే ఆనీ మాస్టర్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. అయితే గత వారం ఎవిక్షన్ పాస్ దగ్గించుకొని మళ్లీ నిలదొక్కుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ కాజల్ గేమ్ ప్లాన్ తో ఆటను మలుపు తిప్పింది. దీంతో ఆ ప్రభావం ఆనీ మాస్టర్ పై పడింది.

దారుణంగా కొట్లాట
ఇక ఆనీ మాస్టర్ వెళ్లిపోవడం పై నామినేషన్స్ లో అయితే గొడవలు గట్టిగానే జరిగాయి. శ్రీరామ్ అయితే కాజల్ ఆడిన విధానం తనకు ఏమాత్రం నచ్చలేదు అని షాక్ ఇచ్చాడు. సన్నీకి అర్హత లేకపోయినా కూడా ఎవిక్షన్ పాస్ ఇవ్వడం సరైన ఆట కాదని ఏవిక్షన్ పాస్ కు ఆనీ మాస్టర్ మాత్రమే అర్హురాలు అంటూ వివరణ ఇచ్చాడు. రవి కూడా అదే తరహాలో కౌంటర్ ఇచ్చాడు. ఆనీ మాస్టర్ ఉసురు పోసుకున్నారు అంటూ కూడా దారుణంగా తిట్టుకున్నారు.
Recommended Video

శ్రీరామ్ vs సన్నీ..
ఇక శ్రీరామ్ అనుకున్నట్లుగానే సన్నీ, కాజల్ ను నామినేట్ చేయగా. ఇక అందరి కంటే ఫేక్ ఎవరైనా ఉన్నారు అంటే అది రవి అంటూ సన్నీ కుండబద్దలు కొట్టి అతన్ని నామినేట్ చేశాడు. కొంతసేపు శ్రీరామ్ , సన్నీ గొడవ అందరిని ఆశ్చర్యపరిచింది. కాజల్ కూడా సన్నీ బాటలోనే రవిని శ్రీరామ్ లను నామినేట్ చేసింది. మానస్ అయితే మరోసారి శ్రీరామ్ ను అలాగే రవిని నామినెట్ చేశాడు. ఇక 12వ వారంలో రవి తప్పితే మిగతా ఏడుగురు నామినేషన్ లో నిలిచారు.


Click it and Unblock the Notifications











