Bigg Boss 5: నాగార్జున ముందే ప్రియ ముద్దులాట.. మరో వీడియో బయటపెట్టి బిగ్ సర్‌ప్రైజ్
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే అనిపిస్తోంది. గత రెండు వారాల క్రితం చాలా నీరసంగా ఆటను కొనసాగిస్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అంతేకాకుండా బిగ్ బాస్ షో రేటింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది అని కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక నాగార్జున మధ్యమధ్యలో మంచి ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్నారు. ఆ తరువాత మాత్రం టాస్క్ ల విషయంలో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కావడం లేదని అర్థమవుతోంది. ఇక ఈ వారం మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు కొంత వరకు డిఫరెంట్ గా అనిపించాయి. ఇక శనివారం రోజు నాగార్జున మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ ఎవరనే విషయంలో కూడా ఆయన అందరిని ప్రశ్నించబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయగా షోపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.

ప్రియ vs సన్నీ
ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ విషయంలో బంగారు కోడిపెట్ట గేమ్ చాలా ఆసక్తిగా కొనసాగింది. అంతేకాకుండా ప్రియా సన్నీ గొడవలు చివరికి రొమాంటిక్ యాంగిల్ లోకి మారడం ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు. బంగారు కోడిపెట్ట టాస్క్ లో ప్రియా సన్నీ ఇద్దరు కూడా వారి గుడ్లను కాపాడుకోవడానికి చాలా విభిన్నంగా ప్రవర్తించారు. ఇక ప్రియ సన్నీని పై స్పెషల్ గా టార్గెట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అంతే కాకుండా ఆమె హెచ్చరికలు జారీ చేయడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

కాజల్ పై సిరి టార్గెట్
ఈ రోజు ప్రసారం కాబోయే షోలో నాగార్జున అందరికీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక వరస్ట్ పెర్ఫామర్ ఎవరు అనే విషయం లో కూడా ఒక క్లారిటీ రాబోతోంది. ఇక ముందుగా సిరి అనుకున్నట్లుగానే కాజల్ పై మరోసారి టార్గెట్ పెట్టింది. ఆమె వరస్ట్ పెర్ఫామర్ అనుకుంటున్నట్లు ఓపెన్ గా చెప్పేసింది. ఇక మానస్ రామచంద్ర ఇద్దరు కూడా మరొకసారి గొడవ పెట్టుకున్నారు అన్నట్లు అర్థమవుతోంది. నా పరంగా మానస్ వరస్ట్ పెర్ఫామర్ అంటూ శ్రీరామచంద్ర వివరణ ఇచ్చాడు.

కోల్డ్ వార్
మానస్ స్ట్రాంగ్ అని చెప్పగానే నాగార్జున కూడా కౌంటర్ గా నీ గురించి కూడా మేము అలాగే అనుకుంటున్నాము అని సమాధానమిచ్చాడు. ఇక నేను వ్యక్తిగత ప్లేయర్ కాదు అని ఎవరైనా అంటే నేను ఆ విషయంలో ఏకీభవించను అంటూ మనస్ మరో కౌంటర్ ఇచ్చాడు. చూస్తుంటే శ్రీరామచంద్ర మానస్ ఇద్దరి మధ్యలో కూడా నాగార్జున ముందే కోల్డ్ వారు జరిగినట్లు తెలుస్తోంది.

వీడియో చూపించడానికి సిద్దమైన నాగార్జున
ప్రియ మరొకసారి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిజికల్ గా వచ్చేసరికి కొంచెం వైల్డ్ గా ఆడుతున్నట్లు అనిపిస్తోంది అని ఆమె చెప్పడంతో విశ్వా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా నా చెయ్యి అలా వెళ్ళి పోయింది అంటూ ఎంతమాత్రం తెలియలేదు అని చెప్పాడు. ప్రియాంక కూడా పుష్ చేయడం నా బాడీకి క్లియర్ గా తెలిసింది అని సమాధానం ఇచ్చింది. ఇక అందరి క్లారిటీ కోసం తాను వీడియో చూపిస్తానంటూ నాగార్జున వివరణ ఇచ్చారు.

నేను ఎదవని అయ్యానంటూ..
ఇక సడన్ సప్రైజ్ గా నాగార్జున షణ్ముఖ్ జస్వంత్ డైలాగ్ ను వీడియో రూపంలో చూపించారు. నువ్వు వాడి హెల్ప్ చేశావు నేను ఎదవని అయ్యానంటూ సిరితో చెప్పుకున్న విషయాన్ని నాగార్జున టీవీ లో చూపించారు. దాంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. అంతేకాకుండా అరేయ్ ఏంట్రా ఇది అంటూ నాగార్జున షణ్ముఖ్ జస్వంత్ ను సరదాగా ఆట పట్టించారు.
మరో ముద్దు ఇచ్చిన ప్రియ
వరస్ట్ పెర్ఫామర్ ఎవరు రా అంటూ సన్నీని అడగడంతో అతను అందరూ ఊహించినట్లుగానే ప్రియ వైపు తిరిగి చూశాడు. ప్రియ ఎవరూ ఊహించని విధంగా మరోసారి సన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం విశేషం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొనసాగుతోందని నాగార్జునకు చాలా క్లారిటీ గా అర్థమైంది. ఈ లవ్ ట్రాక్ పై ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ నడిపిస్తారో అని సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. మొదట కయ్యానికి కాలు దువ్విన వారు హఠాత్తుగా ఇలా మారిపోవడం ఏమిటని మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











