Bigg Boss Promo: చీదరించుకొన్న షణ్ముఖ్.. తలబాదుకొన్న సిరి హన్మంతు.. గదిలోకి వెళ్లి అలా బెదిరింపులు
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు మధ్య చిలిపిగొడవలు, అలకలు మరోసారి తాజా ఎపిసోడ్‌లో హైలెట్‌గా కనిపించాయి. బాత్రూమ్‌లోకి వెళ్లి సిరి తలుపు పెట్టుకోవడంతో షణ్ముఖ్ కంగారు పడిపోయారు. దాంతో ఇంటిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆందోళనతో ఇంటి సభ్యులందరూ వాష్‌రూమ్‌వైపు పరుగులు పెట్టారు. ఇంతకు షణ్ముఖ్, సిరి హన్మంతు మధ్య ఏం జరిగిందంటే...

చీటికి మాటికి సిరి, షన్ను గొడవలు
బిగ్‌బాస్‌లో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ మధ్య గొడవలు తొలుత ఆసక్తికరంగానే అనిపించాయి. కానీ ప్రతీ రోజు గొడవ పడటం, ఏడవడం, సారీ చెప్పుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ప్రస్తుతం వెగటుపుట్టిస్తున్నది. వారిద్దరి రిలేషన్ పక్కన పెడితే ప్రేక్షకులకు మాత్రం చూడటానికి ఇబ్బందికరంగా మారుతున్నది. ప్రతీసారి సాగదీసినట్టు రొటీన్ సీన్లతో కంపరం పుట్టిస్తున్నారనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నది.

సిరి, షన్నుపై నాగార్జున సెటైర్
సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ వ్యవహారంపై హోస్ట్ నాగార్జున కూడా పలుమార్లు సెటైర్లు కూడా వేశాడు. షణ్ముఖ్ ఫేక్.. నువ్వే ఫేక్.. నీతో మాట్లాడను అంటూ సిరి అనడాన్ని నాగార్జున కూడా ఇమిటేట్ చేయడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిరి, జస్వంత్ అదే డైలీ సీరియల్ మాదిరిగా ఏడుపు సీన్లను కంటిన్యూ చేస్తూ మహా కంపరం పుట్టిస్తున్నారు. తాజాగా నిర్వాహకులు వదిలిని ప్రోమోలో మరోసారి వారి వ్యవహారం నాయనా ఇదిగో పులి మాదిరిగా మరింత ఇబ్బందిగా కనిపించింది.

తల బాదుకొన్న సిరి హన్మంతు
సిరితో షణ్ముఖ్ మాట్లాడుతూ.. నేను ఏడవటం వల్ల నీవు తక్కువేమీ కావు. నీవు అందుకే వచ్చి ఉంటావు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అని షణ్ముఖ్ అనగానే.. సిరి హన్మంతు రెండు చేతులతో తలకొట్టుకొన్నది. దాంతో ఇంటి సభ్యులు ఏం జరుగుతున్నదనే ఆలోచనల్లో పడ్డారు. అయితే ఇద్దరు ఏడుస్తున్నారంటూ యాంకర్ రవి ఇంటి సభ్యులకు చెప్పడం కనిపించింది.

నీవు నీ కోసం గేమ్ ఆడుతున్నావా?
మరో సీన్‌లో సిరితో షణ్ముఖ్ మాట్లాడుతూ.. నేనే మాట అన్నాను. నేనే తప్పు అవుతాను. నీవు పైకి వెళ్తావు. నీవు వెళ్లు. నీవు నీ కోసం గేమ్ ఆడుతున్నావు కదా.. నా దగ్గరికి రాకు. అరే అది కాదు అంటూ సిరి ఏదో చెప్పబోతే.. నీవు వెళ్లు అంటూ సైగ చేశాడు. దాంతో షణ్ముఖ్‌ను కౌగిలించుకొని సిరి ఏడుపులో మునిగిపోయింది. ఇదిలా ఉంటే వారిని బయటకు తీసుకువచ్చి.. వాళ్లను బయటకు తీసుకొచ్చి.. కూర్చోపెట్టండి అని వీజే సన్నీ అంటే.. లేదు లేదు వారికి స్సేస్ కావాలి. వాళ్లు మాట్లాడుకొంటారు అంటూ యాంకర్ రవి కనిపించాడు. అయితే వాళ్లను అలా వదిలేయండి. వారిద్దరి కంఫర్ట్‌గా ఉంటారు అని అనీ మాస్టర్ అన్నారు.

ఆమె నా పక్కన ఉంటే బాగుండు.. అంటూ షన్ను
షణ్ముఖ్ ఏడుస్తూనే.. అందుకే నేను ఒంటరిగా ఉంటున్నా. ఈ సమయంలో ఆమె ( దీప్తి సునైన) నా పక్కన ఉంటే బాగుండు. ఆమె నాతో ఉంటే కింగ్‌లా ఉంటాను అని అంటే.. ఒక నాలుగు వారాలు ఆగు.. మనం వెళ్లిపోదాం అని సిరి అంటే.. నీవు ఆగు.. ఎప్పుడు వెళ్లిపోవాలో నాకు తెలుసు. నీవు చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపో అంటూ సిరికి సమాధానం ఇచ్చాడు. దాంతో సిరి అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకొన్నది.

బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొని..
బాత్రూంలోకి వెళ్లి సిరి హన్మంతు ఎంతకు బయటకు రాకపోవడంతో షణ్ముఖ్ వెళ్లి తలుపులు దబాదాబా బాదాడు. అది చూసి ఇంటి సభ్యులందరూ పరుగెత్తుకె వెళ్లారు. యాంకర్ రవి కూడా తలుపులు బాదుతూ సిరి.. సిరి అని అరిచాడు. ఆ తర్వాత సిరి తలుపులు తీయడం కనిపించింది. తాజా ప్రోమో మరోసారి ఇంటిలోని ఎమోషన్స్‌ను కాప్చర్ చేయడానికి ప్రయత్నించింది.
Recommended Video
44వ వారంలో బిగ్‌బాస్ రేటింగ్..
బిగ్‌బాస్ తెలుగు 5 షో రేటింగ్ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 5.20 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, 44వ వారంలో 5.09 రేటింగ్ సాధించింది. ఇక రూరల్ ప్రాంతంలో 43వ వారంలో 3.04 రేటింగ్ సొంతం చేసుకోగా, 44వ వారంలో 3.10 రేటింగ్ సాధించింది. అయితే కంటెంట్‌లో వైవిధ్యం లేకపోవడం, కంటెస్టెంట్లు మాస్కులేసుకొని ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











