Bigg Boss 5: అతను మంచి మూడ్ లో ఉంటే పక్కనే ఉంటా.. బయటకు వచ్చాక నేర్పిస్తా అన్నాడు: ప్రియ

బిగ్ బాస్ షో మొదట కాస్త నీరసంగానే స్టార్ట్ అయ్యింది. అయితే కంటెస్టెంట్స్ పై ఓ వర్గం ప్రేక్షకుల అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ ఉండగా రోజులు గడుస్తున్న కొద్దీ కొందరు ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. కొందరు అనుకోకుండా చేస్తున్నా పనుల వల్ల అనవసరంగా ఎలిమినేట్ కావాల్సి వస్తోంది. అయితే మొదటి నుంచి చూసుకుంటే నోటిదురుసు కారణంగా హౌస్ లో నుంచి బయటకు వెళ్లి పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాయిస్ గట్టిగా చేసినంతమాత్రాన ఎలిమినేట్ అవుతారు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో చాలామంది అలానే మొండిగా చివరి వరకు వచ్చారు.

అయితే ఈసారి మాత్రం కొట్లాటలో ఎవరు కూడా సరైన పాయింట్ తో ముందుకు వెళ్లడం లేదు అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ప్రియ కూడా ఆ కారణంగానే వెళ్లిపోయినట్లు చాలా క్లియర్ గా అర్థం అవుతోంది. ఆమె వెళ్ళిపోయే క్రమంలో అందరి గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడింది.

ప్రియ సన్నీ గొడవలు

ప్రియ సన్నీ గొడవలు

ప్రియ, సన్నీ ఇద్దరు కూడా మొదట్లో చాలా సింపుల్ గానే ఉండేవారు. అయితే టాస్క్ ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇద్దరికీ గొడవలు గట్టిగానే అవుతూ వచ్చాయి. చాలా కూల్ గానే కనిపించే సన్నీ ప్రియ విషయంలో కి వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా ఫైర్ అయిపోతూ కనిపించాడు. అయితే అతన్ని రెచ్చగొట్టాలని ఆమె ఎంత ప్రయత్నం చేసినా కూడా చాలా ఓర్పుతో గేమ్ ఆడుతూ వచ్చాడు అదే అతనికి చాలా బాగా ప్లస్ అయింది అని చెప్పవచ్చు.

చాలా కోపంతో..

చాలా కోపంతో..

సన్నీ విషయంలో ప్రియా కొన్ని తప్పటడుగులు వేసినట్లు చాలా క్లారిటీ గా అర్థమైంది. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా ప్రియా నోటి దురుసు కారణంగా అనవసరంగా సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ అందుకుంది. కావాలని సన్నీ గుడ్లను ఎత్తుకొని పోవాలని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇక తన గుడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సన్నీ చాలా కోపంగా ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ సన్నీ ని బ్యాడ్ చేయాలని ప్రియా ప్రయత్నం చేసింది. అతన్ని రెచ్చగొడుతూనే ఫిజికల్ గా నెట్టి వేస్తున్నాడు అని ఆరోపణలు చేసింది.

అప్పటికే డ్యామేజ్ అయ్యింది

అప్పటికే డ్యామేజ్ అయ్యింది

కావాలని రెచ్చగొట్టడమే కాకుండా సన్నీ ని చంప పగలగొడతాను అంటూ ప్రియ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే అంత గొడవ జరిగినా కూడా మళ్లీ మరుసటి రోజు నుంచి ఇద్దరు కూడా రొమాంటిక్ యాంగిల్ లోకి రావడం మరొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సన్నీ ప్రియ ఇద్దరు కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటు కనిపించడం ఆశ్చర్యకరం. అయితే అప్పటికే ప్రియాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది దీంతో ఆమెకు జనాల నుంచి మద్దతు లభించలేదు.

అతను మంచి మూడ్ లో ఉంటే..

అతను మంచి మూడ్ లో ఉంటే..

ఇక వెళ్ళిపోయే క్రమంలో అందరి గురించి ఎంతో ఆనందంగా మాట్లాడిన ప్రియ ముఖ్యంగా శ్రీరామచంద్ర గురించి చేసిన కామెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పది మార్కులు వేసిన ప్రియ.. శ్రీరామచంద్ర తో అంత ఎక్కువగా కనెక్ట్ కాలేదు కానీ ఒక మంచి పరిచయం అయితే ఉందని చెప్పింది. మిగతా వారితో పోలిస్తే శ్రీరామచంద్ర తో కొంచెం క్లోజ్ గానే ఉన్నాను అంటూ అతడి కంపెనీ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది.

ఇక అతని చుట్టుపక్కల ఉండడానికి ఇష్ట పడతాను అంటూ .. ఎందుకంటే ఎప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు.. ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా బాగా పాటలు పాడతాడు. శ్రీ రామచంద్ర ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాడు. అతను మంచి మూడ్లో ఉంటే గనక నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.. అని ప్రియ వివరణ ఇచ్చింది.

Recommended Video

#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
ప్రియ కోసం లవ్ సాంగ్

ప్రియ కోసం లవ్ సాంగ్

నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ ప్రియ చెప్పడంతో మిస్ యూ అంటూ శ్రీ రామచంద్ర కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. అయితే ఒప్పందం ప్రకారం బయటకు వచ్చిన తర్వాత కూడా పాట నేర్పిస్తారు కదా అని అడగడంతో అందుకు శ్రీరామచంద్ర సరే అని చెప్పాడు. బయటకు వెళ్ళిన తర్వాత పాట మీరు నేర్పిద్దురు గాని ఇప్పుడు ఆమె కోసం ఒక పాట పాడు అని నాగార్జున చెప్పడంతో శ్రీ రామచంద్ర.. నీ చూపులే ఉంటూ లవ్ సాంగ్ ను ప్రియ కోసం ప్రత్యేకంగా పాడాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X