Bigg Boss: యాంకర్ రవికి బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఆ ఫొటో చూపించమంటూ వేడుకున్న సన్నీ

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అవుతున్నాయి. అయితే, వాటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కుతోంది. అలాంటి వాటిలో నిజ సంఘటనల ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ షో ఒకటి. అసలేమాత్రం ఊహించని కంటెంట్‌తో ప్రసారం అయినా.. దీనికి తెలుగు వాళ్లు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్ ఫన్నీగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎపిసోడ్‌లో యాంకర్ రవికి నాగార్జున ఓ శిక్ష విధించాడు. ఆ వివరాలు మీకోసం!

వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా

వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా


గతంలో సీజన్లు అన్నీ సూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది.

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఫైర్

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఫైర్

బిగ్ బాస్ షో వారం మొత్తం జరిగే తీరు ఒకటి.. శని, ఆదివారాల్లో జరిగేది ఒకటి అన్నట్లుగా సాగుతుంది. దీనికి కారణం ఆ రెండు రోజులు హోస్ట్ అక్కినేని నాగార్జున వస్తుండడమే. ఇక, గత ఎపిసోడ్‌ అంతా ఎంతో సీరియస్‌గా సాగింది. పోయిన వారంలో కంటెస్టెంట్లలో కొందరు తప్పులు చేయడంతో నాగార్జున వాళ్లపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దీంతో షో మరింత రక్తి కట్టింది.

ఆదివారం ఫన్నీగా సాగేలా ప్లాన్ చేసి

ఆదివారం ఫన్నీగా సాగేలా ప్లాన్ చేసి

బిగ్ బాస్‌లో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ ఆటపాటలతో ఫన్నీగా సాగుతుంటాయి. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నప్పటికీ.. దానికి ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ పోగొట్టేందుకు నిర్వహకులు అదిరిపోయే ఆటపాటలను ప్లాన్ చేస్తారు. దాన్ని అక్కినేని నాగార్జున.. హౌస్‌లో ఉన్న వాళ్లతో ఆడిస్తుంటాడు. ఇలా సండే ఎపిసోడ్‌ మొత్తాన్ని ఫన్‌డేగా మార్చేసి మజా పంచుతారు.

వాళ్లందరితో ఆ ఆట ఆడించాడుగా

వాళ్లందరితో ఆ ఆట ఆడించాడుగా

ఈ ఆదివారం అంటే నేడు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎంతో ఫన్నీగా సాగుతుందని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇందులో హౌస్‌మేట్స్ అందరూ ఓ పాటకు డ్యాన్స్ చేస్తుంటారు. అది పూర్తవ్వగానే ఐస్, వాటర్ అనే రెండు బాక్సుల్లో నాగార్జున చెప్పిన దాంట్లోకి అందరూ చేరుకోవాలి. అలా చేరని వాళ్లు గేమ్ నుంచి ఔట్ అయిపోయినట్లు చూపించారు.

యాంకర్ రవికి ఊహించని శిక్ష వేసి

యాంకర్ రవికి ఊహించని శిక్ష వేసి

ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఆడించిన ఆట ఎంతో ఫన్నీగా సాగినట్లు కనిపిస్తోంది. ఇందులో యాంకర్ రవి ఓడిపోవడాన్ని ప్రోమోలో చూపించారు. ఇక, గేమ్‌లో అనర్హుడైన రవికి నాగార్జున ఏ శిక్ష విధించాలా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు శ్రీరామ్.. గోడకుర్చీ వేయించమని చెబుతాడు. అందుకు అనుగుణంగానే నాగ్ అదే శిక్షను విధించి షాకిస్తాడు.

కాజల్‌కు కూడా అలా... సన్నీ కోరిక

ఇదే గేమ్‌లో ఆర్జే కాజల్ కూడా ఓడిపోయినట్లు ప్రోమోలో చూపించారు. ఆమెకు ఏ శిక్ష విధించాలని నాగార్జున హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లను అడుగుతాడు. దీంతో అక్కడే ఉన్న రవి 'నాగిన్ డ్యాన్స్' వేయించమని చెబుతాడు. ఇక, ఫొటోలు గుర్తించే టాస్కును కూడా ఇందులో ఇచ్చారు. ఆ సమయంలో నాగార్జున చిన్నప్పటి ఫొటో చూపించమని సన్నీ కోరుకుంటాడు.

Recommended Video

SRC కి అండగా Sonu Sood..Shannu, Sunny కి కష్టమే | #BiggBossTelugu5 || Filmibeat Telugu
ఇవాళ ఎలిమినేషన్ లేదని పుకార్లు

ఇవాళ ఎలిమినేషన్ లేదని పుకార్లు

ఈ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో వీజే సన్నీ, యాంకర్ రవి, ఆర్జే కాజల్, మానస్, సిరి హన్మంత్ నామినేట్ అయ్యారు. వీళ్ల నుంచి సన్నీ సేఫ్ అయినట్లు శనివారం ప్రకటించారు. ఇక, మిగిలిన వాళ్లలో ఎవరూ ఎలిమినేట్ అవరని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదే సమయంలో అనారోగ్య కారణాలతో జెస్సీ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X