VJ Sunny కి షాక్.. కెప్టెన్సీ పదవిని ఊడటొట్టిన నాగార్జున.. బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్టు

బిగ్‌బాస్ రియాలిటీ షోలో వారం రోజులపాటు సాగిన గందరగోళానికి వారాంతం కొంత రిలీఫ్ ఇస్తుంది. హోస్ట్ నాగార్జున రాకతో ఇంటి వాతావరణం ఫీల్‌గుడ్‌గా మారిపోతుంది. ఏడో వారాంతంలో నాగార్జున సరదాగా మాట్లాడుతూనే ఇంటి సభ్యులపై సెటైర్లు సంధించారు. యాంకర్ రవి, ప్రియ, వీజే సన్నీలతో ఫన్నీగా ఆటాడుకొన్నారు. అలా అల్లరిగా సాగిన ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్‌ వీజే సన్నీకి నాగార్జున షాకిచ్చారు. ఆ షాక్‌కు కారణం ఏమిటనే విషయంలోకి వెళితే...

కెప్టెన్సీ టాస్క్ గురించి

కెప్టెన్సీ టాస్క్ గురించి


గత వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌‌లో జరిగిన ఒక్కొ సంఘటనను తీసుకొని వారాంతపు ఎపిసోడ్‌ను నాగార్జున ప్రారంభిచారు. సిరి హన్మంతు బుట్టలోని గుడ్లను దొంగలించిన విషయాన్ని నాగార్జున బయటపెట్టారు. అయితే నేను దొంగతనం చేయలేదని అబద్ధం ఆడటంతో నాగార్జున స్టేజ్ మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. ఈ విషయంలో ఏదో ఘాటైన కంటెంట్ క్రియేట్ అయిందనే అంశాన్ని హింట్‌గా ఇచ్చారు.

ప్రియ, వీజే సన్నీ మధ్య గొడవపై

ప్రియ, వీజే సన్నీ మధ్య గొడవపై

ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ప్రియ, వీజే సన్నీ మధ్య జరిగిన గొడవను నాగార్జున ప్రస్తావించారు. చెంప పగలకొడుతా.. చెంప పగలకొడుతా .. చెంప పగలకొడుతా అంటూ అలా రెచ్చిపోయావేంటి? అంటూ నాగార్జున అడిగితే.. చాలా దురుసుగా వచ్చి నన్ను తోసేసాడు. అందుకే మరోసారి అలా తోస్తే నేను చెంప పగలకొడుతానని అన్నాను అని ప్రియ అంటే.. సరే మరి చేతితో కొట్టడానికి పూలతొట్టిని ఎందుకు లేపావు అని నాగార్జున అడిగారు.

వీజే సన్నీపై సెటైర్

వీజే సన్నీపై సెటైర్

అయితే ప్రియ, నాగార్జున మాట్లాడుతుంటే వీజే సన్నీ మధ్యలో దూరి.. నేను ఆ విషయం చూడలేదు అంటే.. చూసినా ఏం చేస్తావు.. మహా అంటే జెస్సీపైకి ఉరుకుతావు అని అంటూ నాగార్జున సెటైర్ వేశాడు. దాంతో నా ప్రాబ్లెం ఏమిటంటే.. నేను అని ఏదో చెప్పబోతుండగా.. నీవు చేస్తే మజాక్.. నేను చేస్తే రజాకా? అని వీజే సన్నీ వాటిన డైలాగ్‌ను నాగ్ సెటైర్‌గా వదిలాడు. దాంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

వ్యక్తిగతంగా ఆడాల్సిన గేమ్‌ను

వ్యక్తిగతంగా ఆడాల్సిన గేమ్‌ను

ఇదిలా ఉండగా, వీజే సన్నీపై అనీ మాస్టర్ కంప్లంయింట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఆడాల్సిన టాస్క్‌ను గ్రూప్‌గా ఆడారు. ఆ టాస్క్ ప్రయోజనాలను దెబ్బ తీశారు అంటూ అనీ మాస్టర్ అని చెప్పింది. దాంతో వ్యక్తిగత గేమ్‌ను గ్రూప్‌గా ఆడినందుకు నీ కెప్టెన్సీ పదవిని క్యాన్సిల్ అంటూ నాగార్జున ప్రోమోలో షాకిచ్చారు. అయితే ఈ విషయంలో ఏం జరిగిందనేది రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో స్పష్టత వస్తుంది.

ఏడోవారం ఎలిమినేషన్ ఎవరో?

ఇక ఏడోవారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిరి హన్మంతు, జస్మంత్ పడాల, లోబో, ఆర్జే కాజల్, ప్రియ, యాంకర్ రవి, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X