twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: కడుపు మాడ్చి మటన్ బిర్యానీ.. షన్ను దెబ్బకు రవి షాక్.. ఏడ్చేసిన సిరి!

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూనే మంచి రేటింగ్ తో కూడా దూసుకుపోతోంది. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని చొప్పించి తెలుగు ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయిపోయారు.. అయితే ఈ వారం కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవ్వాలి అనే దాని కోసం ఒక టాస్క్ జరుగుతూ ఉండగా అందులో భాగంగా ఇచ్చిన ఫుడ్ టాస్క్ ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించిన ప్రో విడుదలవ్వగా ఎపిసోడ్ మీద ప్రోమో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఎనిమిది మంది నామినేషన్స్లో

    ఎనిమిది మంది నామినేషన్స్లో

    బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం నాలుగో వారానికి ఎంటర్ అయింది. ఇక ఉన్న హౌస్ మేట్స్‌లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. అందుకోసం ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈ వారం నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ నుంచి షోలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. 'గెలవాలంటే తగ్గాల్సిందే' అనే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు తమ బరువుని తగ్గించుకోవాల్సి ఉంటుంది, అయితే అది ఫిజికల్ గానా లేక టాస్క్ ల ద్వారానా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు కానీ ఇప్పటికే ఇంట్లో మొత్తం ఆహారాన్ని తీసుకెళ్లిపోయారు బిగ్ బాస్ నిర్వాహకులు.

    జస్వంత్ కి గట్టి వార్నింగ్

    జస్వంత్ కి గట్టి వార్నింగ్

    అయితే లోబో ఆహరం ఇవ్వకుండా తినడంతో హౌస్ కెప్టెన్ జస్వంత్ కి గట్టిగా వార్నింగ్ పడడమే కాక కాజల్ కు కూడా షాకిచ్చారు. మరో పక్క ఒక్కొక్క హౌస్ మెట్ కోసమే ఫుడ్ ఇస్తూ ఉండడంతో హౌస్ లో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రోమోలో లోబో.. ఆకలికి తట్టుకోలేక చెత్త బుట్టలో ఆహారం కోసం వెతుక్కుంటూ కనిపించడమే ఆసక్తి పెంచేసింది.

    ఫిజికల్ టాస్క్ లో పోటీ పడుతూ

    ఫిజికల్ టాస్క్ లో పోటీ పడుతూ

    ఇక తాజా ప్రోమోలో విశ్వ-ప్రియాంక ఫిజికల్ టాస్క్ లో పోటీ పడుతూ కనిపించారు. చెరొక గొడ్డలితో దుంగలు కొడుతూ కనిపించారు. ఇక కడుపు మాడ్చడంతో చాలా ఆకలిగా ఉన్న హౌస్ మేట్స్ ఆకలిని ఒకేసారి తీర్చారు బిగ్ బాస్. అందరి కోసం ఫుడ్ బండి ద్వారా మటన్ బిరియానీని పంపించారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఆనందంలో మునిగి పోయారు. హాయిగా మటన్ బిర్యాని మొత్తాన్ని ఆరగించారు.

    మురికి గుంటలో కాలెట్టేశారు

    ఇక తిన్నాక 'ఏడు సముద్రాలు దాటి.. ఇంటి ముందున్న మురికి గుంటలో కాలెట్టేశారు' అంటూ లోబోతో సామెతలు చెబుతూ కనిపించారు నటరాజ్ మాస్టర్. షణ్ముఖ్-రవి కూర్చుని ఉండగా 'టాస్క్ లో ఆడుతున్నప్పుడు కూడా నీ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అనిపిస్తుంది' అని రవితో షణ్ముఖ్ అనడంతో షాకయిన రవి 'ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నేనెక్కడ మాట్లాడాను నీతో..?' అంటూ ప్రశ్నించాడు.

    Recommended Video

    #BiggBosstelugu5 : హౌస్ లో ఇంట్రెస్టింగ్ టాస్క్.. Sriram,Hamida అదుర్స్ || Filmibeat Telugu
    ఏడ్చిన సిరి

    ఏడ్చిన సిరి

    ఆ తరువాత సన్నీ-మానస్ లకు పవర్ రూమ్ యాక్సెస్ దక్కగా ఛాలెంజ్ కోసం వీరు హౌస్ లో ఏ జంటను ఎన్నుకుంటారు అనే దాని మీద సస్పెన్స్ మెయింటైన్ చేశారు. మమ్మల్నే చేస్తారని షణ్ముఖ్-సిరి, ఆనీ-శ్వేతా జంటలు అనుకుంటూ కనిపించాయి. ఇక మో చివర్లో.. సిరి.. ప్రియాంకను పట్టుకొని ఏడుస్తూ కనిపించింది. వెంటనే కళ్లు తుడుచుకుంటూ.. షన్ను చూస్తే తిడతాడని చెబుతూ వెళ్ళింది. దీంతో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    bigg boss sends mutton biryani for house mates and shanmukh shocks ravi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X