Bigg Boss 5: ఈసారి ప్రైజ్‌మనీ మాత్రమే కాదు, విన్నర్ కు మరో బంపరాఫర్.. తల్లినవుతానని ప్రియాంక ఛాలెంజ్!

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా హిందీలో ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ సౌత్ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇక మొత్తనికి తెలుగులో సక్సెస్ అవ్వడంతో చాలామంది చిన్న సెలబ్రెటీలు దీన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ లో గెలవకపోయినా పరవాలేదు వీలైనన్ని రోజులు ఉండగలిగితే ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవచ్చు. ఇక సీజన్ 5లో కూడా కంటెస్టెంట్స్ అందరికి బాగానే హెల్ప్ అయ్యింది. ఇక ఈసారి సీజన్ లో 50లక్షల ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కు మరొక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

 నిజంగానే షాకిచ్చే విషయం

నిజంగానే షాకిచ్చే విషయం

కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ సీజన్ లో చాలా బలంగా పోరాడారు. అసలు ఎవరు ఎలా సక్సెస్ ఆవుతారో అంచనా వేయడం చాలా కష్టం. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో అయితే ఊహించని మార్పులు జరిగాయాని చెప్పవచ్చు. ముఖ్యంగా యాంకర్ రవి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ టాప్ 5లో ఉండకుండానే రవి ఎలిమినేట్ అవ్వడం షాకిచ్చే విషయం.

బాగానే సంపాదించారు

బాగానే సంపాదించారు

ఇక బిగ్ బాస్ సీజన్ 5లో లోబోతో పాటు రవి కూడా ఫైనల్స్ వరకు ఉంటాడని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఈ ఇద్దరు మిగతా కంటెస్టెంట్స్ ముందు పెద్దగా పోటీని ఇవ్వలేకపోయారు. కానీ రెమ్యునేషన్ విషయంలో మాత్రం బిగ్ బాస్ వీరికి చాలా హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి. ఒక విదంగా వారి జీవితంలో ఎప్పుడు చూడనంతగా సంపాదించుకున్నారు.

ప్రైజ్ మనీ ఎంతంటే?

ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇక సీజన్ 5లో ఈసారి కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ కు మరొక బంపర్ ఆఫర్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లో కూడా గెలిచిన వారికి 50లక్షల ప్రైజ్ మనీ అందిస్తున్నారు. అంతే కాకుండా ఎదో ఒక ఖరీదైన గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. గత సీజన్ లో అభిజిత్ ఒక స్టైలిష్ బైక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మధ్యలో మరో ఆఫర్

మధ్యలో మరో ఆఫర్

ఇక ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇక దానికంటే ముందు 25 లక్షల ఆఫర్ కూడా ఉంటుంది. టాప్ 5 నుంచి ఫైనల్ వరకు వెళతారా? లేక ప్రైజ్ మనీలో సగం తీసుకొని ఇంటికి వెళతారా అనే ఆఫర్ కూడా ఉంటుంది. ఆ విషయంలో ఎవరు తెలివిగా ఆలోచిస్తారో చూడాలి. గత సీజన్ లో సోహెల్ 25లక్షల క్యాష్ తో జంప్ అయ్యాడు.

సొంత ఇంటి కోసం..

సొంత ఇంటి కోసం..

ఇక ఈసారి సీజన్ లో 50లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రత్యేకంగా సొంత ఇంటిని కట్టుకునేందుకు నిర్వాహకులు కంటెస్టెంట్స్ కు బంపరాఫర్ ఇవ్వబోతున్నట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు. షాద్‌నగర్‌లో సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం బిగ్ బాస్ విన్నర్ సొంతం చేసుకోనున్నట్లు తెలియజేశారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Mommy's Warning.. Shannu & Siri Self Goal || Filmibeat Telugu
ప్రైజ్ మనీ గెలిస్తే అమ్మనవుతా!

ప్రైజ్ మనీ గెలిస్తే అమ్మనవుతా!

ఇక బిగ్ బాస్ లో ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఏం చేస్తారో చెప్పాలని కంటెస్టెంట్స్ అందరిని కూడా నాగార్జున కోరాడు. ఇక ఒక్కొక్కరు వారికి ఉన్న సమస్యలను ఆశయాల గురించి చెప్పారు. అమ్మా అని పిలిపించుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. దత్తత తీసుకోవాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇక 50లక్షలు గెలిస్తే అందులో మా అమ్మ నాన్నకు ఇల్లు కొనిస్తాను అని ప్రియాంక తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X