For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5:అక్క పెళ్లిలో ఆ బాధ్యత తనే తీసుకున్నారు.. కంటెస్టెంట్ ను గుర్తు చేసుకున్న రామ్ చరణ్

  |

  అత్యధిక టీఆర్పీ రేట్ అందుకుంటూ ముందుకు కొనసాగుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ముందు ముందు మరిన్ని రికార్డులను క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాద్ సీజన్ 5 లాంచ్ ఎపిసోడ్ కు సంబంధించిన రేటింగ్ విషయాన్ని కూడా బయట పెట్టాడు. దేశంలోనే భారీ స్థాయిలో బిగ్ బాస్ తెలుగు క్రేజ్ అందుకుంటుందని కంటెస్టెంట్స్ కు వివరణ ఇచ్చాడు.

  ఇక శనివారం రోజు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నాగార్జున మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక నాగార్జున హౌస్ మేట్స్ ను ప్రత్యేకంగా పరిచయం చేయించారు రామ్ చరణ్ కూడా అందరిని ప్రత్యేకంగా పలకరిస్తూ అందులో కొంత మంది తో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా గుర్తు చేసుకున్నారు.

  మన టీవీలో రామ్ చరణ్

  మన టీవీలో రామ్ చరణ్

  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ప్రత్యేకమైన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ ను బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున ఆహ్వానించారు. మొదట రామ్ చరణ్ పిలిచే ముందు మన టీవీ లో అతను నటించిన ప్రత్యేకమైన యాడ్ ని కూడా చూపించారు. అది అద్భుతంగా ఉందని ఒక మెజీషియన్ తరహాలో రామ్ చరణ్ కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా పిల్లలకు కూడా చాలా నచ్చుతుందని నాగార్జున పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ కూడా నాగార్జున మాటలకు కృతజ్ఞతలు తెలిపారు.

  యాంకర్ రావి ఇక్కడ కూడా ఏడిపిస్తున్నాడు

  యాంకర్ రావి ఇక్కడ కూడా ఏడిపిస్తున్నాడు

  ఇక యాంకర్ రవి ని పరిచయం చేస్తూ నాగార్జున ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. ఇతని గురించి పరిచయం అవసరం లేదు అంటూ చెప్పడంతో.. అందుకు రామ్ చరణ్ కూడా రవి గురించి అందరికీ తెలిసిందేగా అని మరొక స్వీట్ కామెంట్ చేశాడు. బయట ఎక్కడ షోలు జరిగిన కూడా టీవీలో కూడా మీ సైడ్ యాంకర్ ను ఎక్కువగా ఏడిపిస్తారు అని అనడంతో అందుకు నాగార్జున.. ఇక్కడ కూడా అదే జరుగుతోందని రామ్ చరణ్ కు తెలియజేశారు. ఇక వారి ర్యాగింగ్ కు యాంకర్ రవి ముసిముసి నవ్వులతో అలాంటిది ఏమీ లేదు అంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

  ఆనీ మాస్టర్ తో

  ఆనీ మాస్టర్ తో

  ఇక రామ్ చరణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పలుకరిస్తూ అందులో కొంత మందితో ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను కూడా నాగార్జునకు తెలియజేశారు. ముఖ్యంగా అక్కడ అందరి కంటే సీనియర్ అయినటువంటి ఆనీ మాస్టర్ తో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలియజేశాడు.

  మా అక్క పెళ్లిలో

  మా అక్క పెళ్లిలో

  ఎందుకంటే అన్నీ మాస్టర్ తన సోదరి పెళ్లి లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారని అన్నారు. మా అక్క పెళ్లిలో సంగీత్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి కొరియోగ్రఫీ చేసి చాలా బాగా హెల్ప్ చేశారని చెప్పిన రామ్ చరణ్.. అని మాస్టర్ ఇక్కడ సడన్ గా చూసేసరికి ఎంతో గర్వంగా ఉందని తప్పకుండా మీరు మరింత ముందుకు వెళ్లాలని రామ్ చరణ్ తేజ్ పాజిటివ్ గా కామెంట్ చేశారు.

  నట్రాజ్ మాస్టర్ తో..

  నట్రాజ్ మాస్టర్ తో..

  ఇక అని మాస్టర్ తో మాట్లాడిన అనంతరం రామ్ చరణ్ తేజ్ నటరాజ్ మాస్టర్ ని కూడా పలకరించారు. అయితే నట్రాజ్ మాస్టర్ మాట్లాడుతూ రామ్ చరణ్ తేజ్ తో నాకు ఒక మంచి స్వీట్ మెమరీ ఉందని అన్నాడు. 75 ఏళ్ల చలనచిత్ర ఉత్సవంలో లో ప్రత్యేకంగా డిన్నర్ పెట్టినప్పుడు రామ్ చరణ్ తేజ్ వచ్చి ప్రత్యేకంగా ఒక ప్లేట్లో నాకు ఫుడ్ ఇచ్చారు అని గుర్తు చేసుకున్నాడు. అంత పెద్ద స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ కూడా రామ్ చరణ్ తేజ్ సింపుల్ గా ఉంటూ ఒక మనిషిని గౌరవించారు అని.. అది తనకు ఎంతగానో నచ్చిందని ఇప్పటికి కూడా ఒక వెయ్యి మందికి ఆ విషయానికి చెప్పుకొని ఉంటానని నట్రాజ్ మాస్టర్ వివరణ ఇచ్చారు.

  అందుకు రామ్ చరణ్ అది ఎవరైనా చేయాలి అని చెప్పాడు. ఇక నాగార్జున కూడా అప్పుడే ఒక మంచి కామెంట్ కూడా. సంస్కారానికి రూపం మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్ అంటూ అందరూ విజువల్స్ వేసేలా కామెంట్ చేశారు.

  లోబోని ప్రత్యేకంగా..

  లోబోని ప్రత్యేకంగా..

  ఇక అందరినీ పలకరించిన రామ్ చరణ్ తేజ్ లోబోని మాత్రం చాలా ప్రత్యేకంగా గుర్తించారు అతని స్టైల్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ ఎప్పుడైనా ట్రై చేస్తాను అని రామ్ చరణ్ తెలియజేయడం విశేషం. అందుకు లోబో కూడా ఎంతగానో సంతోషించాడు. ఈ రోజు నా జన్మ ధన్యమైంది అంటూ కింద పడుకుని మరి నమస్కారం చేశాడు.

  చివరికి రామ్ చరణ్ ప్రత్యేకంగా స్టేజిని తీసుకొని కొంతసేపు హోస్ట్ గా కూడా వ్యవహరీంచాడు. మాస్ట్రో చిత్ర యూనిట్ ని స్టేజిపైకి పిలిచిన రామ్ చరణ్ తేజ్ సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని ప్రమోట్ చేశారు. అంతేకాకుండా మాస్ట్రో సినిమా టైటిల్ సాంగ్ కు స్టెప్పులు కూడా వేశారు.

  English summary
  Bigg boss telugu 5 Ram charan remembering contestants relationship
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X