Bigg Boss 5: నాగ్ సహా అందరి ముందు కాజల్ పరువు తీసేసిన రవి.. ఇక అయిపోయిందన్న సిరి!

బిగ్‌బాస్‌ తెలుగు 5 శనివారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నాగార్జున శనివారం ఎంట్రీ ఇచ్చి బాగా ఆడిన హౌజ్‌మేట్స్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతే కాక రివేంజ్‌ డ్రామాని రిపీట్‌ చేసి షాకివ్వడమే కాక హీరోలు, విలన్లను బయటకు తెప్పించాడు. అంతే కాక ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా ఎపిసోడ్ చివరి దాకా ముగ్గురిని సేవ్‌ చేసి మరో ఐదుగురుని టెన్షన్‌లో పెట్టాడు. ఇక ఆదివారం ప్రోమో విడుదల కాగా అది ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎవరు సేవ్‌ అవుతారు?

ఎవరు సేవ్‌ అవుతారు?

నిన్న హౌస్ లో జరిగిన విలన్స్, హీరోస్ టాస్క్ లో ఫైనల్‌గా విశ్వ హౌజ్‌లో హీరోగా నిలవగా, ప్రియాంక విలన్‌గా నిలిచింది. ముందుగా రవిని సేవ్ చేసాడు నాగ్‌. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ లో ఆడిన బ్యాగ్‌ల్లో ఉన్న బాల్స్ తీయాల్సి ఉంటుంది. రెడ్‌ బాల్‌ వస్తే అన్‌సేవ్‌, గ్రీన్‌ బాల్‌ వస్తే సేవ్‌. ఇందులో సిరి సేవ్‌ అయ్యింది. ఇక చివరగా ఫ్లవర్స్ ని తీసే టాస్క్ లో వైట్‌ రోజ్‌ వచ్చిన సన్నీ సేవ్ అయ్యాడు. దీంతో ఇప్పుడు కాజల్‌, ప్రియాంక, శ్రీరామ్‌, విశ్వ, జెస్సీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు సేవ్‌ అవుతారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈరోజు అంటే ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టత రానుంది.

నీలాంబరి అనే సాంగ్ తో

నీలాంబరి అనే సాంగ్ తో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన నీలాంబరి అనే సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఈ పాటకు సరిపోయే సుందరి ఎవరు ఉన్నారు అని శ్రీరామ్ ని ప్రశ్నిస్తే సన్నీ సార్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో నాగార్జున నవ్వుతూ సన్నీ నీ టెంపర్ తెగిపోతే నిన్ను సుందరిని చేసేసారు చూడు అంటూ నవ్వించారు..

నేను ఎవరిని

అలా ఇంటిసభ్యుల ఆటపాటలతో బిగ్‌బాస్‌ హౌస్‌ ఈ వీకెండ్‌ ఫుల్‌ జోష్‌తో నిండి పోయిందని చెప్పచ్చు. హోస్ట్ నాగార్జున ఇచ్చిన స్పెషల్‌ టాస్క్‌లతో ఎలిమినేషన్‌ని మర్చిపోయి.. ఇంటి సభ్యులు కాస్త సేద తీరారు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులతో నాగార్జున ''నేను ఎవరిని'' అనే ఆట ఆడించారు. ఇంటి సభ్యులందరూ పేర్లు చీటీలో రాసి ఓ గ్లాస్‌ బౌల్‌లో వేశారు.

కాజల్ పరువు తీసేసిన రవి

కాజల్ పరువు తీసేసిన రవి

ప్రతి ఒక్క హౌస్‌మేట్‌.. అందులో ఒక చీటీని తీసి.. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్లని ఇమిటేట్‌ చేసి చూపించాలి. అలా, శ్రీరామ్‌కు సన్నీ పేరు రావడంతో అతడిని ఇమిటేట్‌ చేయగానే.. మిగిలిన ఇంటి సభ్యులు అది సన్నీ అని గుర్తించారు. ఇక, కాజల్‌ చీటీ రావడంతో ఎలా తింటుందో చూపించిన రవి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ నవ్వించాడు. ఏంటి కాజల్ అలా తింటుందా? అని నాగరున కూడా నవ్వేశారు.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
పట్టించుకోనన్న సిరి

పట్టించుకోనన్న సిరి

ఆ తర్వాత మరో టాస్క్ ఏదో డ్యాన్స్ వేయించి సుత్తితో కొట్టాలని ఇచ్చారు. అందులో భాగంగా షణ్ముఖ్ నువ్వు కానీ కొట్టావు అనుకో, నువ్వు ఫేక్, నీ ఫ్రెండ్ షిప్ ఫేక్ అని మొదలు పెడుతుంది అని నాగార్జున అంటూ ఉండగా సిరి అంటూ అది అక్కడితో అయిపొయింది, ఇక మీద చేసినా పట్టించుకోనని చెప్పింది. షన్ను అదే మాట మీద ఉండమంటే కొట్టబోయింది. ఆలా సరదాగా సాగుతున్న ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేటై బయటకు వచ్చేది ఎవరో అధికారికంగా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X