Bigg Boss 5 Promo: కెప్టెన్సీ కోసం ఎగబడిన కంటెస్టెంట్స్.. WWE రేంజ్ లో షణ్ముక్, సన్నీ సీరియస్!

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ ఎప్పుడూ ఒకేలా ఉండరు అని అందరికీ తెలిసిన విషయమే. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కూడా వారిలోని అసలైన రంగులను బయటపెడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఎవరైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అడుగులు వేస్తూ ఉంటారు. ఫిజికల్ టాస్క్ లు వచ్చినప్పుడే వారి విశ్వరూపం చూపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ లో హోరాహోరీగా పోటీపడినట్లు అర్థమవుతుంది. కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారుతోంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 పంతం నీదా నాదా..

పంతం నీదా నాదా..

మొదటి వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సైకిల్ తొక్కి లైట్ ను వెలిగించే పోటీలు పెట్టారు. అప్పుడు అందులో అదృష్టవశాత్తు సిరి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమె తరువాత కెప్టెన్ గా ఎవరు ఉంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇక నామినేషన్ మొదలైనప్పుడు ఒక రేంజ్ లో తిత్రుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు పంతం నీదా నాదా అని కెప్టెన్సీ టాస్క్ లో మరింత వైల్డ్ గా మారబోతున్నారు.

 మొదటిసారి రావడంతో

మొదటిసారి రావడంతో

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులను సమానంగా రెండు గ్రూపులుగా విడగొట్టిన విషయం తెలిసిందే. వారికి కెప్టెన్సీ టాస్క్ లో అసలైన ట్విస్ట్ ను ఇవ్వబోతున్నారు. ఫిజికల్ టాస్క్ లో పోటీ పడేందుకు ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వారు ఈ వారం వారి టాలెంట్ ను చూపించడానికి సిద్ధమయ్యారు అనిపించింది. పంతం నీదా నాదా అనే టాస్క్ లో రెండు గ్రూపులకు చెందిన వాళ్లు చిన్న సైజు మెత్తలను కనుగొనాల్సి ఉంటుంది.

 కాజల్, సన్నీ గొడవ

కాజల్, సన్నీ గొడవ

అంతే కాకుండా వాటిని ఒకరి నుంచి మరొకరు అలాగే లాగేసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ పోటీలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా జరిగినట్లు అర్థమవుతోంది. ఆర్జే కాజల్, శ్రీ రామచంద్ర మధ్య కూడా గొడవ జరిగింది. ఆ విషయంలో సన్నీ కూడా కాజల్ పై విరుచుకుపడ్డాడు. ఒకరినొకరు హెల్ప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిచ్చు అంటుకున్నట్లు తెలుస్తోంది.

షణ్ముఖ్ జస్వంత్, సన్నీ WWE

షణ్ముఖ్ జస్వంత్, సన్నీ WWE

షణ్ముఖ్ జస్వంత్, సన్నీ అలాగే సిరి మధ్యలో కూడా కొన్ని పోరాట సన్నివేశాలు కనిపించాయి. ముఖ్యంగా సన్నీ యశ్వంత్ అయితే WWE తరహాలో ఒకరిపై ఒకరు పడడం విశేషం. శ్రీ రామచంద్ర యాంకర్ రవి మధ్యలో కూడా మరొక వివాదం చోటు చేసుకొనే చాన్స్ ఉందని అర్థమవుతోంది. సిరి కూడా సన్నీ పై విరుచుకుపడింది.

Recommended Video

Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
విశ్వపై గట్టిగా అరిచేసిన యాంకర్ రవి

విశ్వపై గట్టిగా అరిచేసిన యాంకర్ రవి

ఇక శ్రీ రామచంద్రకు మద్దతుగా నిలిచిన కూడా యాంకర్ రవితో విశ్వకు గొడవ వచ్చింది. పొయ్యి ముడితే మాట్లాడు నువ్వు అంటూ విశ్వ అన్నప్పుడు మీ వాడు వచ్చాడు అని యాంకర్ రవి కూడా ఎదురు తిరగాడు. బ్రదర్స్ అంటూ ఎమోషనల్ అయ్యే ఇద్దరు మొదటిసారి గట్టిగానే తిట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా కెప్టెన్సీ టాస్క్ లో చాలా కష్టపడ్డారు అనిపిస్తోంది. చివరికి సన్నీ కంటతడి కూడా పెట్టుకున్నాడు. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు పైచేయి సాధిస్తారో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X