BiggBoss: శ్రీరామ్ కి దిమ్మతిరిగే వార్నింగ్..ప్రూఫులు బయటపెట్టి మరీ గుంటనక్క అంటూ రవి పరువు తీసేసిన నాగ్!

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ఆరో వారం ఆఖరికి చేరింది. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా నాగార్జున హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా హౌస్ లో ఉన్న సభ్యులందరికీ క్లాస్ పీకుతూ హౌస్ సభ్యులందరి గుండెల్లో టెన్షన్లు పుట్టించారు. ఈ రోజు విడుదలైన ప్రోమోలో ఈ వివరాలు స్పష్టంగా కనిపించాయి. మరి చూద్దాం నాగార్జున ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చారు అనేది.

మళ్ళీ వర్కింగ్

మళ్ళీ వర్కింగ్


బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ అలాగే ప్రతి టాస్క్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొన్నీ మధ్య జరిగిన బొమ్మల టాస్క్ లో రవి ఆడిన ఆట మిగతా హౌస్ సభ్యులందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.. రవి, శ్వేత వర్మ, లోబో కలిసి ఏకంగా కుషన్లు చింపి అందులో ఉన్న కాటన్ తో బొమ్మలు తయారు చేయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ ప్రాపర్టీ కి డ్యామేజ్ కలిగించారు అని చెబుతూ వాళ్ల ముగ్గురిని డిస్క్వాలిఫై చేయడమే కాక సంచాలకులకి కూడా వార్నింగ్ ఇచ్చారు అలాగే డిస్క్వాలిఫై చేశారు. ఇక ఈ విషయం మీద ఈ రోజు చర్చ జరిగింది.

శ్రీరామచంద్ర కి షాక్

శ్రీరామచంద్ర కి షాక్

ముందుగా ఆనీ మాస్టర్ తో మాట్లాడిన నాగార్జున సంచాలక్ తప్పు చేస్తే బిగ్ బాస్ వాళ్లను డిస్ క్వాలిఫై కూడా చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి దానికి నేను నా పిల్లల మీద ఒట్టేస్తాను, నేను దాని మీద ఒట్టు వేస్తాను, నేను దీని మీద ఒట్టు వేస్తా అంటూ ఎన్నిసార్లు అలా ఒట్లు వేస్తారు అని ఆయన ప్రశ్నించడంతో మాస్టర్ నోట మాట రాలేదు. అలాగే నామినేషన్ల టైంలో శ్రీరామ్ యాక్టర్లు అనే మాట అనడం మీద కూడా నాగార్జున తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంటే యాక్టర్లు అంటే అంత చిన్న చూపు అని ప్రశ్నించిన నాగార్జున నేను సింగర్ ని అని చెప్పుకుంటున్నావు కదా యాక్టర్లు అంటే ఎందుకు అలా చిన్నచూపు అని ప్రశ్నించారు.

గడ్డి తినమంటే తింటావా?

గడ్డి తినమంటే తింటావా?

లోబోతో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీ కి నష్టం కలిగించకూడదు అనే విషయం నీకు తెలియదా అని ప్రశ్నిస్తే తనకు ఈ విషయం తెలియదని రవి అలా చేయమని చెప్పాడు కాబట్టి నేను వెళ్లి కట్ చేసి తీసుకు వచ్చాను అని చెప్పాడు. అయితే రవి గడ్డి తినమంటాడు, తినడానికి రెడీ అవుతావా అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయం మీద రవి తన ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఇదంతా జరిగిన తర్వాత నేను షాకింగ్ గా శ్వేతా వంక ఎందుకు చూశాను అంటే లోబో ఈ పని చేస్తున్నట్లు నాకు తెలుసు కానీ శ్వేత ఈ పనిచేస్తున్నట్లు తెలియదు అని చెప్పుకొచ్చాడు.

రవికి షాకిచ్చిన నాగ్

రవికి షాకిచ్చిన నాగ్

అయితే శ్వేతా మాత్రం మాట్లాడుతూ ఈ విషయం రవికి కచ్చితంగా తెలుసు అని చెప్పుకొచ్చింది.. ఇంత ఎక్కువ కాటన్ ఎక్కడిది అంటే నేను ఇలా కుషన్ కట్ చేసి తీసుకువచ్చాను అనే విషయం నీకు చెప్పానని చెప్పడంతో పాటు నీకు తెలియదు అని చెప్పకు, నాగార్జున గారు రవి తన స్టేట్మెంట్ మారుస్తున్నాడు అని ఫిర్యాదు చేసింది. నాగార్జున కోపం తెచ్చుకుని ఇవన్నీ వింటుంటే నటరాజ్ మాస్టర్ వెళుతూ అన్న అనే పదం నిజమేనేమో అనే అనుమానం వస్తుందని అన్నారు. బాధపడిన రవి ఇక్కడ కోసం కుషన్ లో ఉన్న కాటన్ బయటనుంచి వచ్చిన కాటన్ రెండు ఒకలాగే ఉందని అంటాడు.

షాక్ లో రవి

ఇక్కడి దానికి బయట ఉన్న దానికి తేడా ఏంటో చూస్తావా అని ప్రశ్నించగా రవి చూస్తాను అనడంతో వెంటనే విశ్వ ఇంటి లోపలికి వెళ్లి ఒక కుషన్ తీసుకు వస్తాడు. ఆ కుషన్ కత్తిరించి చూసిన తర్వాత బొమ్మను కూడా కత్తిరించి చూపించారు. అలా చూపించిన సమయంలో రెండూ ఒకలాగా ఉందా లేదా అనే విషయం చెప్పాలి అంటూ కాజల్ అలాగే సిరి ఇద్దరినీ సంచాలకులుగా నాగార్జున నియమించారు. అయితే వారిద్దరూ కూడా రవి చెప్పిన మాటలు నిజం కాదని చెప్పే అవకాశం కన్పిస్తోంది. మొత్తం మీద ఈ బిగ్ బాస్ ప్రోమో లో నాగార్జున శ్రీరామ్ తో పాటుగా యాంకర్ రవి కూడా బాగానే ఆడుకున్నట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X