Bigg Boss telugu 5: నీ ముఖం పగిలిపోద్ది.. లోబోకు సిరి హన్మంతు వార్నింగ్.. ఆర్జే కాజల్‌ను లహరి దారుణంగా
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో రెండో రోజు భారీగానే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నట్టు స్పష్టమైంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ చేసిన రెండో ప్రోమో ప్రకారం.. హీరోయిన్ సిరి హన్మంతు, లోబో మధ్య ఓ గొడవ కనిపిస్తే.. రెండో గొడవ హీరోయిన్ లహరి షారి, ఆర్జే కాజల్ మధ్య గట్టిగానా మాటల యుద్ధం జరిగినట్టు కనిపించింది. ఇంతకు వారి గొడవకు కారణం ఏమిటంటే..

సిరి హన్మంతుకు లోబో కౌంటర్
హీరోయిన్ సిరి హన్మంతు ఎవరితో ఏదో చెబుతుంటే... లోబో మధ్యలో దూరి నీకు నాతో ప్రాబ్లెం ఉంటే నాకు చెప్పు. వాళ్లకు వీళ్లకు చెప్పకు అని అంటే.. వెళ్లు వెళ్లు అంటూ సిరి హన్మంతు కౌంటర్ ఇచ్చింది. దాంతో సక్కగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు లోబో చేస్తే.. నన్ను కెలికితే ఇలానే ఉంటుంది అంటూ సిరి హన్మంతు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.

అద్దంలో ముఖం చూసుకో అంటూ..
అయితే సిరి హన్మంతు కెలికితే అనే పదం ఉపయోగించడంతో లోబో మరో కౌంటర్ ఇచ్చారు. నిన్ను కెలకడానికి నాకు వేరే పని ఏమిలేదా? అంటే.. ఇక్కడ ఎవరికి ఏమీ పనిలేదు అంటూ సిరి సమాధానం ఇచ్చింది. దాంతో వెళ్లి అద్దంలో ముఖం చూసుకో అంటూ లోబో సెటైర్ వేశాడు. ముఖం గురించి మాట్లాడితే.. ముఖం పగిలిపోద్ది అంటూ సిరి ఘాటుగా స్పందించింది. దాంతో నా ముందు చిన్న చెటాక్ అంతా ఉన్నావు అంటూ లోబో కోపంతో ఊగిపోయాడు.

ఆర్జే కాజల్‌కు లహరి షాక్
ఇదిలా ఉంటే.. హీరోయిన్ లహరి షారీకి ఆర్జే కాజల్‌కు మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నది. కిచెన్ టీమ్.. కిచెన్ టీమ్ అంటూ ఆర్జే కాజల్ అరుస్తుంటే.. పక్కనే ఉన్న లహరి.. మీరు ఎందుకు అంత హైపర్ అవుతున్నారు. నాకు సరిగా అర్ధం కావడం లేదు అంటూ కామెంట్ చేసింది. దాంతో నన్నే కదా.. అంటూ కాజల్ సమాధానం ఇస్తే.. డోంట్ క్రియేట్ కంటెంట్ ఆల్వేస్ అంటూ లహరి మరోసారి కామెంట్ చేసింది.

ఆర్జే కాజల్ కంటతడి పెట్టుకొంటూ..
లహరి షారి కామెంట్లతో షాక్ తిన్న ఆర్జే కాజల్.. ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని ఏదో చెప్పబోతుంటే.. మీరు ఎందుకు ఒక పర్సన్‌ను ఎటాక్ చేయాలని చూస్తున్నారు అని లహరి అంటే.. నేను ఎటాక్ చేస్తున్నానా? అని కాజల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అవును డెఫినెట్‌గా ఎటాక్ చేస్తున్నావు అని లహరి అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది.
దాంతో నా కూతురు చూస్తే ఏడుస్తుంది అంటూ కాజల్ అక్కడి నుంచి కళ్ల నీళ్లను తుడుచుకొంటూ వెళ్లింది. అలా గొడవలతో రెండో ప్రోమో ఈ రోజు ఎపిసోడ్‌పై క్యూరియాసిటీని భారీగా క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











