Bigg Boss 5: మొదటిసారి కన్నీళ్లు పెట్టించిన ప్రియాంక.. ఆడపిల్లగా మారిన విషయం తండ్రికి తెలియడంతో..

బిగ్ బాస్ షో తెలుగులో మొదలు కాబోతున్నట్లు వార్తలు వచ్చిన సమయంలోనే అసలు ఏమాత్రం వర్కౌట్ కాదని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ నిర్వాహకులు మాత్రం విమర్శకుల అంచనాలను తలకిందులు చేశారు. మొత్తానికి ఈ రియాల్టీ షో మొదటి సీజన్ తోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. అన్ని రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేస్తూ బిగ్ బాస్ బారి స్థాయిలో రేటింగ్స్ అందుకుంటోంది. అయితే అప్పుడప్పుడు కొన్ని గుండెలు బరువెక్కించే నిజ జీవిత కథలు కూడా బిగ్ బాస్ షో లో కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన ప్రియాంక కథ కూడా అదే తరహాలో ఉంది. అతడు ఆడపిల్ల గా మారిన విషయం తండ్రి కూడా తెలియదు. ఇక ఫైనల్ గా నేటి ఎపిసోడ్లో ప్రియాంక తండ్రి మాట్లాడుతున్న వీడియోను హైలెట్ చేశారు. ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొందరు కావాలని ఎమోషనల్ గా

కొందరు కావాలని ఎమోషనల్ గా


బిగ్ బాస్ షో 5వ వారంలోకి అడుగు పెట్టింది. సరికొత్త టాస్క్ లతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక మధ్యమధ్యలో కొందరు కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు కానీ అది నిజంగా కనిపించడం లేదు. కొందరు కావాలని సింపతీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఎమోషనల్ విషయాలను కూడా చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చారు.

ప్రియాంక ఎమోషనల్ స్టోరీ

ప్రియాంక ఎమోషనల్ స్టోరీ

అందరి కథ ఒక తరహాలో ఉంటే ప్రియాంక కథ మాత్రం మరొకలా ఉంది. సాయి తేజ అనే అబ్బాయి నుంచి ప్రియాంక అనే అమ్మాయిగా మారిన తన జీవితం అందరినీ ఆలోచింపజేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే తన జీవితం గురించి చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది. తను అమ్మాయి గా మారిన విషయం తన తండ్రికి కూడా తెలియదు అని తెలియజేసింది. అంతే కాకుండా తన తండ్రికి కళ్ళు కూడా కనిపించవని భావోద్వేగమైన విషయాలు కూడా స్టేజ్ పై పంచుకుంది.

తండ్రికి చెప్పకుండా

తండ్రికి చెప్పకుండా

చాలాసార్లు తన తండ్రి తన మొహాన్ని తాకినప్పుడు మీసాలు గడ్డాలు లేవని ప్రశ్నించాడు. ఆ సమయంలో చాలా బాధగా ఉండేదని ప్రియాంక నాగార్జున ముందే ఎమోషనల్ అవుతూ చెప్పింది. ఇక ఆ తరువాత బిగ్ బాస్ షో లో కూడా అందరి కంటే కాస్త విభిన్నంగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అవసరమైనప్పుడు మాత్రమే తన వాయిస్ ను పెంచుతూ వచ్చింది.

తండ్రి మాటలకు ప్రియాంక ఏడుపులు

తండ్రి మాటలకు ప్రియాంక ఏడుపులు

ఈ రోజు ప్రసారం కాబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో ప్రియాంక తండ్రి కి సంబంధించిన వీడియోను ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక తండ్రికి అసలు నిజం తెలిసినట్లు కుడా అర్థమవుతోంది. సాయి తేజ నువ్వు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సర్వం నువ్వే నాన్నా మాకు అని తండ్రి మాట్లాడగానే ప్రియాంక ఒక్కసారిగా టీవీ దగ్గరికి వెళ్లి కంటతడి పెట్టుకుంది. అబ్బాయి గా అయినంత మాత్రాన న ఆదరించడం మానేస్తమా అని ఎప్పుడు అనుకోవద్దు. మేము నీ తల్లిదండ్రులము అని చెబుతారు. దాంతో హౌస్ మెంట్స్ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ గా చప్పట్లు కొడతారు.

గట్టిగా ఏడ్చేసిన ప్రియాంక

ఇక ప్రియాంక తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా ఏదో ఒక దొంగ లాగా వెళ్లాల్సి వచ్చేది.. బయట కూడా రాను, అసలు నేను వచ్చినట్లు కనీసం పక్క ఇంటి వాళ్లకు కూడా తెలియదని ఏడుస్తూ చెప్పింది. తండ్రి యాక్సెప్ట్ చేసి అమ్మయిగానే ఇంటికి రమ్మని చెప్పడంతో ప్రియాంక ఎంతో ఎమోషన్ అవుతూ చెప్పింది. ఇక బిగ్ బాస్ ప్రియాంక కోసం ప్రత్యేకంగా ఆడపడుచుకు ఇవ్వాల్సిన చీర కుంకుమ పూలు గాజులు అన్ని ఇచ్చారు. ఆమెకు హౌస్ మెంట్స్ కూడా మద్దతుగా నిలిచారు. తనకంటే పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రియాంక మానస్ కాళ్ళు కూడా మొక్కింది. ఇక చివరగా మా నాన్నను గట్టిగా పట్టుకొని ఎడవాలని ఉందని ఐ లవ్యు ఐ లవ్యూ నాన్నా అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X