Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఆర్సీబీ బుడ్డోడికి ట్రెంట్ బౌల్ట్ స్పెషల్ గిఫ్ట్.. అడిగిన వెంటనే..! వీడియో
- Finance
Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
bigg boss 5: బిగ్ బాస్ ద్వారా ప్రియాంక ఎంత సంపాదించిందో తెలుసా.. షాకింగ్ రెమ్యునరేషన్!
బిగ్ బాస్ లో ఈసారైనా ఒక ట్రాన్స్ జెండర్ గెలుస్తుందేమో అని చాలామంది అనుకున్నారు. ఒకవేళ ప్రియాంక బిగ్ బాస్ ఫైనల్స్ వరకు కొనసాగి ఉంటే పరిస్థితులు ఆమెను గెలిపించే దిశగా అనుకూలించేవేమో అని అందరు అనుకుంటున్నారు. మొత్తానికి ఈ వారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. ఒక విధంగా ఆమె బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతున్నా బాధ కంటే కూడా మానస్ దూరమవుతున్నాను అనే బాధ చాలా ఎక్కువగా కనిపించినట్లు కామెంట్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక చాలాసార్లు వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొత్తానికి ఆమె 90 రోజులకు పైగా చాలా బలంగా పోరాడి మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రియాంక ఎంత సంపాదించింది అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత క్రేజ్ అందుకుని..
జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత పలు రకాల రియాల్టీ షోలలో కూడా దర్శనమిచ్చిన ప్రియాంక బిగ్ బాస్ ద్వారా తన స్థాయిని మరింత పెంచుకుంది. ఇక బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా ప్రియాంక డేంజర్ జోన్ లో ఉంటూనే చాలాసార్లు ఎలిమినేషన్ ను దాటి వచ్చింది. చాలాసార్లు ఆమె వెళ్లిపోతుందని కూడా కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. కానీ జనాల మద్దతును ప్రియాంక గట్టిగానే అందుకుని ఎంతో బలంగా పోరాడింది.

ఆ కారణంగా నామినేషన్
ప్రియాంక మొదట్లో కాస్త నిదానంగా ఓపికతో ఉంటూ ముందుకు సాగింది. అయితే ఆమె మొదట్లో ఎక్కువగా వంట గదికే పరిమితం కావడంతో చాలా మంది అదే కారణం చేత నామినేట్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రియాంక వంటగదిని వదిలేసి రంగంలోకి దూకింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియాంక చాలా గట్టిగానే పోరాడింది. ఆమెతో పోటీకి వచ్చిన వాళ్లు కొన్నిసార్లు ఊహించని విధంగా చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారు.

మానస్ తో ఎమోషనల్ బాండింగ్
కొన్నిసార్లు టాస్క్ ల మధ్యలో కూడా ప్రియాంక చాలా సీరియస్ అయ్యింది. ఇక మానస్ తో బంధాన్ని ఏ విధంగా కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి హౌస్ లో నుంచి వెళ్లిపోయే సమయంలో ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. మానస్ ను పట్టుకుని గట్టిగానే ఏడ్చేసింది. అంతే కాకుండా అతని నుదుటిపై ముద్దు కూడా పెడుతూ తనతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది అని వివరణ ఇచ్చింది.

బిగ్ బాస్ రెమ్యునరేషన్
మొత్తానికి 92 రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన ప్రియాంక ఏ స్థాయిలోపారితోషికం అందుకుందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ పింకి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపుతో పాటు మంచి ఆదాయాన్ని కూడా వెనకేసుకున్నట్లు అర్థమవుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి కంటెస్టెంట్స్ అందరికీ కూడా సమాన పద్ధతిలోనే న్యాయం చేశారు అని టాక్ వస్తోంది. వారి క్రేజ్ కు తగ్గట్టుగానే అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

ప్రియాంకకు ఎంత ఇచ్చారంటే?
ఇక ప్రియాంక వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు అందుకున్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఇక ఆ లెక్కన చూస్తే పింకీ మొత్తం 13 వారాలకు గానూ దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా వెనకేసిందన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఆమె తన జీవితంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను ప్రియాంక కెరీర్ లో ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి.