ఏం చేస్తావ్.. వీడు పెద్ద మగాడా? చేయి వేస్తే పగలగొట్టేస్తా: మితిమీరుతున్న ప్రియ వెక్కిలి చేష్టలు!
బిగ్ బాస్ హౌస్ లో మొదట చాలా నెమ్మదిగా ఉన్నవారు కూడా ఇప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతొంది. ఆలోచించి అడుగులు వేయాలని ఎంతగానో ఆలోచించాలని చెప్పే వారు కూడా ఇప్పుడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. అయితే గత వారం నుంచి కూడా ఆర్టిస్ట్ ప్రియ ఆడుతున్న విధానం మాత్రం కంటెస్టెంట్స్ లో కొందరిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రియ పై దారుణమైన ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఆమె మాట్లాడుతున్న విధానం కూడా పలువురిని ఇబ్బందిపడుతున్నట్లు కంటెస్టెంట్స్ కూడా నాగార్జున కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా రోజు రోజుకు మరింత మితిమీరుతున్నాయి. ప్రియ అలా చేయడం కూడా కొందరికి అంతగా నచ్చడం లేదు.

ఉమెన్ కార్డు ప్రయోగిస్తున్నట్లు
బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా సరే వారి ఆట ఇష్టం ఉన్నట్లు ఆడుకోవచ్చు కానీ పక్క వారి నీ మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మరొకరు గెలవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో గొడవలు వస్తుంటాయి. బిగ్ బాస్ హౌస్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా ఉండాలి అని నాగార్జున ఇదివరకే కొన్ని కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం కావాలని ఉమెన్ కార్డు ప్రయోగిస్తున్నట్లు మరోసారి అర్థమవుతోంది.

ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు.
ప్రియ గత వారం నుంచి కూడా ప్రతి టాస్క్ లో సన్నీతో విభేదిస్తూ కొట్లాటకు సిద్ధమవుతోంది. ఏ మాత్రం కంట్రోల్ లో లేకుండా ఆమె మాట్లాడుతున్న మాటలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఎంత రెచ్చగొట్టినా కూడా సన్నీ మాత్రం చాలా నిదానంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఇదివరకే కొన్ని సార్లు హెచ్చరికలు చేశాడు. అయినప్పటికి ఏమాత్రం తగ్గడం లేదు. నువ్వు నేనా అనే విధంగా పోటీ పడుతోంది. అయితే ఆ పోటీలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు.

ప్రియ దొంగ ఏడుపులు
బుధవారం జరిగిన ఎపిసోడ్ లో బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా సన్నీ బజార్ మోగినప్పుడు గుడ్లను తెచ్చుకునేందుకు వెళ్లగా అప్పుడు ప్రియా మాత్రం అక్కడ ఆడకుండా సన్నీ బుట్టలో నుంచి గుడ్లను తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఒక విధంగా ప్రియ తెలివిగా ఆడినప్పటికీ సన్నికి తన గుడ్లను కాపాడుకునే అధికారం ఉంటుంది. అతను తన బుట్టను కాపాడుకునేందుకు హఠాత్తుగా వచ్చేశాడు. అయితే ఆ క్రమంలో ప్రియా పడినట్లు చేసింది. దీంతో ఫిజికల్ తనను తోసేశాడు అని ఆమె కొంత సేపు కంటతడి పెట్టుకుంది. ఆమెవి దొంగ ఏడుపులు అని అందరికి అర్ధమయ్యింది.

ప్రియ వెక్కిలి చేష్టలు
ఇక ప్రియా కన్నీళ్లు పెట్టుకున్న కొద్దిసేపటికే మళ్లీ ఎప్పటిలానే వెక్కిలి చేష్టలు చేస్తూ కనిపించింది. పక్కనే ఉన్న కాజల్ సన్నీకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడింది. ఇక ఆమె నవ్వుతూ ఉంటే ఇష్టం వచ్చినట్లుగా కాజల్ ని వెక్కిరిస్తూ నవ్వసాగింది. తర్వాత తన ఇష్టం వచ్చినట్లు ఆడుతాను అంటూ ఇక్కడ ఎవరూ కూడా తనను అడ్డుకునే హక్కు లేదు అని గాంభీర్యంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆమె ఎంత రెచ్చగొడుతున్న కూడా సన్నీ తన కంట్రోల్ లో ఉండేందుకు ప్రయత్నం చేశాడు.
Recommended Video

వీడు పెద్ద మగాడా?
మాటిమాటికి ప్రియ సన్నీ బట్ట దగ్గరకు వచ్చి గుడ్లను లాగేసుకునెందుకు ప్రయత్నం చేసింది. అయితే సన్నీ కూడా కాస్త అసహనానికి గురి అయ్యాడు. ఫిజికల్ గా చేయివేస్తే చెంప పగిలిపోతుంది అంటూ ప్రియ కొంత ఆగ్రహం వ్యక్తం చేయగా సన్నీ కూడా ముందు ముందుకు వచ్చే కొట్టు చూద్దామంటూ పోటీ పడ్డాడు. ప్రియా తన మాటల డోసును మరింత పెంచుతూ
ఏం చేస్తావ్.. వీడు పెద్ద మగాడా? చేయి వేస్తే చెంప పగలగొట్టేస్తా.. అంటూ అందరి ముందు గట్టిగా అరిచేసింది. అయినప్పటికీ సన్నీ కంట్రోల్లో ఉండేందుకు ప్రయత్నం చేశాడు మరి వీరి గొడవ ఈ వారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











