Bigg Boss Telugu 5.. నాగార్జున ముందే సిరి, షణ్ముఖ్ కౌగిలింతలు.. ఏంటో అంటూ తలబాదుకొన్న మన్మథుడు

బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ తొమ్మిదో వారం ముగిసేందుకు సిద్దమైంది. గత వారం రోజులుగా ఇంటిలో నామినేషన్స్, కెప్టెన్సీ పోటీదారులు టాస్క్, కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్కులతో విసిగిపోయిన కంటెస్టెంట్లకు వారాంతంలో ఊరట కల్పించేందుకు హోస్ట్ నాగార్జున వేదిక మీదకు వస్తుంటాడు. తాజా వారాంతంలో హోస్ట్ నాగార్జున సెలబ్రిటీలకు వినోదాన్ని అందించేందుకు రకరకాల గేమ్స్, ఈవెంట్స్‌తో ముందుకొచ్చారు. తాజాగా విడుదలైన శనివారం ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఏం జరిగిందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

పే బ్యాక్ అంటూ కామెంట్

పే బ్యాక్ అంటూ కామెంట్

గతవారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారులు, కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన సూపర్ హీరోలు, సూపర్ విలన్స్ టాస్క్‌లో రకరకాల పరీక్షలతో ఒక వర్గం మరో వర్గాన్ని హింస పెట్టడమే కాకుండా నరకంగా చూపించారు. తాజాగా వేదికపైకి వచ్చిన హోస్ట్ నాగార్జున పే బ్యాక్ టైమ్ అంటూ ప్రతీకారం తీర్చుకొనేందుకు కొందరికి ఛాన్స్ ఇచ్చారు.

యాంకర్ రవి ప్రతీకారం.

యాంకర్ రవి ప్రతీకారం.

తొలుత యాంకర్ రవిని పిలిచి.. నాగ్ అదోరకంగా చూడటంతో ఆయన కంగారుపడ్డారు. రవి పడే అవస్థను చూడలేక చప్పట్లు కొడుతూ.. నీకు అలా నరకం చూపించారు. అదే నరకం అంటూ బాధపడ్డారు. ఈ నరకానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం అంటూ రవికి ఛాన్స్ ఇచ్చారు. దాంతో రవి రచ్చిపోయాడు.

షన్ము తాగలేక.. మింగలేక..

షన్ము తాగలేక.. మింగలేక..

పే బ్యాక్ టైమ్ అంటూ నాగార్జున అవకాశం ఇవ్వడంతో ఓ మై ఫ్రెండ్ అంటూ షణ్ముఖ్‌ను పిలిచాడు. సార్ మీరు ఛాన్స్ ఇవ్వడంతో భీకరంగా గుద్దేస్తున్నాడు. ప్రజలారా ఈ చిత్రహింసలు అని షన్ను అంటే.. ఇది మొన్న చూసిన దానికి రివేంజ్ అంటూ యాంకర్ రవి సమాధానం ఇచ్చాడు. షణ్ముఖ్ జస్వంత్‌కు యాంకర్ రవి కోడిగుడ్లు కొట్టి.. ఇతర ఏవో వస్తువులు కలిపి గ్లాసులో ఓ జ్యూస్‌ను ఇచ్చాడు. ఆ కషాయాన్ని తాగలేక కక్కలేక నరకాన్ని అనుభవించాడు.

షన్ముపై సింగర్ శ్రీరామచంద్ర రివేంజ్

షన్ముపై సింగర్ శ్రీరామచంద్ర రివేంజ్


యాంకర్ రవి తర్వాత శ్రీరామచంద్రకు ప్రతీకారం తీర్చుకొనేందుకు అవకాశం ఇచ్చారు. దాంతో ఆయన ఒకరకమైన నవ్వు నవ్వుతూ రంగంలోకి దిగాడు. వీజే సన్నీకి ఉల్లిపాయ, ఇతర వస్తువులతో కలిపి ఒక జ్యూస్ ఇచ్చాడు. ఓ దశలో శ్రీరామ్ టార్చర్ భరించలేక ఏదో జన్మలో నీవు నాకు మొగుడివై ఉంటావని కామెంట్ చేశాడు. అలా సరదాగా పే బ్యాక్ టాస్క్ ముగిసింది.

మానస్ హీరో అంటూ ప్రియాంక సింగ్

మానస్ హీరో అంటూ ప్రియాంక సింగ్

ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో విలన్ ఎవరు? హీరో ఎవరు అనే టాస్క్ ఆడించారు. నా దృష్టిలో హీరో మానస్ అంటే.. మానస్ తప్ప ఎవరైనా హీరోగా ఎంచుకో.. నిన్ను ఎంత ఏడిపించినా మానస్ హీరోనా అంటూ నాగ్ కామెంట్ చేస్తే.. ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంటే ఎవరైనా ఏడిపిస్తారు అని ప్రియాంక చెప్పింది. దాంతో సిరి, షణ్ముఖ్ మాదిరిగానా అంటే..అవును అని ప్రియాంక చెప్పింది. అయితే మానస్‌తో ప్రియాంక బాండింగ్ వేరు.. షన్నుతో నా బాండింగ్ వేరు అంటూ సిరి హన్మంతు చెప్పింది.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
సిరి, షన్ను కౌగిలింతల జోష్‌తో

సిరి, షన్ను కౌగిలింతల జోష్‌తో

ఇక షణ్ముఖ్ జస్వంత్‌కు సిరి హన్మంతు హీరో అంటూ ముద్ర వేసింది. అయితే విలన్ ముద్ర కూడా వేస్తుంది అంటూ షణ్ముఖ్ అనడం కనిపించింది. దాంతో షణ్ముఖ్‌ను సిరి కౌగిలించుకోవడంతో ఈ ఎమోషన్స్ ఏమిటో అర్ధం కావడం లేదు అంటూ నాగ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కౌగిలించుకొని డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X