Bigg Boss 5: చివరకి చిన్న చెడ్డిలో విశ్వ.. అది కూడా తీసేయ్ అంటూ ప్రియ షాకింగ్ కామెంట్
బిగ్ బాస్ హౌస్ లో మరొకసారి కంటెస్టెంట్స్ మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. గతంలో ఎంతో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇప్పుడు గొడవలులకు దిగడం మొదలయ్యింది. గ్యాంగ్స్ మధ్యలో కూడా విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. గత వారం నుంచి కూడా సన్నీ ప్రియా మధ్య గొడవల తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. బిగ్ బాస్ పెడుతున్న టాస్క్ లు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ వారం బంగారు కోడి పెట్ట కెప్టెన్సీ టాస్క్ అయితే మెయిన్ హైలెట్ గా నిలుస్తోంది. ఇక ప్రియ అయితే ఇందులో హైలెట్ అయ్యే విధంగా ఒకవైపు సన్నీతో గొడవ పడుతూనే మరొకవైపు ఇతరుల నుంచి గుడ్లను దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె చేస్తున్న కామెంట్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటున్నాయి.

కెప్టెన్సీ టాస్క్ లో ప్రియ దూకుడు
బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా ఎవరికి వారు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రియా అయితే ఎవరి విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఆమెకు నచ్చిన మాటలు మాట్లాడుతూ అడ్డు వచ్చిన వారిపై చేయి చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. తన మాటలతో ఎక్కువగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసే ప్రియా చివరికి వుమెన్ కార్డ్ కూడా వాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్థం అవుతోంది.

కావాలని రెచ్చగొడుతున్న ప్రియ
గత వారం నుంచి కూడా ప్రియా సన్నీతో ఏమాత్రం కూల్ గా ఉండటం లేదు. అతనిని బాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సన్నీ తన గేమ్ ఆడాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రియా చెంప పగిలిపోతుంది అని కూడా కోపాన్ని పెంచుతుంది. అయితే సన్నీ మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ముందుకు సాగుతున్నాడు. అతను ఏమాత్రం లిమిట్ దాటిన కూడా ప్రియా ఎమోషనల్ గా దెబ్బకొట్టాలని చూస్తుంది. సోషల్ మీడియాలో కూడా అనేక రకాల ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఆమె కావాలనే రెచ్చగొడుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్ vs విశ్వ
ఇక బుధవారం ఎపిసోడ్ లో ప్రియా ప్రవర్తించిన తీరు కూడా మరొకసారి హైలెట్ గా నిలిచింది. బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా మధ్యమధ్యలో బిగ్ బాస్ ట్విస్ట్ లు క్రియేట్ చేస్తున్నాడు. విశ్వ కు ప్రత్యర్థిని ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో అతను కాజల్ ని ఎంచుకున్నాడు. ఇద్దరు కూడా ఎవరైతే ఎక్కువ బట్టలు ధరిస్తారో వారికి ప్రత్యేకంగా 5 గుడ్లు లభిస్తాయి. దీంతో వారిద్దరు కూడా వారి బట్టల తో పాటు మిగతా వారి బట్టలు కూడా వేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నించారు.

కాజల్ కు సహాయం చేసిన సన్నీ
బట్టలు ఎవరివి అని ఏ మాత్రం చూడకుండా ఆఖరికి ఇన్నర్ వేర్స్ వేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎక్కువగా ఇన్నర్ వేర్స్ వేసుకుంటే ఈజీగా అవుతుందని సన్నీ కూడా బాత్రూమ్ లోకి వెళ్లి వేరే వాళ్ల బట్టలు కూడా తెచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇక మధ్యలో వచ్చిన అనీ మాస్టర్ అది నా ఇన్నర్ వేర్ లాగా ఉంది అంటూ విభిన్నంగా కామెంట్ చేసింది. ఆ గోలను చూసి ప్రియాంక కూడా ఛీ అంటూ నవ్వేసింది. కాజల్ కు సహాయం చేసేందుకు సన్నీ ఎంతగానో ప్రయత్నం చేశాడు.
Recommended Video

విశ్వ చెడ్డి.. విప్పేయ్ అంటూ..
చివరికి మాత్రం విశ్వా మరొకసారి తన ఎనర్జీ తో కాజల్ కంటే ఎక్కువ బట్టలు ధరించి బోనస్ గా మరికొన్ని గుడ్లను సంపాదించాడు. అయితే అతను బట్టలను లెక్కించే సమయంలో చివరికి ఒక చిన్న చెడ్డీ మాత్రమే మిగిలింది. ఇక అది కూడా విప్పేయ్ అంటూ ప్రియా మరొక కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా ప్రియ చేస్తున్న కామెంట్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటున్నాయి.
ఆగ్రహం గా ఉన్నప్పుడు ఒక తరహాలో ఉంటుందని నార్మల్ గా ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











