Bigg Boss Telugu 5: ప్రారంభానికి ముందే షాక్.. వేదికపై కంటెస్టెంట్ ఫోటోలు లీక్.. ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్‌లోకి!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5 ప్రారంభానికి కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 100 రోజులకుపైగా కొనసాగే ఈ షోకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా మొదటి రోజు కంటెస్టెంట్లకు సంబంధించిన ఎంట్రీ ఫోటోలు మీడియాలోకి లీక్ అయ్యాయి. అయితే గతంలో కూడా షోకు సంబంధించిన వివరాలు ముందే లీక్ కావడం తెలిసిందే. తాజా లీక్ అయిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ల జాబితా

బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ల జాబితా

యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాక్టర్ ప్రియ, వర్థమాన నటి లహరి షారి, జబర్తస్త్ ప్రియాంక, సిరి హన్మంతు, సింగర్ రామచంద్ర, హీరోయిన ఇషా చావ్లా, సెవెన్ ఆర్ట్స్ సరయు, దీపక్ సరోజ్, వర్థమాన నటి శ్వేతా వర్మ, షణ్ముఖ్ జస్వంత్, నటరాజ్ మాస్టర్, టెలివిజన్ యాక్టర్ సన్నీ, టెలివిజన్ నటుడు మానస్ షా, టెలివిజన్ నటి ఉమాదేవి (కార్తీకదీపం ఫేమ్), మోడల్ జస్వంత్, ఆర్జే కాజల్, యూట్యూబర్ లోబో, లహరి షారి లాంటి సెలబ్రిటీలు షోలోకి రానున్నారు. అయితే ఇందులో కొందరిని స్టాండ్‌బైగా పెట్టుకోవడంతో ఫైనల్‌గా ఎవరు వస్తారనే విషయం సాయంత్రం తేలిపోతుంది.

జస్వంత్ షణ్ముఖ్ ఫోటో లీక్

జస్వంత్ షణ్ముఖ్ ఫోటో లీక్

అయితే బిగ్‌బాస్ తెలుగు వేదికపైకి వచ్చే కంటెస్టెంట్లకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. అయితే షణ్ముఖ్ జస్వంత్‌ ఈ షోలోకి వచ్చిన కన్ఫర్మ్‌డ్ సెలబ్రిటీల్లో ఒకరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. అయితే వేదికపైన జస్వంత్ షణ్ముఖ్ ఉన్న ఫోటో ఒకటి లీక్‌ అయింది. సోషల్ మీడియాలో జస్మంత్ షణ్ముఖ్‌ ఫోటో వైరల్ అవుతున్నది. వేదిక మీద నాగార్జునతో జస్వంత్ మాట్లాడే ఫోటో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

సీక్రెట్ రూమ్‌లోకి ఇద్దరు సెలబ్రిటీలు

సీక్రెట్ రూమ్‌లోకి ఇద్దరు సెలబ్రిటీలు

ఇక గత సీజన్‌లో షో ఆరంభంలోనే ఇద్దరు కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. సయ్యద్ సోహైల్ ర్యాన్, అరియానా గ్లోరిని సీక్రెట్ రూంలోకి పంపడం ద్వారా గేమ్‌ను ట్విస్ట్ చేశారు. అయితే ఈ సారి కూడా ఇద్దరు సెలబ్రిటీలను సీక్రెట్ రూమ్‌లోకి పంపే అవకాశం ఉందనే విషయం బయటకు వచ్చింది.

సీక్రెట్ రూమ్‌లో జస్వంత్ షణ్ముఖ్

సీక్రెట్ రూమ్‌లో జస్వంత్ షణ్ముఖ్

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో సీక్రెట్ రూమ్‌కు పంపే వారిలో జస్వంత్ షణ్ముఖ్ ఉన్నారనే విషయం లీక్ అయింది. జస్వంత్‌తోపాటు మరో యువ మహిళా కంటెస్టెంట్‌ను పంపినట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియాలో జస్వంత్‌కు, మరో సెలబ్రిటీకి మంచి ఫాలోయింగ్ ఉండటం కారణంగా వారిని సీక్రెట్ రూమ్‌లోకి పంపినట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

కరోనా భయంతో ఆడియెన్స్‌కు నో ఎంట్రీ

కరోనా భయంతో ఆడియెన్స్‌కు నో ఎంట్రీ

ఇదిలా ఉండగా, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వారాంతంలో ఆడియెన్స్‌ను అనుమతించకూడదని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నారు. కోవిడ్ 19 ప్రోటోకాల్స్ అనుసరించి గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనావైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందనే రూమర్ల మధ్య ఆడియెన్స్‌ శని, ఆదివారాల్లో ఆడియెన్స్‌ను పంపకూడదని గట్టిగా నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X