For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆ పని చేయలేక ఏడ్చేసిన హమీదా.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్‌గా జైలుకు వెళ్లింది ఎవరంటే!

  |

  తెలుగులో ప్రసారం అయ్యే వాటన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా నిలుస్తూ.. నెంబర్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి మన ప్రేక్షకులు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ప్రతి ఏడాది ఒకటి చొప్పన ఇప్పటికే నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, శుక్రవారం ఈ షోలో ఊహించని ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  వాటికి మించేలా ప్లాన్.. రికార్డు స్థాయిలో

  వాటికి మించేలా ప్లాన్.. రికార్డు స్థాయిలో

  భారీ అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. పాత సీజన్లను మరిపించేలా దీనిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపి సరికొత్త టాస్కుల పరిచయం చేస్తున్నారు. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో ఈ సీజన్‌కు ఆరంభంలోనే రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది.

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

  మూడో వారం సోసోగానే సాగిపోయింది

  మూడో వారం సోసోగానే సాగిపోయింది

  మొదటి వారం నామినేషన్స్ టాస్కు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి రచ్చ రచ్చగా సాగుతూ వచ్చింది. రెండో వారం కూడా అదే రీతిలో ప్రేక్షకులకు మజాను పంచిందీ షో. అయితే, మూడో వారంలో మాత్రం సోసోగానే సాగిందనే చెప్పాలి. ఒక్క నామినేషన్స్ టాస్క్ మినహా రెండు రోజులు బోరింగ్ టాస్కుతో షో అంతా చప్పగా సాగింది.

  లగ్జరీ బడ్జెట్ టాస్క్.. వరస్ట్ పెర్ఫార్మర్

  లగ్జరీ బడ్జెట్ టాస్క్.. వరస్ట్ పెర్ఫార్మర్

  ప్రతి శుక్రవారం లగ్జరీ బడ్జెట్ టాస్కు ఉంటుంది. దీని ఆధారంగానే వారం మొత్తం కంటెస్టెంట్లు తినాల్సిన ఐటమ్స్ వస్తుంటాయి. అలాగే, ఆ వారం మొత్తానికి ఉత్తమ, చెత్త కంటెస్టెంట్లను ఎంపిక చేస్తుంటారు. ఆ సమయంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో ప్రతి శుక్రవారం షో ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు.

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  నలుగురు సక్సెస్... ఏడ్చేసిన హమీదా

  నలుగురు సక్సెస్... ఏడ్చేసిన హమీదా

  తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ వారం లగ్జరీ ఐటమ్స్ కోసం బాల్స్ విసిరే టాస్క్ ఇచ్చినట్లు చూపించారు. ఇందులో సన్నీ, రవి, ప్రియ, శ్రీరామ చంద్రలు సక్సెస్‌ఫుల్‌గా ముగించారు. ఇక, చివర్లో హమీదా బాల్ వేసే సమయంలో బజర్ మోగింది. దీంతో ఆమె ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ఏడవడం కూడా కనిపించింది.

  నటరాజ్ మాస్టర్ ఫైర్.. వాళ్లపై గొడవ

  నటరాజ్ మాస్టర్ ఫైర్.. వాళ్లపై గొడవ

  తాజాగా విడుదలైన ప్రోమోలో నటరాజ్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్లు చూపించారు. మరీ ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ కోసం పెట్టిన టాస్కులో విశ్వ ఏదో తప్పు చేసినట్లు ఆయన మాట్లాడారు. ఆ సమయంలో సన్నీ నటరాజ్‌ను విమర్శించాడు. ఆ తర్వాత కూడా ఆయన ‘సెన్స్ లేకుండా ఆడతారు' అంటూ ఎవరి మీదో కోప్పడుతున్న దృశ్యాలను కూడా చూపించారు.

  Bigg Boss: అమ్మాయిగా మారింది అతడి వల్లే.. పెళ్లి చేసుకుంటానని చివరికి ఆ పని: ప్రియాంక సీక్రెట్ లీక్

  జెస్సీతో మానస్ గొడవ.. నామినేట్ చేసి

  ఇక, ఈ వారం మొత్తానికి ఒక ఉత్తమ, ఒక చెత్త ఆటగాళ్లను ఎంపిక చేయమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఆ సమయంలో మానస్ ‘ఈ వారం నాకు నేనే సరిగా ఆడలేదని ఫీల్ అవుతున్నా అందుకే నన్నే నామినేట్ చేసుకుంటున్నా' అని అన్నాడు. అప్పుడు కెప్టెన్ జెస్సీ అలా చేయకూడదని అంటాడు. దీంతో మానస్ జెస్సీనే నామినేట్ చేయడాన్ని చూపించారు.

  Mahesh Babu Is The Brand Ambassador For Big C
  ఈ వారం జైలుకెళ్లింది అతడే నంటూ

  ఈ వారం జైలుకెళ్లింది అతడే నంటూ

  బిగ్ బాస్ షోలో ఏది జరిగినా ముందే బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వారం మొత్తానికి వరస్ట్ పెర్ఫార్మర్‌గా మానస్ ఎంపికైనట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, అతడిని బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం కెప్టెన్ జెస్సీ జైలులో పెట్టాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక, ప్రోమోలో జరిగిన డిస్కర్షన్ చూస్తుంటే మానస్ జైలుకు వెళ్లింది నిజమేనని సుస్పష్టం అవుతోంది.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. Recently Star Maa Released Latest Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X