Bigg Boss Telugu 5: ప్రియాంకకు దిమ్మ తిరిగే రెమ్యునరేషన్.. హౌస్ లో ఉండి ఎంత సంపాదించిందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. దీంతో ఎవరు విజేతగా నిలుస్తారన్న విషయం మీద ఉత్కంఠ నెలకొంది. అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh Unstoppable | VJ Sunny Rampage | Filmibeat Telugu
శనివారమే బయటికి

శనివారమే బయటికి

బిగ్ బాస్ సీజన్ 5 13 వ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వివరాలు ఎప్పటిలాగే శనివారమే బయటికి వచ్చేశాయి. నిజానికి ప్రతి ఆదివారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడుతున్న కంటెస్టెంట్ వివరాలు శనివారం రాత్రి నాగార్జున ఎపిసోడ్ వచ్చే ముందు అంటే.. శనివారం రాత్రి బిగ్ బాస్ లీక్స్ పేరుతొ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ప్రియాంక హౌస్ నుంచి

ప్రియాంక హౌస్ నుంచి

ఇక ఈ వారం శ్రీరామ చంద్ర, సిరి, కాజల్, మానస్, ప్రియాంక సింగ్ లు నామినేషన్స్ లో ఉన్నారు. అందులో మొదటి నుంచి ప్రియాంక సింగ్, కాజల్ లు ఓటింగ్ లో చివరిలో ఉంటూ వచ్చారు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా ప్రియాంక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం బయటకు వచ్చేసింది.

ఫినాలేకు ముందుగా

ఫినాలేకు ముందుగా

మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అయ్యి గేమ్ ఆడుతున్న ప్రియాంకకు ఈ వారం ఓట్లు తక్కువగా పడ్డాయని తెలుస్తుంది. ఇప్ప‌టికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ టాప్ 5లో చేరుకోవ‌డం కోసం త‌మ‌దైన రేంజ్‌లో హండ్రెడ్ ప‌ర్సెంట్‌ గేమ్ ఆడేస్తున్నారు. ఇప్ప‌టికే టికెట్ టు ఫినాలేకు ముందుగా శ్రీరామ‌చంద్ర చేరుకున్నాడు.

రాత్రి ఎపిసోడ్‌లో

రాత్రి ఎపిసోడ్‌లో

ఈ రాత్రి ఎపిసోడ్‌లో వీజే సన్నీ ఫైనల్‌కి టిక్కెట్‌ను గెలుచుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ, షో విజేత మరియు రన్నరప్ ఎవరో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రియాంక బిగ్ బాస్ తెలుగు 5 హౌస్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన మొదటి ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ ఆమె. ప్రియాంక తన అందం మరియు ఆట తీరుతో చాలా మంది బిగ్ బాస్ 5 తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ప్రేక్షకుల హృదయాలను

ప్రేక్షకుల హృదయాలను

ఊహించని విధంగా బిగ్ బాస్ తెలుగు హౌస్ వెలుపల కూడా భారీ పాపులారిటీ, అభిమానులను సంపాదించుకుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మొదటి రోజు నుండి, ప్రియాంక ప్రతి టాస్క్‌కి 100% ఇచ్చి మగ కంటెస్టెంట్స్‌పై విజయం సాధించింది. ఆమె ఎలిమినేషన్ ఖచ్చితంగా ఆమె అభిమానులు మరియు ప్రేక్షకుల హృదయాలను గాయపరుస్తుంది.

ఎంత సంపాదించిందో తెలుసా?

ఎంత సంపాదించిందో తెలుసా?


అయితే రవి కంటెస్టెంట్ నే బయటకు పంపిన ఈ బిగ్ బాస్ కు ప్రియాంక వ్యవహారం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఎలాగు ఆమె బయటకు వచ్చేస్తోంది కాబట్టి బిగ్ బాస్ తెలుగు 5 షోలో ప్రియాంక సింగ్ ఎంత సంపాదించిందనే దానిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక నివేదికల ప్రకారం, స్టార్ మా ప్రియాంకకు రోజుకు 25, 000 అంటే వారానికి 1.75 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ లెక్కలు నిజమైతే, సెప్టెంబర్ 5 నుండి డిసెంబర్ 4 వరకు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ప్రియాంక సంపాదించిన మొత్తం దాదాపు 22.5 లక్షల రూపాయలు అన్న మాట. ఇందులో నిజానిజాలు ఎంత అనేది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X