Bigg Boss 5: శ్రీరామ్ కు ప్రియాంక కిస్సులు.. ఇదే ఛాన్స్ అని ముద్దు పెట్టేస్తున్నవా?.. ఆనీ మాస్టర్ సెటైర్!

బిగ్ బాస్ షో లో మరోసారి ఎమోషన్స్ తో కూడిన నామినేషన్స్ ఆటను సరికొత్త మలుపు తిప్పాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంబంధించిన పర్సనల్ లెటర్స్ తో నామినేషన్స్ లో వాడుకోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వారి బంధాలకు సంబంధించిన లేఖలను వదులుకోవడానికి కొంతమంది ఎంతగానో కన్నీటి పర్యంతమయ్యారు.

ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే మొదటిసారి శ్రీరామచంద్ర చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక అతని పై ప్రియాంక ఒక్కసారిగా ముద్దుల వర్షం కురిపించగా ఆనీ మాస్టర్ ఊహించని విధంగా సెటైర్ వేసింది.

ఈసారి ఎవరు వెళ్లిపోతారో..

ఈసారి ఎవరు వెళ్లిపోతారో..

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం కూడా నామినేషన్ ప్రక్రియ అనేది సరి కొత్తగా కొనసాగుతోంది. గత రెండు వారాలు కూడా బిగ్ బాస్ షో సరికొత్త వివాదాలతో ముందుకు సాగుతోంది. ఇక మొత్తానికి ఏడవ వారం అయితే గోడవల కారణంగానే ప్రియ ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక వారిలో ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది.

త్యాగం చేసిన లోబో

త్యాగం చేసిన లోబో

సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ కు సంబంధించిన రెండు లేఖలను తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన ఇద్దరు ఎవరో ఒకరికి మాత్రమే ఆ లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. మరొకరి లేఖను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో కంటెస్టెంట్స్ త్యాగాలకు కూడా సిద్ధమవుతున్నారు. మొదటి నామినేషన్స్ లో లోబో ప్రియాంకలకు సంబంధించిన లెటర్ రాగా ప్రియాంక కోసం లోబో త్యాగం చేయక తప్పలేదు.

 ఎమోషనల్ అయిన సిరి, విశ్వ

ఎమోషనల్ అయిన సిరి, విశ్వ

ఇక రెండవ నామినేషన్స్ లో రవి, షణ్ముఖ్ ఇద్దరూ కూడా సీక్రెట్ రూమ్ కి వెళ్లి సిరి, విశ్వ లకు సంబంధించిన లేఖలు తీసుకొని వచ్చారు. ఇక మరో సారి విశ్వ తన కొడుకు భార్య కోసం ఎమోషనల్ అవ్వడంతో సిరి తన ఫ్యామిలీకి సంబంధించిన లేఖలు త్యాగం చేసింది. ఇద్దరు చాలాసేపు ఎమోషనల్ అయ్యారు. ఇక మూడవ నామినేషన్లో ప్రియాంక కాజల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లారు. మానస్, ఆనీ మాస్టర్ లకు సంబంధించిన లేఖలు రావడంతో ఇక చివరికి మనస్ ఆనీ మాస్టర్ కోసం త్యాగం చేశాడు.

మొదటిసారి ఏడ్చిన శ్రీరామ్

మొదటిసారి ఏడ్చిన శ్రీరామ్

నాలుగో నామినేషన్ లోబో విశ్వ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళగా రవి, శ్రీరామ్ కు సంబంధించిన లెటర్స్ వచ్చాయి. అయితే శ్రీరామ్ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు త్యాగం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఫైనల్ గా శ్రీరామ్ తన లేఖను అందుకున్నాడు. రవి లెటర్ చదువుతుంటే శ్రీరామ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. శ్రీరామ్ చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో ధైర్యంగానే ముందుకు సాగుతూ వస్తున్నాడు. అతను ఏడ్చిన సందర్భాలు అయితే పెద్దగా లేవు.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
ముద్దులు పెట్టేసిన ప్రియాంక

ముద్దులు పెట్టేసిన ప్రియాంక

శ్రీరామ్ ఆనీ మాస్టర్ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రియాంక వచ్చేసింది. శ్రీరామ్ కళ్ళద్దాలు తీసి అతనికి ముద్దులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది. అంతే కాకుండా ప్రేమగా కౌగిలించుకుంది కూడా. దీంతో పక్కనే ఉన్న ఆనీ మాస్టర్ సరదాగా నవ్వుతూ ఒక సెటైర్ వేసింది. దొరికిందే ఛాన్స్ అని ముద్దులు పెట్టేస్తున్నావా? అంటూ సరదాగా కామెంట్ చేయడంతో శ్రీరామ్ నవ్వేశాడు. ఏదేమైనా ప్రియాంక మాత్రం అటు మానస్ తో పాటు ఇటు శ్రీరామ్ తో కూడా ఒక డిఫరెంట్ రొమాంటిక్ ట్రాక్ ను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X