Bigg Boss 5 Promo : లహరి vs ప్రియ... వీడియో ప్రూఫ్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన రవి.. లహరి షాకింగ్ గా!
బిగ్ బాస్ విజయవంతంగా మూడో వారం చివరి కి చేరుకుంది.. అయితే ప్రతి శని ఆదివారాల్లో నాగార్జున హౌస్ మేట్స్ కి కనిపిస్తూ కనువిందు చేస్తారు అన్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న సభ్యులు కాకుండా మరో ముఖం ఎరుగని కంటెస్టెంట్లు నాగార్జున ముఖాన్ని చూస్తారు కాబట్టి ఆయనను చూడగానే హౌస్ మేట్స్ అందరూ ఆనంద పడడం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన వచ్చినట్టే వచ్చి వారం మొత్తం మీద ఎవరు ఎలాంటి తప్పులు చేశారు అనే విషయం మీద క్లాస్ పీకుతారన్న సంగతి తెలిసిందే. ఈ రోజు సీరియస్ గా ఉన్న ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రియా, లహరి, రవి ఎపిసోడ్ తీసుకున్న నాగార్జున రవి కి అనుకోని షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రియా, లహరి మధ్య గొడవ
కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మూడో వారం కూడా ముగింపుకు చేరింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రేపు ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తారు. అయితే ఈ రోజు నుంచి కంటెస్టెంట్ లను నాగార్జున సేవ్ చేయడం ప్రారంభిస్తారు దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు బయటకు రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఎంటర్ అయినా సమయం నుంచే చాలా సీరియస్ గా ఉన్న నాగార్జున ప్రియా, లహరి మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు.

ఎవరితో చూశారు? ఎక్కడ చూశారు?
మీ అందరి మనసులో ప్రశ్నలు చాలా మిగిలిపోయాయని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు తెలుసుకుంటామని నాగార్జున అన్నారు. అలా అంటూ మొన్న ఎలా అయితే నామినేషన్ ప్రక్రియ లో పేర్లతో ఉన్న అద్దాలను పగులగొట్టి అలాగే నాగార్జున కూడా రవి అలాగే ప్రియ ఇద్దరి అద్దాలు పగలగొట్టి వారిద్దరినీ నుంచో పెట్టించారు. ఎవరితో చూశారు? ఎక్కడ చూశారు? అని నాగార్జున ప్రియని ప్రశ్నించగా ఇన్ డీసెంట్ వేలో కాదు సార్ బిజీగా ఉండడం చూశానని ప్రియ చెప్పుకొచ్చింది.

నేను ఆ ఉద్దేశంతో అనలేదు
అయితే హగ్ ఇవ్వడం బిజీగా ఉండడమా అని ప్రశ్నించగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ప్రియా అంటుండగా నువ్వు ఉద్దేశంతో అన్న అనకపోయినా బయటకు వచ్చింది మాత్రం అలాగే ఉందని నాగార్జున అన్నారు. ఇక సింగిల్ మాన్ అని అన్నావా లేదా అని రవిని ప్రశ్నించగా అవును అన్నానని అలా అన్నానని ఒప్పుకున్నానని రవి అన్నాడు.

లహరి పవర్ రూమ్ లోకి
అయితే రవి ఒప్పుకున్నాడా అని ప్రియని అడగగా ఒప్పుకోలేదని తెలిపింది. వెంటనే లహరి పవర్ రూమ్ లోకి వెళ్ళమని సూచించడంతో ఆమె అక్కడకు వెళ్ళింది. అక్కడ లహరికి అంతకు ముందు వారంలో ఏం జరిగింది రవి, ప్రియ మధ్య సంభాషణ ఏంటి అనేది చూపించారు. ఆ క్లిప్ చూసిన తర్వాత ఎవరు ఏమన్నారు అనేది క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఎవరు తప్పు చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళకు ఒక హగ్ ఇవ్వాలని నాగార్జున సూపించాడు.
ఎవరిని హగ్ చేసుకోబోతోంది
దీంతో ఆమె ఎవరిని హగ్ చేసుకోబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ విషయంలో రవి మైండ్ గేమ్ ఆడాడు అనే విషయం ప్రేక్షకుల వెంటనే పసిగట్టారు. ముందు నుంచి కూడా ప్రియా తప్పుగా మాట్లాడింది అందరూ భావిస్తూ రాగా రవి మాటల తర్వాత ప్రియ తప్పేమీ లేదని ఆమె మాటలు వేరేగా బయటకు వచ్చాయి కానీ ఆమె ఉద్దేశం వేరే అని దాని అర్థం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











