Bigg Boss 5 finale: రాజమౌళి కాళ్లు మొక్కి..అలియా భట్ పెద్ద బాంబ్ అంటూ ఏడిపించిన రణ్ బీర్
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు షో ఫైనల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ఈ వేడుకకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అందరూ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ఫైనల్ 5 లో నిలిచిన కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు, అలాగే మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇకముందు గా రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా బ్రహ్మాస్త్ర యూనిట్ ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

రాజమౌళి కాళ్లు మొక్కిన రణ్ బీర్
బ్రహ్మాస్త్రం సినిమాలో నటించిన స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తోపాటు హీరోయిన్ అలియా భట్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సినిమాకు సమర్పకుడిగా రాజమౌళి వ్యవహరిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో కూడా రాజమౌళి ద్వారానే బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కాబోతోంది. ఇక దర్శకుడు ఆయాన్ ముఖర్జీ కూడా బిగ్ బాస్ స్టేజిపై కి వచ్చి ఫైనల్ 5 కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక రాగానే రణ్ బీర్ రాజమౌళి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.

అలియా, రణ్ బీర్.. స్పెషల్ గా
అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్ లో రణ్ బీర్ కపూర్ అలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు ఇద్దరు కూడా చాలా సేపు చాలా సింపుల్ గా మాట్లాడుతూనే కాస్త రొమాంటిక్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అలియా భట్ గురించి చెబుతూ సిగ్గుపడింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ కూడా అదే తరహాలో అలియా గురించి చెబుతూ వివరణ ఇచ్చాడు.

నాగ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన రణ్ బీర్
అలియా భట్ రణ్ బీర్ కపూర్ ఇద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇక వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసింది. నాగార్జున కూడా ఒక రకంగా అలియా బట్ నీ జీవితంలో అతిపెద్ద కానుక, మరి మా కోసం ఏదైనా కానుక తెచ్చావా అని అడుగగా.. రణ్ బీర్ కపూర్ తన తాత పృథ్వి రాజ్ తో అక్కినేని నాగేశ్వరరావు ఉన్న ఫోటో ను ప్రేక్షకులకు చూపించారు.

రాజమౌళి మనసు గెలుచుకున్న మానస్
ఫైనల్ 5 కంటెస్టెంట్స్ ఇప్పటివరకు ఈ స్థాయికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అలాగే మీలో మీకు నచ్చే విషయం ఏమిటి అని నాగార్జున అడిగారు. ఇక బ్రహ్మాస్త్ర అనే ఒక వస్తువును వారి చేతిలో పెట్టుకొని దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం ఇవ్వగా మానస్ ద కామ్ బిఫోర్ స్ట్రామ్ అని.. చెప్పడంతో అది నా మనసుకి చాలా బాగా నచ్చింది అతను ఈ టాస్క్ లో గెలిచినట్లు రాజమౌళి తేల్చేశారు.

అలియా ఒక లక్ష్మీ బాంబ్..
ఇక రణ్ బీర్ కపూర్ కూడా సైలెంట్ గా ఉంటూనే.. తుఫాను ముందు ప్రశాంతంగా ఉంటాడు అని వివరణ ఇచ్చాడు. అయితే ఎందుకు కౌంటర్ గా రణబీర్ కపూర్ చాలా సరదాగా ఒక వివరణ ఇచ్చాడు. ఆలియా ప్రశాంతంగా ఉండే ముందు ఒక పెద్ద సౌండ్ పొల్యూషన్ అని కాకపోతే అది చాలా మంచి సౌండ్.. అందరినీ కలుపుకొని పోయే గుణం అని కూడా తెలియజేశాడు. అంతే కాకుండా ఆమె ఒక లక్ష్మీ బాంబ్ అని కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ఇక ఆ మాటలకు అందరు కూడా చాలా నవ్వుతూ కనిపించారు.


Click it and Unblock the Notifications











